Indian Student Killed in Ukraine: బెంగళూరుకు చేరుకున్న నవీన్ శేఖరప్ప మృతదేహం, విమానాశ్రయంలో నవీన్‌ పార్థివదేహానికి నివాళి అర్పించిన కర్ణాటక సీఎం బసవరాజ్​ బొమ్మై

తెల్లవారుజామున ప్రత్యేక విమానంలో సోమవారం నవీన్‌ మృతదేహం బెంగళూరుకు (Mortal Remains of Naveen Shekarappa Arrive in Bengaluru) చేరుకున్నది.

Karnataka Student Naveen Shekarappa Gyanagoudar's Family. (Photo Credits: IANS)

Bengaluru, Mar 21: ఉక్రెయిన్‌పై రష్యా దాడి నేపథ్యంలో చనిపోయిన భారతీయ విద్యార్థి నవీన్‌ శేఖరప్ప జ్ఞానగౌడర్‌ మృతదేహం (Indian Student Killed in Ukraine) స్వదేశానికి చేరుకున్నది. తెల్లవారుజామున ప్రత్యేక విమానంలో సోమవారం నవీన్‌ మృతదేహం బెంగళూరుకు (Mortal Remains of Naveen Shekarappa Arrive in Bengaluru) చేరుకున్నది. దాదాపు 20 రోజుల తర్వాత కర్ణాటకలోని అతని స్వగ్రామమైన హవేరీకి చేరుకుంది. నవీన్ స్వగ్రామంలో ఆయన కుటుంబసభ్యులు నివాళులర్పించారు. ఉక్రెయిన్‌లో ఎంబీబీఎస్‌ చదువుతున్న నవీన్‌.. మార్చి 1న ఖార్కీవ్‌లో జరిగిన పేలుళ్లలో ప్రాణాలు కోల్పోయాడు. ఆహారం కోసం బయటకు వెళ్లి క్యూలో నిల్చున్న సమయంలో రష్యా బాంబు దాడిలో నవీన్ ప్రాణాలు కోల్పోయాడు.

కాగా, అతని మృతదేహాన్ని పరిశోధనల కోసం దేవనాగరెలోని ఎస్‌ఎస్‌ మెడికల్‌ కాలేజీకి దానం చేయనున్నారు. బెంగళూరు విమానాశ్రయంలో నవీన్‌ పార్థివదేహానికి కర్ణాటక సీఎం బసవరాజ్​ బొమ్మై నివాళులు (Karnataka CM Pays Homage) అర్పించారు. నవీన్‌కు అంతమ సంస్కారాలు నిర్వహించేందుకు వీలుగా అతని భౌతికకాయాన్ని స్వదేశానికి తీసుకు వచ్చేందుకు కృషి చేసిన కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. బాండు దాడిలో అతను ప్రాణాలు కోల్పోవడం తనను బాధించిందని సీఎం చెప్పారు.

భార‌తీయ విద్యార్థి మృతిపై రష్యా విచారణ‌, న‌వీన్ శేఖ‌ర‌ప్ప కుటుంబానికి ప్ర‌గాఢ సానుభూతి చెబుతున్నానని వెల్లడి

మరోవైపు నవీన్ శేఖరప్ప ఎలా మృతి చెందాడన్న దానిపై కచ్చితమైన సమాచారం ఏదీ లేదని భారత విదేశాంగ శాఖ కార్యదర్శి హర్ష్ వర్ధన్ అనగా నవీన్ మృతిపై విచారణ జరిపిస్తామని రష్యా పేర్కొంది. అయితే నవీన్ మృతితో ఉక్రెయిన్‌లో ఉన్న మిగతా భారతీయ విద్యార్థులు కూడా భయాందోళనకు గురయ్యారు. దీంతో భారత ప్రభుత్వం వారిని ఇక్కడ తరలించే ప్రక్రియను వేగవంతం చేసింది.