Republic Day 2020: ఢిల్లీలో అదరహో అనిపించిన తెలుగు రాష్ట్రాల శకటాలు, అబ్బురపరిచిన భారత సైనికుల విన్యాసాలు, రాజ్‌పథ్ వద్ద అంబరాన్ని తాకిన భారత గణతంత్ర దినోత్సవం వేడుకలు, ఢిల్లిలో జరిగిన రిపబ్లిక్ డే 2020 పరేడ్‌పై విశ్లేషణాత్మక కథనం

దేశ రాజధాని ఢిల్లీలో (Delhi) 71వ గణతంత్ర వేడుకలు ( India Republic Day 2020) ఘనంగా జరుగుతున్నాయి. భారత గణతంత్ర దినోత్సవం వేడుకలు రాజ్‌పథ్ (Rajpath) వద్ద అంబరాన్ని తాకుతున్నాయి. కాగా రాజ్‌పథ్ వేదికగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ (Ram Nath Kovind) జాతీయ జెండాను ఆవిష్కరించారు.

India Republic Day 2020 Andhra pradesh and Telangana Tableaux At Republic Day Parade (photo-ANI)

New Delhi, January 26: దేశ రాజధాని ఢిల్లీలో (Delhi) 71వ గణతంత్ర వేడుకలు ( India Republic Day 2020) ఘనంగా జరిగాయి. భారత గణతంత్ర దినోత్సవం వేడుకలు రాజ్‌పథ్ (Rajpath) వద్ద అంబరాన్ని తాకాయి.  రాజ్‌పథ్ వేదికగా సాగిన ఈ వేడుకల్లో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ (Ram Nath Kovind) జాతీయ జెండాను ఆవిష్కరించారు.

జెండా ఆవిష్కరణ సందర్భంగా ఇండియన్ ఆర్మీ 21-గన్ సెల్యూట్ చేసింది. లెఫ్టినెంట్ కల్నల్ సి.సందీప్ సారథ్యంలోని 2233 ఫీల్ట్ బ్యాటరీ కమాండ్ ఆధ్వర్యంలో గన్ సెల్యూట్ జరిగింది.

Republic Day 2020 Greetings కోసం క్లిక్ చేయండి 

ముఖ్య అతిథిగా బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో (Jair Bolsonaro) హాజరయ్యారు. త్రివిద దళాల గౌరవ వందనం స్వీకరించడంతో కన్నులపండువగా పెరేడ్ మొదలైంది.

Chief Guest at the celebrations this year

ఈ ఉత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ, ( Prime Minister Narendra Modi) రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, హోం శాఖ మంత్రి అమిత్‌షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, బీజేపీ అగ్రనేత ఎల్‌కే అడ్వానీ, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి, కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్, పలు రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు తదితరులు ఈ వేడుకలకు హాజరయ్యారు.

Here's The tableaux of Karnataka and Uttar Pradesh and Andhra Pradesh

ప్రత్యేక ఆకర్షణగా ఆంధ్రప్రదేశ్ శకటం

ఆంధ్రప్రదేశ్ శకటం (Andhra Pradesh tableaux) ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రాష్ట్ర సంస్కృతి సంప్రదాయాలు, సాంస్కృతిక వారసత్వ కళారూపాలు, ప్రజల జీవనశైలిని ప్రతిబింబిస్తూ...ఆకర్షణీయంగా రూపొందించిన ప్రగతిరథం రాజ్‌పథ్‌లో కనువిందు చేసింది.

భారత గణతంత్ర దినోత్సవం, ఇండియా వైభవాన్ని విశ్యవ్యాప్తం చేసిన గూగుల్ డూడుల్

తిరుమల శ్రీవారి ఆలయం, బ్రహ్మోత్సవాలు, కూచిపూడి నృత్యాలు, ప్రఖ్యాతిగాంచిన కొండపల్లి బొమ్మలు, సహజరంగుల కలంకారీ అద్దకాలతో కూడిన ఏపీ శకటం అందరినీ ఆకట్టుకుంది.

Here's tableaux of Telangana and Assam

ప్రత్యేకంగా ఆకట్టుకున్న తెలంగాణ 'బతుకమ్మ' శకటం

తెలంగాణ శకటం (Telangana tableaux) అందరినీ ఆకర్షించింది. రాష్ట్ర సంస్కృతి, చరిత్ర, వాస్తు కళలు, పండుగలను చాటేలా ఈ శకటం రూపుదిద్దుకుంది. ముందు భాగంలో రాష్ట్ర పండుగ బతుకమ్మ ఉత్సవాలు, మధ్య భాగంలో సమ్మక్క, సారక్కల గద్దెలను ప్రతిబింబించేలా అమ్మవారి భారీ రూపం కొలువుతీరాయి. స్వరాష్ట్రం సిద్దించాక 2015 లో తొలిసారి తెలంగాణ తరఫున శకటం ప్రదర్శించే అవకాశం రాష్ట్రానికి దక్కింది. ఐదేండ్ల తర్వాత మరోసారి తెలంగాణ శకటం ప్రదర్శించబడింది.

Here's ANI Tweet

ఈ శకటాలతో పాటుగా తెలంగాణ, రాజస్థాన్, తమిళనాడు సహా 21 రాష్ట్రాలకు చెందిన శకటాలు రిపబ్లిక్ పరేడ్‌లో పాల్గొని ఆహూతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అసోం నుంచి వెదురు, కేన్ కళాకృతులతో రూపొందిన శకటం, విలేజ్ పోగ్రాంతో రూపొందించిన జమ్మూకశ్మీర్ శకటం, జానపద కళారీతులతో కూడిన తమిళనాడు శకటం, విశ్వమానవ విలువలను ప్రతిబిబించే అనుభవ మంటప కాన్సెప్ట్‌తో రూపొందించిన కర్ణాటక శకటాలతో పాటు రాజస్థాన్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్‌, ఒడిశా శకటాలు కూడా ఈ పరేడ్‌లో పాల్గొన్నాయి.

Here's Tableau of Rajasthan 

రాజ్‌పథ్‌లో జరిగిన పరేడ్ ఈసారి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. త్రివిధ దళాలు, శకటాల ప్రదర్శనలు, సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. శత్రువుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించే ఆయుధాలు ఈ సారి గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో కొలువుదీరాయి.

Here's ANI Tweet

సరికొత్త ఆయుధాలు సైన్యం అమ్ములపొదిలోకి చేరాయి. ఇక అమర వీరులకు నివాళులర్పించే కార్యక్రమం ఈ సారి జాతీయ యుద్ధ స్మారకం వద్ద నిర్వహించారు. మిలటరీ పరేడ్‌లో భాగంగా యాంటీ శాటిలైట్ ఆయుధం శక్తి, బ్యాటిల్ ట్యాంక్ భీష్మ, చినూక్, అపాచీ హెలికాప్టర్ల విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

Here's ANI Tweet

ఇక ప్రపంచంలోనే అతిపెద్ద హార్స్ రెజిమెంట్ గ్వాలియర్ ల్యాన్సర్ కూడా గౌరవ వందనం సమర్పించింది. రిపబ్లిక్ డే పరేడ్‌లో గుర్రాలు స్పెషల్ ఎట్రాక్షన్గా నిలిచాయి. ఇక ఈ వేడుకల్లో పారాచ్యూట్ రెజిమెంట్ ప్రత్యేకంగా పాల్గొంది. నింగిలో నుంచి పారాగ్లైడింగ్ చేస్తూ విన్యాసాలు చేశారు సైనికులు.

PM Modi's Republic Day turban tradition

ఎయిర్ ఫోర్స్ నుంచి 144 మంది ఎయిర్ వారియర్స్ గౌరవ వందనం సమర్పించారు. ఈసారి గణతంత్ర వేడుకలో రాష్ట్రాల శకటాల్లో అన్నింటి కంటే ముందు ఛత్తీస్గఢ్ శకటం ప్రదర్శించారు. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి 16, కేంద్ర మంత్రిత్వ శాఖల నుంచి ఆరు చొప్పున మొత్తం 22 శకటాలు పాల్గొన్నాయి.

Here's ANI Tweet

దేశీయ బోఫోర్స్‌గా పేరున్న ధనుష్ శతఘ్నులను ఈ సారి రిపబ్లిక్ డే పరేడ్ లో ప్రదర్శించారు. చినూక్ హెలికాప్టర్లు గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఠీవీగా దర్శనమిచ్చాయి. వీటి ప్రదర్శనలు ప్రత్యేకంగా నిలిచాయి. అపాచీ హెలికాప్టర్ల ప్రదర్శన ఆకట్టుకుంది.

Here's ANI Tweet

సీఆర్పీఎఫ్ మహిళా బైకర్స్ బృందం రాయల్ ఎన్ఫీల్డ్ బైక్లపై చేసే విన్యాసాలు ఈ పరేడ్కి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. మొత్తం 65 మంది సభ్యుల ఈ బైకర్స్ బృందం కొన్ని రోజులుగా రాజ్పథ్లో కఠోర సాధన చేసి దీనిలో పాల్గొంది. ఈ బృందం రాయల్ ఎన్పీల్డ్ 350 సీసీ బుల్లెట్ బైక్లపై విన్యాసాలను ప్రదర్శించింది. ఈ క్రమంలో తొమ్మిది రకాల విన్యాసాలు చేశారు.

రాజ్‌పథ్ రిపబ్లిక్ డే వేడుకలకు ముందు ప్రధాని నరేంద్ర మోదీ ఇండియా గేట్ సమీపంలోని నేషనల్ వార్ మెమోరియల్ వద్ద అమరవీరులకు నివాళులర్పించారు. స్మారక స్థూపం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి దేశ ప్రజల తరఫున శ్రద్ధాంజలి ఘటించారు.

Primi minister Modi At Rajpath

చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్, ఆర్మీ చీఫ్ జనరల్ నరవనే, నావికాదళ చీఫ్ అడ్మిరల్ కరంబీర్ సింగ్, వాయిసేనాధిపతి ఎయిర్ మార్షల్ ఆర్‌కేఎస్ బదూరియా, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. అనతరం రాజ్‌పథ్ వద్ద రిపబ్లిక్ డే వేడుకలకు మోదీ బయలుదేరి వెళ్లారు.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

Share Now