COVID-19 in India: నెగిటివ్ వచ్చిన 12 మందికి మళ్లీ పాజిటివ్, మధ్యప్రదేశ్ గవర్నరు అంత్యక్రియల్లో పాల్గొన్న మంత్రికి కరోనా, మ‌ణిపూర్‌లో మళ్లీ పూర్తిస్థాయి లాక్ డౌన్, దేశంలో 12 లక్షల దాటిన కోవిడ్-19 కేసులు

నిన్న 37 వేల‌కుపైచిలుకు క‌రోనా కేసులు న‌మోద‌వ‌గా, ఈరోజు రికార్డు స్థాయిలో 45 వేల‌కుపైగా మంది క‌రోనావైరస్ బారిన‌ప‌డ్డారు. భారత్‌లో గ‌త 24 గంట‌ల్లో కొత్త‌గా 45,720 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. దీంతో దేశంలో మొత్తం క‌రోనా కేసుల సంఖ్య (COVID-19 in India) 12,38,635కు చేరింది. అదేవిధంగా ఇప్ప‌టివ‌ర‌కు న‌మోదైన మొత్తం కేసుల్లో 4,26,167 కేసులు యాక్టివ్‌గా ఉండ‌గా, మ‌రో 7,82,606 మంది బాధితులు కోలుకున్నారు.

COVID-19 in India (Photo Credits: PTI)

New Delhi, July 23: దేశంలో గ‌త వారం రోజులుగా 32 వేల‌కు పైగా పాజ‌టివ్ కేసులు (Coronavirus cases in India) న‌మోద‌వుతున్నాయి. నిన్న 37 వేల‌కుపైచిలుకు క‌రోనా కేసులు న‌మోద‌వ‌గా, ఈరోజు రికార్డు స్థాయిలో 45 వేల‌కుపైగా మంది క‌రోనావైరస్ బారిన‌ప‌డ్డారు. భారత్‌లో గ‌త 24 గంట‌ల్లో కొత్త‌గా 45,720 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. దీంతో దేశంలో మొత్తం క‌రోనా కేసుల సంఖ్య (COVID-19 in India) 12,38,635కు చేరింది. అదేవిధంగా ఇప్ప‌టివ‌ర‌కు న‌మోదైన మొత్తం కేసుల్లో 4,26,167 కేసులు యాక్టివ్‌గా ఉండ‌గా, మ‌రో 7,82,606 మంది బాధితులు కోలుకున్నారు. చైనాపై నిప్పులు చెరిగిన అమెరికా, హౌస్టన్‌ చైనా రాయబార కార్యాలయం మూసివేత, కోవిడ్-19 వ్యాక్సిన్ అధ్యయన పత్రాలు చైనా హ్యాక్ చేసిందని ఆరోపణలు

ఈరోజు ఉద‌యం వ‌ర‌కు కొత్త‌గా 1129 మంది మ‌ర‌ణించారు. దేశంలో ఒకేరోజు న‌మోదైన క‌రోనా మ‌ర‌ణాల్లో ఇదే అత్య‌ధికం. దీంతో ఇప్ప‌టివ‌రకు క‌రోనాతో మ‌రణించిన‌వారి సంఖ్య (COVID 19 Deaths in India) 29,861కు పెరిగింది. ‌ దేశంలో జూలై 22 నాటికి 1,50,75,369 మందికి క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించామ‌ని భార‌తీయ వైద్య ప‌రిశోధ‌నా మండ‌లి ప్ర‌క‌టించింది. నిన్న ఒకేరోజు దేశ‌వ్యాప్తంగా 3,50,823 న‌మూనాల‌ను ప‌రీక్షించామ‌ని వెల్ల‌డించింది. ప్రియమైన వారిని కోల్పోయినందుకు చాలా బాధగా ఉంది, భారత్‌లో వరదల విధ్వంసానికి ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం తెలిపిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్

కేర‌ళ‌లో (Coronavirus in Kerala) బుధ‌వారం ఒక్క రోజే సుమారు వెయ్యికి పైగా క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో మ‌ళ్లీ పూర్తి స్థాయి లాక్‌డౌన్ అమ‌లు చేయాల‌ని సీఎం పిన‌ర‌యి విజ‌య‌న్ భావిస్తున్నారు. బుధ‌వారం కేర‌ళ‌లో మొత్తం 1038 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. దాంట్లో 24 మంది హెల్త్ వ‌ర్క‌ర్లు, అయిదుగురు కౌన్సిల‌ర్లు ఉన్నారు. దీంతో రాష్ట్రంలో వైర‌స్ సంక్ర‌మించిన వారి సంఖ్య 15,032కు చేరింది. మ‌ర‌ణించిన వారి సంఖ్య 45కు చేరుకున్న‌ది.

వెస్ట్‌ బెంగాల్‌లో (coronavirus in West Bengal) గడిచిన 24 గంటల్లో పశ్చిమ బెంగాల్‌లో 2291 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో పాటు 39 మరణాలు కూడా నమోదు కావడంతో మొత్తం మరణాల సంఖ్య 1221కి చేరింది. రాష్ర్టంలో మొత్తం 49,321 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇందులో 18,450 కేసులు ప్రస్తుతం కరోనా సోకి ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా మిగతా వారు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.

మ‌హారాష్ట్ర‌లో (Coronavirus in maharashtra) బుధ‌వారం ఒక్క‌రోజే కొత్త‌గా 10,576 మందికి క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,37,607కు చేరింది. అందులో 1,87,769 మంది వైర‌స్ బారి నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జి అయ్యారు. 1,36,980 యాక్టివ్ కేసులు ఉన్నాయి. బుధ‌వారం ఒక్క‌రోజే కొత్తగా 280 మంది క‌రోనా బాధితులు మృతిచెందారు. దీంతో ఆ రాష్ట్రంలో న‌మోదైన మొత్తం క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య 12,556కు చేరింది.

పంజాబ్‌లో (Coronavirus in Punjab) గడిచిన 24 గంటల్లో 414 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 11301కు చేరింది. గడిచిన 24 గంటల్లో ఆరుగురు కరోనాతో మృతి చెందగా మొత్తం మృతుల సంఖ్య 269కి చేరింది. ఇప్పటివరకు 7,641 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జి అయినట్లు ఆరోగ్య శాఖ మంత్రి తెలియజేశారు.

త‌మిళ‌నాడులో (Coronavirus in Tanil Nadu) బుధ‌వారం కూడా కొత్తగా 5,849 మందికి క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. దీంతో ఆ రాష్ట్రంలో న‌మోదైన మొత్తం క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,86,492కు చేరింది. అందులో వైర‌స్ బారి నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జి అయిన వారు పోగా మ‌రో 51,765 యాక్టివ్ కేసులు ఉన్నాయి. బుధ‌వారం కొత్త‌గా 74 మంది క‌రోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో త‌మిళ‌నాడులో మొత్తం క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య 2700కు చేరింది.

దేశంలో దాదాపు రెండు నెల‌లపాటు కంప్లీట్ లాక్‌డౌన్ విధించినా క‌రోనా పాజిటివ్ కేసులు పెరిగాయే త‌ప్ప త‌గ్గ‌లేదు. ఈ నేప‌థ్యంలో కేంద్రం క్ర‌మంగా క‌రోనా నిబంధ‌న‌లు స‌డ‌లిస్తూ వ‌చ్చింది. దీంతో పాజిటివ్ కేసులు మ‌రింత ఎక్కువ‌య్యాయి. దీంతో ప‌లు రాష్ట్రాలు ఇప్పుడు మ‌రోసారి కంప్లీట్ లాక్‌డౌన్ బాట‌ప‌డుతున్నాయి. తాజాగా మ‌ణిపూర్ (Manipur Lockdown) సైతం మ‌రో రెండు వారాలు కంప్లీట్ లాక్‌డౌన్ విధిస్తున్న‌ట్లు తెలిపింది. గురువారం మ‌ధ్యాహ్నం రెండు గంట‌ల నుంచి లాక్‌డౌన్ అమ‌ల్లోకి రానుంద‌ని వెల్ల‌డించింది.

