Coronavirus in India: కరోనా విశ్వరూపం..11 రోజుల్లో 12 వేల మంది మృతి, 10 లక్షల కేసులు నమోదు, తాజాగా 94,373 మందికి కోవిడ్-19, దేశంలో 47,54,357కు చేరుకున్న కరోనా కేసుల సంఖ్య

నిన్న అత్య‌ధికంగా 97 వేల పాజిటివ్ కేసులు న‌మోద‌వ‌గా, నేడు 94 వేల‌కుపైగా రికార్డ‌య్యాయి. దీంతో దేశంలో క‌రోనా కేసులు 47 ల‌క్ష‌ల మార్కును దాటాయి. దేశంలో గ‌త 24 గంట‌ల్లో కొత్త‌గా 94,372 మంది క‌రోనా బారిన‌ప‌డ్డారు. దీంతో మొత్తం క‌రోనా కేసులు 47,54,357కు (Coronavirus Cases in India) చేరాయి. ఇప్ప‌టివ‌ర‌కు న‌మోదైన పాజి‌టివ్ కేసుల్లో 9,73,175 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. మ‌రో 37,02,595 మంది క‌రోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. నిన్న ఒక్క‌రోజే దేశ‌వ్యాప్తంగా 78,399 మంది క‌రోనా నుంచి కోలుకున్నారు.

Coronavirus in India (Photo Credits: PTI)

New Delhi, September 13: దేశంలో గ‌త ఐదు రోజులుగా ప్ర‌తిరోజు 90 వేల‌కుపైగా పాజిటివ్ కేసులు (Coronavirus in India) న‌మోద‌వుతున్నాయి. నిన్న అత్య‌ధికంగా 97 వేల పాజిటివ్ కేసులు న‌మోద‌వ‌గా, నేడు 94 వేల‌కుపైగా రికార్డ‌య్యాయి. దీంతో దేశంలో క‌రోనా కేసులు 47 ల‌క్ష‌ల మార్కును దాటాయి. దేశంలో గ‌త 24 గంట‌ల్లో కొత్త‌గా 94,372 మంది క‌రోనా బారిన‌ప‌డ్డారు. దీంతో మొత్తం క‌రోనా కేసులు 47,54,357కు (Coronavirus Cases in India) చేరాయి. ఇప్ప‌టివ‌ర‌కు న‌మోదైన పాజి‌టివ్ కేసుల్లో 9,73,175 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. మ‌రో 37,02,595 మంది క‌రోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. నిన్న ఒక్క‌రోజే దేశ‌వ్యాప్తంగా 78,399 మంది క‌రోనా నుంచి కోలుకున్నారు.

దేశంలో ఇప్ప‌టివ‌ర‌కు క‌రోనాతో 78,586 మంది (Coronavirus Deaths) చ‌నిపోయారు. నిన్న కొత్త‌గా 1,114 మంది మృతిచెందారని కేంద్ర ఆరోగ్య‌శాఖ ప్ర‌క‌టించింది. దేశంలో నిన్న‌టివ‌ర‌కు 5,62,60,928 మందికి క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించామ‌ని భార‌తీయ వైద్య ప‌రిశోధ‌నా మండ‌లి వెల్ల‌డించింది. నిన్న ఒక్క‌రోజే 10,71,702 న‌మూనాల‌ను ప‌రీక్షించామని తెలిపింది.సెప్టెంబరు నెలలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. పదకొండు రోజుల్లోనే 10 లక్షల కేసులు నమోదు కాగా 12 వేల మంది మృతి చెందారు.

దేశంలో కరోనా మరణాలు ఎక్కువగా మహారాష్ట్రలోనే సంభవించాయి. ఈ రాష్ట్రంలో ఒక్క రోజే 24,886 కేసులు వచ్చాయి. కొత్త కేసుల్లో 37 శాతం, మరణాల్లో 25 శాతం మహారాష్ట్రవే కావడం గమనార్హం. మరోవైపు భారత్‌లో వైరస్‌ తొలి కేసు నమోదైన కేరళలో శుక్రవారంతోనే బాధితుల సంఖ్య లక్ష దాటింది. దీంతో దేశంలో లక్ష కేసులు దాటిన 13వ రాష్ట్రంగా నిలిచింది. ఏప్రిల్‌ చివరికి రోజుకు 500 కేసులు నమోదైన కేరళలో కట్టడి చర్యలతో.. తర్వాత ఏక సంఖ్యకు పరిమితమయ్యాయి. అక్కడ అన్‌లాక్‌ తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది.

మళ్లీ ఆస్పత్రిలో చేరిన అమిత్ షా, శ్వాస సంబంధ సమస్యలతో ఎయిమ్స్‌లో చేరిన కేంద్ర హోం మంత్రి, కార్డియో న్యూరో టవర్‌లో అడ్మిట్

ఢిల్లీలో నాలుగో రోజూ 4 వేలపైగా కేసులు వచ్చాయి. శనివారం గరిష్ఠంగా 4,321 పాజిటివ్‌లు నమోదయ్యాయి. దేశంలోనే తొలిసారిగా ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్‌-3లో కరోనా పరీక్షల కేంద్రాన్ని ప్రారంభించారు. ఇక ఉత్తరప్రదేశ్‌ (7 వేలు), కర్ణాటక (9,500)లోనూ రోజువారీ బాధితులు భారీగా ఉంటున్నారు. కర్ణాటక (130), తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ (77), యూపీ (76)లకు తోడు పంజాబ్‌ (63), బెంగాల్‌ (57)ల్లో వైర్‌సతో చనిపోతున్నవారు అత్యధికంగా ఉంటున్నారు.

ఆశలు ఆవిరి, ఆక్స్‌ఫ‌ర్డ్ కోవిడ్ వ్యాక్సిన్ ట్ర‌య‌ల్స్‌ నిలిపివేయండి, సీరం ఇన్స్‌టిట్యూట్‌కు ఆదేశాలు జారీ చేసిన డీసీజీఐ, అస్వ‌స్థ‌త‌కు లోనైన టీకా తీసుకున్న వాలంటీర్

తమిళనాడులో కరోనా వైరస్‌ వ్యాప్తి నిలకడగా ఉన్నా, కోలుకుంటున్న బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది. రాష్ట్రంలో శనివారం ఒక్కరోజే 6,227 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా 5,495 మందికి పాజిటివ్‌ లక్షణాలు బయట పడటంతో కరోనా బాధితుల సంఖ్య 4,97,066కు పెరిగింది. చెన్నైలో 978 మందికి పాజిటివ్‌ లక్షణాలు బయటపడ్డాయి. శనివారం 86,486 మందికి కరోనా పరీక్షలు జరిపారు. కర్ణాటకలో శనివారం 9,140 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో బాధితుల సంఖ్య 4.50 లక్షలకు చేరువైంది. బెంగళూరులో 3,552 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యారు. తాజాగా 94 మందితో కలిపి ఇప్పటి వరకు రాష్ట్రంలో కొవిడ్‌తో 7,161 మంది మృత్యువాతపడ్డారు.