Coronavirus in India: గుడ్ న్యూస్..దేశంలో తగ్గిన మరణాల రేటు, తాజాగా 93,337 మందికి కరోనా, 53,08,015 కు చేరుకున్న మొత్తం కేసుల సంఖ్య, 1247 మంది మృతితో 85,619కు పెరిగిన మరణాల సంఖ్య
దీంతో దేశంలో మొత్తం బాధితులసంఖ్య 53,08,015 చేరింది. అయితే రికవరీ రేటు సైతం భారీగానే నమోదవుతుంది. గడిచిన 24 గంటల్లో 1247 మంది మరణించారు. ఇప్పటివరకు ఒక్కరోజులో ఇంతమంది చనిపోవడం ఇదేమొదటిసారి. దీంతో మొత్తం మరణాల సంఖ్య 85,619కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
New Delhi, September 19: భారత్‌తో గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో 93,337 కరోనా పాజిటివ్ కేసులు (Coronavirus in India) నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం బాధితులసంఖ్య 53,08,015 చేరింది. అయితే రికవరీ రేటు సైతం భారీగానే నమోదవుతుంది. గడిచిన 24 గంటల్లో 1247 మంది మరణించారు. ఇప్పటివరకు ఒక్కరోజులో ఇంతమంది చనిపోవడం ఇదేమొదటిసారి. దీంతో మొత్తం మరణాల సంఖ్య 85,619కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
దేశంలో కరోనా (COVID-19 Pandemic) నుంచి కోలుకున్న వారి సంఖ్య 42,08,432కు చేరుకోగా, యాక్టివ్ కేసుల సంఖ్య10,13,964గా ఉంది. దేశ వ్యాప్తంగా నమోదైన మొత్తం కరోనా కేసుల్లో యాక్టివ్ కేసులు 19.52 శాతం ఉన్నాయి. దేశంలో కరోనా రికవరీ రేటు 78.86 శాతానికి పెరగ్గా, మరణాల రేటు 1.62 శాతానికి పడిపోయిందని కేంద్రం తెలిపింది.
కరోనావైరస్ మహమ్మారి దేశంలోకి ప్రవేశించి నేటికి 232 రోజులు పూర్తయ్యింది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఒక్కరోజులో ఎన్నికేసులు నమోదయ్యాయో, అంతమంది డిశ్చార్జ్ కావడం ఇది ఆరవసారి. ఫిబ్రవరి 14న తొలిసారిగా ఈ విధంగా జరిగింది. అప్పుడు కేరళలో ముగ్గురు కరోనా నుంచి కోలుకోగా, ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు. మధ్యప్రదేశ్‌లో కొత్తగా 2,552 కరోనా కేసులు నమోదు కాగా, రాజస్థాన్‌లో 1,817, బీహార్ లో 1,147, మహారాష్ట్రలో 21,656, ఉత్తరప్రదేశ్‌లో 6,494 కేసులు నమోదయ్యాయి.
దేశ రాజధానిలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2 లక్షల 38 వేలకు చేరుకున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 4,127 కరోనా కేసులు నమోదు కాగా.. డిశ్ఛార్జ్ అయిన వారి సంఖ్య 3,568 కాగా 30 మంది కరనాతో మృతి చెందారు. దీంతో ఇప్పటిక వరకు దేశ రాజధానిలో నమోదైన కేసుల సంఖ్య 2,38,828లకు చేరుకోగా.. మృతి చెందిన వారి సంఖ్య 4,907గా ఉంది. కోవిడ్ చికిత్స పూర్తి చేసుకుని 2,01,671 మంది సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ప్రస్తుతం ఢిల్లీ యాక్టివ్ కేసుల సంఖ్య 32,250 గా ఉన్నాయి.