Coronavirus in india: సెప్టెంబర్ 1నాటికి 35 లక్షలకు కరోనా కేసులు, అంచనా వేసిన ఐఐఎస్సీ, దేశంలో 10 లక్షలు దాటిన కోవిడ్-19 కేసులు..25 వేల మరణాలు, ఒక్క రోజులో 34,956 మందికి కొత్తగా కోవిడ్ 19 పాజిటివ్
దేశంలో వైరస్ బారిన పడిన వారి సంఖ్య 10 లక్షల మార్కును దాటేసింది. మొత్తం కరోనావైరస్ కేసులు (Coronavirus Cases in India) 10,03,832 కు చేరింది. మరోవైపు మరణాల సంఖ్య ( Coronavirus Deaths in india) 25 వేలను దాటింది. గత 24 గంటల్లో 687 మందితో కలిపి మొత్తం మరణాల సంఖ్య 25,602 కు పెరిగింది. అయితే రికవరీ రికార్డు స్థాయిలో పెరిగిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖవెల్లడించింది. 24 గంటల్లో 22,942 బాధితులు కోలుకున్నట్టు ప్రకటించింది. కాగా దేశంలో తొలి కోవిడ్-19 కేసు జనవరి 30 న కేరళలో నమోదైంది. దాదాపు 170 రోజుల్లోనేబాధితుల సంఖ్య 10 లక్షలకు చేరింది.
New Delhi, July 17: భారతదేశంలో కరోనా మహమ్మారి (Coronavirus in india) మరింత వేగంగా విస్తరిస్తోంది. దేశంలో వైరస్ బారిన పడిన వారి సంఖ్య 10 లక్షల మార్కును దాటేసింది. మొత్తం కరోనావైరస్ కేసులు (Coronavirus Cases in India) 10,03,832 కు చేరింది. మరోవైపు మరణాల సంఖ్య ( Coronavirus Deaths in india) 25 వేలను దాటింది. గత 24 గంటల్లో 687 మందితో కలిపి మొత్తం మరణాల సంఖ్య 25,602 కు పెరిగింది. అయితే రికవరీ రికార్డు స్థాయిలో పెరిగిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖవెల్లడించింది. 24 గంటల్లో 22,942 బాధితులు కోలుకున్నట్టు ప్రకటించింది. కాగా దేశంలో తొలి కోవిడ్-19 కేసు జనవరి 30 న కేరళలో నమోదైంది. దాదాపు 170 రోజుల్లోనేబాధితుల సంఖ్య 10 లక్షలకు చేరింది. నేటి నుండి అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభం, వెల్లడించిన పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి
కరోనా కేసుల్లో మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఉత్తర్‌ప్రదేశ్, ఢిల్లీ, తెలంగాణ, పశ్చిమబెంగాల్, బీహార్ రాష్ట్రాల్లోనే 80 శాతం ఉండడం గమనార్హం. మొత్తం యాక్టివ్ కేసుల్లో మహారాష్ట్ర, తమిళనాడుల్లోనే 48.15శాతం ఉన్నాయని తెలిపింది. కరోనా వైరస్ తీవ్రతలో మొదటి స్థానంలో ఉన్న మహారాష్ట్రలో గడిచిన ఒక్కరోజులోనే 8641 కేసులు రాగా.. 266 మంది మరణించారు. రెండో స్థానంలో ఉన్న తమిళనాడులో ఒక్క రోజే 4,549 పాజిటివ్‌లు నమోదవగా.. 68మంది మరణించారు. రాష్ట్రంలో కోలుకునేవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది.
కర్ణాటకలో కరోనా బాధితుల సంఖ్య అరలక్ష దాటింది. మహారాష్ట్ర తొలి మహిళా ఎన్నికల కమిషనర్‌గా పనిచేసిన విశ్రాంత ఐఏఎస్ నీలా సత్యనారాయణన్ కరోనాతో చికిత్స పొందుతూ మరణించారు. కొవిడ్ రోగులకు చికిత్స అందిస్తున్న వైద్య సిబ్బంది మానసిక ఆరోగ్యానికి సంబంధించి జాతీయ మానసిక ఆరోగ్యం, న్యూరో సైన్సెస్ సంస్థ మార్గదర్శకాలు జారీ చేసింది. శానిటైజర్లపై 18 శాతం జీఎస్టీ ఎందుకంటే? అవి ఆల్కహాల్ ఉత్పత్తుల క్యాటగిరీలోకి వస్తాయట, ప్రకటనలో వివరించిన కేంద్ర ఆర్థిక శాఖ
భారత్‌లో కరోనా కేసుల సంఖ్య 10,00,000 మార్కును దాటడం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul gandhi) ట్వీట్ చేశారు. కొవిడ్‌పై కేంద్ర ప్రభుత్వం పోరాడుతున్న తీరు సరిగ్గా లేదని, దేశంలో కేసుల సంఖ్య ఈ వారం 10 లక్షలు దాటుతుందని నాలుగు రోజుల క్రితమే రాహుల్ గాంధీ హెచ్చరించారు. తాను చెప్పినట్లుగానే కేసుల సంఖ్య ఆ మార్కును దాటిన విషయాన్ని రాహుల్ గుర్తు చేస్తూ ట్వీట్ చేశారు.
Here's Rahul Gandhi Tweet
'దేశంలో కరోనా కేసుల సంఖ్య 10 లక్షలు దాటింది. ఇదే వేగంతో కొవిడ్-19 కేసులు వ్యాప్తి చెందడం కొనసాగితే ఆగస్టు 10 నాటికి దేశంలో కరోనా సోకిన వారు 20 లక్షల కంటే ఎక్కువ మంది ఉంటారు. ఈ మహమ్మారిని కట్టడి చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రణాళిక బద్ధంగా నిర్దిష్టమైన చర్యలు తీసుకోవాలి' అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.
కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్( Indian Institute of Science) బృందం వచ్చే నెలన్నర రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటుందనేది అంచనా వేసింది. సెప్టెంబరు 1కి పాజిటివ్ కేసులు 35 లక్షలకు చేరతాయని లెక్కగట్టింది! ప్రస్తుతం వైరస్ ఉధృతిని పరిగణనలోకి తీసుకొని అంచనాలు రూపొందించింది. ఒక్క కర్ణాటకలోనే 2.1 లక్షలు నమోదు కావొచ్చని తెలిపింది. 2021 మార్చి చివరికల్లా 1.4 లక్షల యాక్టివ్ కేసులు, 1.88 లక్షల మరణాలు సంభవించొచ్చని ప్రొఫెసర్లు శశికుమార్, దీపక్ నేతృత్వంలోని బృందం అంచనా వేసింది.