Coronavirus Outbreak: కరోనాపై భారీ ఊరట..కోలుకుని ఇంటికి వెళ్లిన 2,19,838 మంది పేషెంట్లు, దేశంలో తాజాగా 3,46,786 మందికి కరోనా, 2,624 మంది మృతితో 1,89,544 కు పెరిగిన మరణాల సంఖ్య

వీటికి సంబంధించిన వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం... నిన్న‌ 2,19,838 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,66,10,481 కు (COVID-19 Cases) చేరింది.

Coronavirus in India (Photo Credits: PTI)

New Delhi, April 24: దేశంలో కొత్త‌గా 3,46,786 మందికి కరోనా నిర్ధారణ (India Coronavirus) అయింది. వీటికి సంబంధించిన వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం... నిన్న‌ 2,19,838 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,66,10,481 కు (COVID-19 Cases) చేరింది. గడచిన 24 గంట‌ల సమయంలో 2,624 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,89,544 కు (Covid Deaths) పెరిగింది.

దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,38,67,997 మంది కోలుకున్నారు. 25,52,940 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. దేశ వ్యాప్తంగా 13,83,79,832 మందికి వ్యాక్సిన్లు వేశారు. కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 27,61,99,222 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 17,53,569 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.

ఇండియాలో కొనసాగుతున్న కరోనా రెండో వేవ్ లో భాగంగా, మే 11 నుంచి 15 మధ్య కాలానికి 33 నుంచి 35 లక్షల వరకూ యాక్టివ్ కేసులు ఉండే అవకాశాలు ఉన్నాయని ఐఐటీ శాస్త్రవేత్తలు హెచ్చరించారు. ఆపై మే నెలాఖరు నాటికి కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తుందని వారు అంచనా వేశారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 24.28 లక్షల యాక్టివ్ కేసులు ఉండగా, మే రెండో వారానికి వీటి సంఖ్య మరో 10 లక్షలు పెరుగుతుందని కాన్పూర్, హైదరాబాద్ ఐఐటీలు సంయుక్తంగా నిర్వహించిన అధ్యయనంలో వెల్లడించింది.

మే నెలలో మరింతగా కరోనా ఉగ్రరూపం, మరణాలు అత్యధిక స్థాయిలో నమోదయ్యే అవకాశం, సంచలన విషయాలను వెల్లడించిన యుఎస్ ఐఎంహెచ్‌ఈ అధ్యయనం

ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్, తెలంగాణ తదితర ప్రాంతాలకు చెందిన శాస్త్రవేత్తలు ఈ అధ్యయనంలో పాల్గొన్నారు. కొత్త కేసుల విషయంలో మహారాష్ట్ర, చత్తీస్ గఢ్ రాష్ట్రాలు ఈ నెల 30లోగా పీక్ దశకు చేరుకుంటాయని, ఆపై తగ్గుతూ వస్తాయని వారు అంచనా వేశారు. యాక్టివ్ కేసుల సంఖ్య ఎంత వేగంగా పెరుగుతూ వస్తోందో, అంతే వేగంగా తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయని, మే నెల ఆసాంతానికి నాటకీయ పరిణామాల మధ్య కేసుల సంఖ్య దిగి వస్తుందని అధ్యయనానికి నాయకత్వం వహించిన కాన్పూర్ ఐఐటీలోని డిపార్ట్ మెంట్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ మనీంద్ర అగర్వాల్ అంచనా వేశారు.

కాగా, ఈ అధ్యయనంలో వెల్లడైన అంశాలు ఇంకా ప్రచురితం కాలేదు. గత గణాంకాలను పోలుస్తూ 'సూత్ర' మోడల్ లో ఈ అధ్యయనం చేసినట్టు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. గతంలో నిర్వహించిన అధ్యయనాల్లో లక్షణాలు లేని రోగుల సంఖ్యను గణించలేదని తెలిపారు. ఇటీవల ఓ అధ్యయనాన్ని నిర్వహించిన శాస్త్రవేత్తలు ఏప్రిల్ 15 నాటికే కేసుల సంఖ్య గరిష్ఠానికి చేరుతుందని అంచనా వేయగా, వాస్తవ పరిస్థితుల్లో అది జరగలేదన్న సంగతి విదితమే.