రష్యా చేసిన దాడిలో భార‌తీయ మెడిక‌ల్ విద్యార్థి న‌వీన్ శేఖ‌ర‌ప్ప మృతి చెందిన సంగతి విదితమే. ఈ మృతి ప‌ట్ల విచార‌ణ చేప‌ట్ట‌నున్న‌ట్లు ర‌ష్యా తెలిపింది. ర‌ష్యా దౌత్య‌వేత్త డెన్నిస్ అలిపోవ్ ఈ విష‌యాన్ని చెప్పారు.న‌వీన్ శేఖ‌ర‌ప్ప కుటుంబానికి ప్ర‌గాఢ సానుభూతి చెబుతున్నానని, ఈ విషాదం ప‌ట్ల భార‌త ప్ర‌జ‌ల‌కు కూడా సానుభూతి వ్య‌క్తం చేస్తున్న‌ట్లు అలిపోవ్ తెలిపారు. భార‌త ప్ర‌జ‌ల క్షేమం కోసం ఏదైనా చేయ‌డానికి ర‌ష్యా సిద్దంగా ఉన్న‌ట్లు ఆయ‌న చెప్పారు. ఖార్కివ్‌తో పాటు యుద్ధ ప్రాంతాల్లో చిక్కుకున్న భార‌తీయులను సుర‌క్షితంగా త‌ర‌లించాల‌ని ర‌ష్యా, ఉక్రెయిన్ రాయ‌బారుల్ని ఇండియా కోరింది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)