Afghanistan Crisis: తాలిబన్ చెర నుంచి 168 మంది భారత్‌కు, సిబ్బందితో సహా 200 మందిని ఇప్పటికే తరలించిన ఇండియా, కాబూల్ విమానాశ్రయానికి అమెరికన్లు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేసిన అమెరికా
తాలిబన్ అరాచక పాలనలో జీవించలేక పలువురు దేశాన్ని వీడుతున్నారు. ఇక కాబూల్ నుంచి భారత వైమానిక దళానికి చెందిన -17 విమానంలో (Indian Air Force C-17 Aircraft) 168 మంది భారత్‌కు చేరుకున్నారు.
Kabul, August 22: తాలిబన్ల రాకతో ఆఫ్ఘనిస్తాన్ (Afghanistan )లో దారుణ పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. తాలిబన్ అరాచక పాలనలో జీవించలేక పలువురు దేశాన్ని వీడుతున్నారు. ఇక కాబూల్ నుంచి భారత వైమానిక దళానికి చెందిన -17 విమానంలో (Indian Air Force C-17 Aircraft) 168 మంది భారత్‌కు చేరుకున్నారు. ఇవాళ ఉదయం కాబూల్‌లోని హమీద్ కర్జాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు నుంచి బయలు దేరిన విమానం ఘజియాబాద్‌లోని హిండన్ ఎయిర్‌ఫోర్స్ బేస్‌లో (Hindan Air Base From Kabul) ల్యాండ్ అయ్యింది.
విమానంలో 107 మంది భారతీయులతో సహా 168 మంది ఉన్నారు. ఇప్పటికే ఐఏఎఫ్ రెండు C-17 విమానంలో భారత రాయబార కార్యాలయ సిబ్బందితో సహా 200 మందిని భారత్ ఇప్పటికే తరలించింది. మొదట సోమవారం 40 మందిని, రెండో విడుతలో భారతీయ దౌత్యవేత్తలు, అధికారులు, భద్రతా సిబ్బంది సహా 150 మందిని తరలించిన విషయం తెలిసిందే. ఇక ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్ విమానాశ్రయం వద్దకు ఎవరూ వెళ్లొద్దని అమెరికన్లను ఆ దేశ ప్రభుత్వం హెచ్చరించింది.
అక్కడ పరిస్థితి గందరగోళంగా ఉన్నదని ఆందోళన వ్యక్తం చేసింది. ఇటువంటి పరిస్థితుల్లో పర్యటనలు వాయిదా వేసుకోవాలని సూచించింది. తాలిబన్ల ఆధీనంలోకి వెళ్లిన ఆఫ్ఘనిస్థాన్‌లో ప్రస్తుతం అమెరికన్లు ఎంత మంది ఉంటారన్నది అమెరికా ప్రభుత్వానికి సమాచారం లేదు.
Here's Video
తమ పౌరులపై తాలిబన్లు ప్రతీకారం తీర్చుకుంటారేమోనని ఆందోళనగా ఉందని వైట్ హౌస్ కమ్యూనికేషన్ల డైరెక్టర్ కేట్ బెడింగ్ ఫీల్డ్ చెప్పారు. ఆఫ్ఘన్‌లో ఉన్న తమ పౌరులను గుర్తించే ప్రక్రియ మొదలు పెట్టామన్నారు. ఆఫ్ఘనిస్థాన్ నుంచి శరవేగంగా సైనిక బలగాలను ఉపసంహరించడంపై విమర్శలు వెల్లువెత్తడంతో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వివరణ ఇచ్చుకున్నారు. తమ పౌరుల్ని హింసిస్తే సహించేది లేదని తాలిబన్లను హెచ్చరించారు. ఉగ్రవాదాన్ని ఉపేక్షించబోమని కూడా చెప్పారు.