Third Indian Student Death in US: అమెరికాలో కలవరపెడుతున్న భారత విద్యార్థుల మరణాలు, తాజాగా మరో విద్యార్థి శ్రేయాస్ రెడ్డి అనుమానాస్ప‌ద‌స్థితిలో మృతి, ఈ ఏడాదిలో ఇది నాలుగో ఘ‌ట‌న‌

అగ్రరాజ్యంలో ఉన్నత విద్యకు వెళ్లిన విద్యార్థులు వరుసగా మృతి చెందుతున్నారు. తాజాగా భార‌తీయ విద్యార్థి శ్రేయాస్ రెడ్డి బెణిగేరి అమెరికాలో అనుమానాస్ప‌ద‌స్థితిలో మృతి చెందారు. ఒహియోలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకోగా, పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Dead Body. (Photo Credits: Pixabay)

New York, Feb 2:  అమెరికాలో భారత విద్యార్థులు మరణాలు కలకలం రేపుతున్నాయి. అగ్రరాజ్యంలో ఉన్నత విద్యకు వెళ్లిన విద్యార్థులు వరుసగా మృతి చెందుతున్నారు. తాజాగా భార‌తీయ విద్యార్థి శ్రేయాస్ రెడ్డి బెణిగేరి అమెరికాలో అనుమానాస్ప‌ద‌స్థితిలో మృతి చెందారు. ఒహియోలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకోగా, పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు. అయితే శ్రేయాస్ రెడ్డి మృతికి కార‌ణాలు తెలియ‌రాలేద‌ని పోలీసులు పేర్కొన్నారు. అంత‌కు మించిన వివ‌రాలేమి వెల్ల‌డించ‌లేదు. జిమ్ కు వెళ్ళి వస్తుండగా అమెరికాలో తెలుగు విద్యార్థిని కత్తితో తలలో పొడిచిన దుండగుడు, పరిస్థితి విషమం, బ్రతికే అవకాశం కేవలం 5 శాతమే అంటున్న వైద్యులు

శ్రేయాస్ రెడ్డి సిన్సినాటిలోని లిండ‌ర్న్ స్కూల్ ఆఫ్ బిజినెస్ విద్యార్థిగా పోలీసులు గుర్తించారు. వారం రోజుల్లోనే ముగ్గురు విద్యార్థులు మృతిచెందగా, 2024 ప్రారంభ‌మైన నెల రోజుల వ్య‌వ‌ధిలోనే అమెరికాలో న‌లుగురు భార‌తీయ విద్యార్థులు మృతి చెంద‌డం క‌ల‌క‌లం సృష్టిస్తోంది.

ట్వీట్ ఇదిగో..

నీల్ ఆచార్య‌, వివేక్ షైనీ, ఆకుల్ ధావ‌న్ అనే ముగ్గురు విద్యార్థులు జ‌న‌వ‌రి నెల‌లో చ‌నిపోయారు. తాజాగా శ్రేయాస్‌రెడ్డి మృతిచెందాడు.

యుఎస్‌లో తెలుగు యువతి మృతి విలువ 11 వేల డాలర్లు, అమెరికా పోలీస్ వెకిలీ కామెంట్లపై భారత్ సీరియస్, విచారణకు పిలుపు

శ్రేయాస్ రెడ్డి మృతిపై న్యూయార్క్‌లోని ఇండియ‌న్ కాన్సులేట్ ట్వీట్ చేసింది. ఒహియోలో భారతీయ సంతతికి చెందిన విద్యార్థి శ్రేయాస్ రెడ్డి బెణిగేరి దురదృష్టవశాత్తూ మృతి చెందడం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్న‌ట్లు పేర్కొంది. పోలీసుల విచారణ జరుగుతోంది. అత‌ని మృతికి గ‌ల కార‌ణాలు తెలుసుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నాం. శ్రేయాస్ రెడ్డి కుటుంబంతో ట‌చ్‌లో ఉన్న‌ట్లు ట్వీట్‌లో ఇండియ‌న్ కాన్సులేట్ పేర్కొంది.

వివేక్ సైనీ(25 ) అనే భారత విద్యార్థిని నిరాశ్రయుడైన ఓ వ్యక్తి దుకాణంలో కొట్టి చంపాడు. సైనీ ఇటీవలే అమెరికాలో ఎంబీఏ పూర్తి చేశాడు. ఓ దుకాణంలో ఉద్యోగం చేస్తున్నాడు. ఈ క్రమంలో దాడికి కొన్ని రోజుల ముందు నుంచి మాదకద్రవ్యాలకు బానిసైన జూలియన్ ఫాల్క్‌నర్ అనే నిరాశ్రయునికి సైనీ సహాయం చేశాడు. అయినప్పటికీ సైనీని ఫాల్క్‌నర్ హత్య చేశాడు.

ఇండియానా రాష్ట్రంలోని పర్డ్యూ యూనివర్సిటీలో చదువుతున్న భారతీయ విద్యార్థి నీల్ ఆచార్య గత వారం శవమై కనిపించాడు. జాన్ మార్టిన్సన్ హానర్స్ కాలేజ్ ఆఫ్ పర్డ్యూ యూనివర్శిటీలో కంప్యూటర్ సైన్స్ చేస్తున్నాడు .

ఇటీవలే ఆదిత్య అద్లాఖా(26)అనే భారతీయ విద్యార్థిని హత్యకు గురయ్యారు. సిన్సినాటి యూనివర్శిటీలో ఆదిత్య అద్లాఖా పీహెచ్‌డీ విద్యార్థి. ఒహియోలోని కారులో ఆయన్ని దుండగులు కాల్చి చంపారు. ఇల్లినాయిస్ విశ్వవిద్యాలయంలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌ చదువుతున్న అకుల్ ధావన్(18) అనే భారత సంతతి విద్యార్థి కూడా మృతి చెందాడు.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif