COVID-19 in India: కరోనాతో 2206 మంది మృతి, దేశ వ్యాప్తంగా 67,152కి చేరిన కరోనావైరస్ కేసుల సంఖ్య, యాక్టివ్‌గా 44,029 కేసులు, నేడు ముఖ్యమంత్రులతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్

వైరస్‌ కట్టడికి ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా.. నియంత్రణ మాత్రం సాధ్యం కావడంలేదు. దేశంలో కరోనా (2020 Coronavirus Pandemic in India) పాజిటివ్‌ కేసుల సంఖ్య 67,152కి పెరిగింది. గత 24 గంటల్లో కొత్తగా 4,200 కరోనా కేసులు నమోదవగా, 97 మంది మరణించారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సోమవారం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ఈ ప్రాణాంతక వైరస్‌ వల్ల దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 2206 మంది మృతిచెందారు. ఈ వైరస్‌ బారిన పడిన 20,916 మంది కోలుకోగా, 44,029 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.

COVID-19 In India (Photo-PTI)

New Delhi, May 11: దేశంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య (COVID-19 in India) విపరీతంగా పెరుగుతోంది. వైరస్‌ కట్టడికి ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా.. నియంత్రణ మాత్రం సాధ్యం కావడంలేదు. దేశంలో కరోనా (2020 Coronavirus Pandemic in India) పాజిటివ్‌ కేసుల సంఖ్య 67,152కి పెరిగింది. గత 24 గంటల్లో కొత్తగా 4,200 కరోనా కేసులు నమోదవగా, 97 మంది మరణించారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సోమవారం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ఈ ప్రాణాంతక వైరస్‌ వల్ల దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 2206 మంది మృతిచెందారు. ఈ వైరస్‌ బారిన పడిన 20,916 మంది కోలుకోగా, 44,029 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.రేపట్నించి తిరిగి ప్రారంభం కానున్న ప్యాసెంజర్ రైలు సర్వీసులు, ఈరోజు నుంచే బుకింగ్స్ ప్రారంభం, ఐఆర్‌సిటిసి వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌ బుకింగ్‌కు మాత్రమే అనుమతి

దేశంలో అత్యధిక కేసులు నమోదవుతున్న మహారాష్ట్రలో (Maharashtra) మొత్తం కరోనా బాధితుల సంఖ్య 22171కి చేరింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 832 మంది మరణించారు. గుజరాత్‌లో (Gujarath) మొత్తం 8194 కరోనా కేసులు నమోదవగా, ఈ వైరస్‌ వల్ల 493 మంది మృతిచెందారు. తమిళనాడులో (Tamil Nadu) కరోనా కేసుల సంఖ్య 7204కు చెరింది. అదేవిధంగా ఢిల్లీలో (Delhi) 6923కు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. మధ్యప్రదేశ్‌లో ఇప్పటివరకు 3614 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవగా, 215 మంది మృతిచెందారు.

ఈ నేపథ్యంలోనే సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) వీడియో కాన్పరెన్స్‌ ద్వారా సమావేశం కానున్నారు. వైరస్‌ను కట్టడి చేయడం, లాక్‌డౌన్‌ ఆంక్షల సడలింపు వంటి అంశాలపై మోదీ చర్చించనున్నారు. మరోవైపు కోవిడ్‌ (COVID-19) కేసుల తీవ్రత దృష్ట్యా ప్రస్తుతం రెడ్‌ జోన్లుగా ఉన్న వాటిని ఆరెంజ్, గ్రీన్‌ జోన్లుగా మార్పుచెందేలా చూడటం, ఆర్థిక కార్యకలాపాలకు ఊతమివ్వడంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది.