Coronavirus In India: ఫ్యామిలీ సభ్యుల మధ్య వేగంగా కరోనా వ్యాప్తి, రికార్డు స్థాయిలో గత 24 గంటల్లో 13,586 కోవిడ్-19 కేసులు నమోదు, దేశంలో 3 లక్షల 80 వేలకు చేరిన కరోనా కేసుల సంఖ్య
భారత్‌లో గడచిన 24 గంటల్లో 13,586 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఒక్కరోజు వ్యవధిలోనే 336 మంది చనిపోయారు. దేశవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 3,80,532కు చేరింది. ప్రస్తుతం 1,63,248 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకూ కరోనా ( India Coronavirus) నుంచి కోలుకొని 2,04,711 మంది డిశ్చార్జ్ అయ్యారు. కరోనా బారినపడి మరణించిన వారి సంఖ్య (Coronavirus deaths) 12,573కు పెరిగింది. మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీలో కరోనా ఉధ్దృతి కొనసాగుతోంది. ప్రపంచంలో కరోనా కేసుల సంఖ్యలో అమెరికా, బ్రెజిల్, రష్యా తర్వాతి స్థానంలో భారత్ కొనసాగుతోంది.
Mumbai, June 19: దేశంలో కరోనా పాజిటివ్ కేసులు (Coronavirus In India) రోజూ 10వేలకు పైనే నమోదవుతున్నాయి. భారత్‌లో గడచిన 24 గంటల్లో 13,586 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఒక్కరోజు వ్యవధిలోనే 336 మంది చనిపోయారు. దేశవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 3,80,532కు చేరింది. ప్రస్తుతం 1,63,248 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకూ కరోనా ( India Coronavirus) నుంచి కోలుకొని 2,04,711 మంది డిశ్చార్జ్ అయ్యారు. మేకుల రాడ్‌లతో చైనా దాడి, 76 మంది జవాన్లకు గాయాలు, అందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని తెలిపిన ఇండియన్ ఆర్మీ, 15 రోజుల్లో డ్యూటీలో చేరుతారని ప్రకటన
కరోనా బారినపడి మరణించిన వారి సంఖ్య (Coronavirus deaths) 12,573కు పెరిగింది. మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీలో కరోనా ఉధ్దృతి కొనసాగుతోంది. ప్రపంచంలో కరోనా కేసుల సంఖ్యలో అమెరికా, బ్రెజిల్, రష్యా తర్వాతి స్థానంలో భారత్ కొనసాగుతోంది.
ఇదిలా ఉంటే కుటుంబసభ్యుల్లో ఒకరి నుంచి మరొకరికి కొవిడ్ వైరస్ అతి వేగంగా సంక్రమిస్తుందని ఓ అధ్యయనంలో తేలింది. సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్(సార్స్), మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్(మెర్స్) వైర్‌సల కన్నా వేగంగా.. కలిసి జీవించే వారు, వారి కుటుంబసభ్యుల్లో కరోనా వ్యాప్తి చెందుతోందని వెల్లడైంది. ఈ అధ్యయనం లాన్సెట్ జర్నల్‌లో ప్రచురితమైంది.
S. No. | Name of State / UT | Active Cases* | Cured/Discharged/Migrated* | Deaths** | Total Confirmed cases* |
---|---|---|---|---|---|
1 | Andaman and Nicobar Islands | 11 | 33 | 0 | 44 |
2 | Andhra Pradesh | 3637 | 3789 | 92 | 7518 |
3 | Arunachal Pradesh | 93 | 10 | 0 | 103 |
4 | Assam | 2114 | 2654 | 9 | 4777 |
5 | Bihar | 1925 | 5056 | 44 | 7025 |
6 | Chandigarh | 62 | 306 | 6 | 374 |
7 | Chhattisgarh | 708 | 1228 | 10 | 1946 |
8 | Dadra and Nagar Haveli and Daman and Diu | 45 | 13 | 0 | 58 |
9 | Delhi | 26669 | 21341 | 1969 | 49979 |
10 | Goa | 596 | 109 | 0 | 705 |
11 | Gujarat | 6191 | 17819 | 1591 | 25601 |
12 | Haryana | 4528 | 4556 | 134 | 9218 |
13 | Himachal Pradesh | 205 | 382 | 8 | 595 |
14 | Jammu and Kashmir | 2340 | 3144 | 71 | 5555 |
15 | Jharkhand | 711 | 1198 | 11 | 1920 |
16 | Karnataka | 2847 | 4983 | 114 | 7944 |
17 | Kerala | 1358 | 1415 | 21 | 2794 |
18 | Ladakh | 591 | 95 | 1 | 687 |
19 | Madhya Pradesh | 2308 | 8632 | 486 | 11426 |
20 | Maharashtra | 53915 | 60838 | 5751 | 120504 |
21 | Manipur | 407 | 199 | 0 | 606 |
22 | Meghalaya | 13 | 30 | 1 | 44 |
23 | Mizoram | 129 | 1 | 0 | 130 |
24 | Nagaland | 90 | 103 | 0 | 193 |
25 | Odisha | 1357 | 3144 | 11 | 4512 |
26 | Puducherry | 155 | 109 | 7 | 271 |
27 | Punjab | 962 | 2570 | 83 | 3615 |
28 | Rajasthan | 2792 | 10742 | 323 | 13857 |
29 | Sikkim | 65 | 5 | 0 | 70 |
30 | Tamil Nadu | 23068 | 28641 | 625 | 52334 |
31 | Telangana | 2531 | 3301 | 195 | 6027 |
32 | Tripura | 515 | 639 | 1 | 1155 |
33 | Uttarakhand | 690 | 1386 | 26 | 2102 |
34 | Uttar Pradesh | 5477 | 9239 | 465 | 15181 |
35 | West Bengal | 5216 | 7001 | 518 | 12735 |
Cases being reassigned to states | 8927 | 8927 | |||
Total# | 163248 | 204711 | 12573 | 380532 |
చైనాలో కాంటాక్ట్ ట్రేసింగ్ ద్వారా కరోనా వైరస్ సోకిన 349 మంది, వారి సమీప బంధువులు 1,964 మంది వివరాలను విశ్లేషించారు. లక్షణాలు బయటపడకముందే వారికి వైరస్ సోకినట్టు అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ ఫ్లోరిడా పరిశోధకులు నిర్వహించిన ఈ అధ్యయనంలో తేలింది.
కుటుంబసభ్యులతో కలిసి ఉంటున్న 60 ఏళ్లపైబడిన వారికి అతి సులువుగా కరోనా సంక్రమిస్తున్నట్టు స్పష్టమైంది. కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటూ కాంటాక్ట్‌గా తేలినవారి వల్ల వైరస్ వ్యాప్తి చెందడం లేదని పరిశోధకులు వివరించారు. వైరస్ సంక్రమించినా లక్షణాలు బయట పడనివారి వల్ల ముప్పు ఎక్కువగా ఉన్నట్టు తమ అధ్యయనంలో తేలిందని యూనివర్సిటీ ఆఫ్ ఫ్లోరిడాకు చెందిన యాంగ్‌యాంగ్ చెప్పారు.