America vs China Corona War: చైనాపై నిప్పులు చెరిగిన అమెరికా, హౌస్టన్‌ చైనా రాయబార కార్యాలయం మూసివేత, కోవిడ్-19 వ్యాక్సిన్ అధ్యయన పత్రాలు చైనా హ్యాక్ చేసిందని ఆరోపణలు
America vs China War (Photo-PTI)

Washington, July 23: అమెరికా, చైనా మధ్య విభేదాలు (America vs China War) రోజురోజుకీ  వేడెక్కుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అమెరికాలో హౌస్టన్‌లోని చైనా రాయబార కార్యాలయాన్ని(Beijing’s consulate in Houston) మూసివేయాలని అమెరికా ఆదేశించింది. హ్యూస్టన్‌లో చైనా కాన్సులేట్‌ జనరల్‌ (Chinese Consulates in US) గూఢచర్య కార్యకలాపాలకు పాల్పడుతోందన్న ఆరోపణలతో అమెరికా ప్రభుత్వం (America Govt) కాన్సులేట్‌ను మూసివేయాల్సిందిగా చైనాని ఆదేశించింది. దీని కోసం 72 గంటలు గడువు ఇచ్చినట్లు చైనా కమ్యూనిస్ట్ పార్టీకి చెందిన అధికార గ్లోబల్ టైమ్స్ పత్రిక ఎడిటర్ హు జిజిన్ బుధవారం ట్వీట్ చేశారు. ప్రియమైన వారిని కోల్పోయినందుకు చాలా బాధగా ఉంది, భారత్‌లో వరదల విధ్వంసానికి ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం తెలిపిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్

మరోవైపు హౌస్టన్‌లోని చైనా రాయబార కార్యాలయం (Chinese Consulates) ప్రాంగణం వద్ద భారీగా పేపర్లు, ఫైళ్లను తగులబెట్టడంతో మంటలు, పొగ కనిపించినట్లు స్థానిక మీడియా సంస్థలు పేర్కొన్నాయి. దీంతో అగ్నిమాపక యంత్రాలు అక్కడికి చేరుకున్నాయని, అయితే చైనా రాయబార అధికారులు వాటిని లోనికి అనుమతించలేదని తెలిపాయి. అనంతరం కొంతసేపటికి మంటలను ఆర్పివేసినట్లు స్థానిక టీవీ చానళ్లు వెల్లడించాయి. హౌస్టన్‌లోని రాయబార కార్యాలయాన్ని శుక్రవారం సాయంత్రానికి చైనా అధికారులు ఖాళీ చేయనున్నట్లు అధికార వర్గాల ద్వారా తెలిసిందని స్థానిక మీడియా పేర్కొంది.

Here's China Global times Editor Tweet

అమెరికా మేధో సంపత్తిని, ప్రైవేటు సమాచారాన్ని కాపాడుకోవడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మోర్గా ఓర్టాగస్‌ మంగళవారం విలేకరులకు తెలిపారు. అయితే చైనా (China) ఏ తరహా గూఢచర్యానికి దిగిందో ఆమె స్పష్టంగా వెల్లడించలేదు. అమెరికా నిర్ణయం అత్యంత దారుణమైనదని, అన్యాయమైనదని చైనా విరుచుకుపడింది.. అమెరికా (America) తన తప్పుడు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని, ప్రతీకార చర్యలు తప్పవని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వాంగ్‌ వెన్‌బిన్‌హెచ్చరించారు.

ఇదిలా ఉంటే అమెరికా, చైనా (America and China) మధ్య కోవిడ్‌ వ్యాక్సిన్‌ అధ్యయనాల హ్యాకింగ్‌ చిచ్చు కాన్సులేట్‌ మూసివేతకు ఆదేశాల వరకు వెళ్లినట్టుగా అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకులు అభిప్రాపడుతున్నారు. కరోనా వ్యాక్సిన్‌కు సంబంధించిన అధ్యయన వివరాలను తస్కరించారంటూ అమెరికా న్యాయశాఖ ఇద్దరు చైనా జాతీయుల్ని వేలెత్తి చూపిన రోజే హ్యూస్టన్‌లో కాన్సులేట్‌ మూసివేతకు ఆదేశాలు వెలువడ్డాయి. ఆ ఇద్దరు వ్యక్తులు అమెరికాలో జరుగుతున్న కరోనా వ్యాక్సిన్‌ అధ్యయనాలను తస్కరించడానికి ప్రయత్నించారని అమెరికా ఆరోపిస్తోంది.

కరోనావైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించడంలో అమెరికా ప్రథమ స్థానంలో ఉన్నదని, ఆ తర్వాతి స్థానం ఇండియాదేనని (India) అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (US President Donald Trump) తెలిపారు. అమెరికాలో 5 కోట్ల పరీక్షలు నిర్వహించగా, భారత్‌లో 1.2 కోట్ల పరీక్షలు నిర్వహించినట్లు చెప్పారు. మంగళవారం శ్వేతసౌధంలో ఆయన మాట్లాడుతూ.. కరోనా మహమ్మారి తీవ్రత తగ్గుముఖం పట్టేముందు అది మరింత తీవ్రమయ్యే అవకాశం ఉన్నదని అమెరికన్లను హెచ్చరించారు.

కాగా డిసెంబర్‌నాటి కల్లా 10 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేసేలా ఫైజర్‌ కంపెనీతో అమెరికా ఒప్పందం కుదుర్చుకుంది. ఇందుకు దాదాపు రూ.14.9 వేల కోట్లు వెచ్చించనున్నట్లు ఆ దేశ హెల్త్‌ అండ్‌ హ్యూమన్‌ సర్వీసెస్‌ సెక్రటరీ అలెక్స్‌ అజర్‌ బుధవారం వెల్లడించారు. ఒప్పందంలో భాగంగా మరో 50 కోట్ల వ్యాక్సిన్‌ డోసులను అమెరికా కొనుగోలు చేసేందుకు వీలుందని ఆయన తెలిపారు.

కోవిడ్-19 మహమ్మారిని నివారించేందుకు చైనాతో సహా ముందుగా ఏ దేశమైతే వ్యాక్సిన్‌ను (Corona Vaccine) తీసుకొస్తుందో వారితో కలిసి పని చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు. తొలి కరోనా వ్యాక్సిన్‌ను చైనా అభివృద్ధి చేస్తే డ్రాగన్‌తో కలిసి పనిచేసేందుకు సిద్ధమా అన్న ప్రశ్నకు ట్రంప్‌ బదులిస్తూ మనకు మంచి ఫలితాలు అందించే ఎవరితోనైనా పనిచేసేందుకు తాము సిద్ధమఅని అన్నారు. కోవిడ్‌-19కు ఔషధాల తయారీతో పాటు వ్యాక్సిన్‌ అభివృద్ధిలో అమెరికాలో పురోగతి సాధించామని ట్రంప్‌ వెల్లడించారు.