జమ్మూకశ్మీర్‌లోని (Jammu Kashmir) ఓ కూల్ డ్రింక్స్ ప్లాంట్‌లో పనిచేసే 12 మందికి కరోనా పరీక్షల్లో నెగిటివ్‌ అని తేలి డిశ్చార్జ్ అయిన తర్వాత మళ్లీ 2 గంటలోనే పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. జమ్మూకశ్మీర్‌లోని ఓ ప్రభుత్వ ఆస్పత్రిలో 12 మంది రెండు సార్లు కోవిడ్-19 పరీక్షలు చేయించుకున్నారు. తొలి సారి నెగిటివ్ అని రావడంతో ఆస్పత్రి సిబ్బంది వారిని ఇంటికి పంపించేశారు. రెండు గంటల తరువాత రెండో కరోనా పరీక్ష ఫలితాలు రాగా అందులో పాజిటివ్ అని తేలింది. అయితే ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారమే తాము నడుచుకున్నామని అక్కడి వైద్యులు చెబుతున్నారు.

మధ్యప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ మంత్రి అరవింద్ భండోరియాకి కరోనా పాజిటివ్ (Madya Pradesh Minister Tested Covid 19 positive) అని తేలడంతో గురువారం ఉదయ అతన్ని భోపాల్ నగరంలోని చిరయూ వైద్యకళాశాల ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో వైద్యులు మంత్రికి చికిత్స అందిస్తున్నారు. గవర్నరు లాల్జీటాండన్ అంత్యక్రియల్లో పాల్గొన్న మంత్రికి కరోనా సోకడం కలకలం రేపింది. కరోనా సోకిన మంత్రి మంగళవారం ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో పాల్గొన్నారు. లాల్జీటాండన్ అంత్యక్రియల్లో, మంత్రివర్గ సమావేశంలో పలువురితో కలిసి పాల్గొన్న మంత్రికి కరోనా సోకడంతో ఆయా కార్యక్రమాల్లో పాల్గొన్న వారందరూ ఆందోళన చెందుతున్నారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటివరకు 24,095 మందికి కరోనా వైరస్ సోకింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 756 మంది కరోనాతో మరణించారు.

ప్రధాని మోదీ పార్లమెంటరీ నియోజకవర్గం వారణాసిలో ((Coronavirus in Varanasi) కరోనా వైర‌స్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. గ‌డ‌చిన 48 గంటల్లో 200కి పైగా పాజిటివ్‌ కేసులు న‌మోద‌య్యాయి. అయితే దీనికి మించిన మ‌రొక ముప్పు వార‌ణాసిలో చోటుచేసుకుంది. 30 మందికి పైగా క‌రోనా బాధితులు త‌ప్పుడు ఫోన్ నంబర్, చిరునామా ఇచ్చి మాయ‌మ‌య్యారు. ఆరోగ్యశాఖ బృందం వీరికి చికిత్స అందించేందుకు ప్ర‌య‌త్నించిన‌ప్పుడు ఈ విష‌యం వెలుగుచూసింది.

దీంతో ఆరోగ్యశాఖ సిబ్బందిలో ఆందోళ‌న మొద‌ల‌య్యింది. ఆ క‌రోనా బాధితుల ఆచూకీ తెలుసుకునే ప‌నిని ఆరోగ్యశాఖ పోలీసులకు అప్పగించింది. కాగా ఈ బాధితులంతా వారణాసిలోని వివిధ పోలీస్‌స్టేషన్ ప‌రిధుల్లోని ప్రాంతాల‌కు చెందిన‌వార‌ని తెలుస్తోంది. వీరు బ‌య‌ట తిరుగుతుండ‌టంతో స్థానికుల్లో ఆందోళ‌న నెల‌కొంది.