Coronavirus: WHO Launches SafeHands Challenge To Prevent Coronavirus (Photo-

New Delhi, July 16: ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్ శానిటైజ‌ర్లు (Hand sanitizers) ఆల్క‌హాల్ ఉత్ప‌త్తుల క్యాట‌గిరీలోకి వ‌స్తాయ‌ని, అందుకే వాటిపై 18 శాతం జీఎస్టీ వ‌సూలు (18% GST on alcohol-based sanitizers) చేయ‌నున్న‌ట్లు అథారిటీ ఫ‌ర్ అడ్వాన్స్ రూలింగ్‌(AAR) పేర్కొన్న‌ది. గోవాకు చెందిన స్ప్రింగ్‌ఫీల్డ్ ఇండియా డిస్టిల్ల‌రీస్ వేసిన పిటిష‌న్‌పై ఏఏఆర్ (GST-Authority for Advance Rulings (AAR) ఈ స్ప‌ష్ట‌త‌నిచ్చింది. అయితే ఈ జీఎస్టీ ఎందుకంటే.. శానిటైజర్లు అన్నవి.. సబ్బులు, యాంటీ బ్యాక్టీరియల్‌ ద్రావకాలు, డెట్టాల్‌ మాదిరే ఇన్ఫెక్షన్‌ కారకాలను నిర్మూలించేవని, కనుక వీటిపై 18 శాతం జీఎస్‌టీ అమలవుతుందని కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. మరో కొత్త వైరస్ బాంబును పేల్చిన చైనా, అంతుచిక్కని వైరస్‌తో న్యుమోనియా సోకి కజకిస్థాన్‌లో వందలాది మంది మృత్యువాత, జాగ్రత్తగా ఉండాలని చైనీయులకు డ్రాగన్ కంట్రీ హెచ్చరిక

శానిటైజర్లలో వినియోగించే పలు రకాల రసాయనాలు, ప్యాకింగ్‌ సామగ్రిపైనా జీఎస్‌టీ 18 శాతం అమల్లో ఉందంటూ బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ‘‘శానిటైజర్లపై జీఎస్‌టీని తగ్గించినట్టయితే అది విలోమ సుంకాల విధానానికి (తుది ఉత్పత్తిపై జీఎస్‌టీ కంటే దాని తయారిలో వినియోగించే సరుకులపై అధిక జీఎస్‌టీ ఉండడం) దారితీస్తుంది. అప్పుడు దిగుమతి చేసుకునే హ్యాండ్‌ శానిటైజర్లు చౌకగా మారతాయి. దీంతో దేశీయ తయారీ దారులకు ప్రతికూలంగా మారుతుందని కేంద్ర ఆర్థిక శాఖ తన ప్రకటనలో వివరించింది.

ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్ నేప‌థ్యంలో ప్ర‌పంచ‌వ్యాప్తంగా హ్యాండ్ శానిటైజ‌ర్ల వినియోగం పెరిగింది. దీంతో హ్యాండ్ శానిటైజ‌ర్లు నిత్యావ‌స‌రాల కేట‌గిరీలోకి వ‌స్తాయ‌ని ఇటీవ‌ల వినియోగ‌దారుల వ్య‌వ‌హారాల మంత్రిత్వ‌శాఖ పేర్కొన్న‌ది. ఈ నేప‌థ్యంలో గోవాకు చెందిన స్ప్రింగ్‌ఫీల్డ్ కంపెనీ తాము ఉత్ప‌త్తి చేస్తున్న హ్యాండ్ శానిటైజ‌ర్ల‌పై జీఎస్టీని మిన‌హాయించాల‌ని ఏఏఆర్‌ను కోరింది. ఆల్క‌హాల్ ఆధారిత హ్యాండ్ శానిటైజ‌ర్లు .. హెచ్ఎస్ఎన్ 3808 కింద‌కు వ‌స్తాయ‌ని, వాటికి 18 శాతం జీఎస్టీ వ‌ర్తిస్తుంద‌ని ఏఏఆర్ పేర్కొన్న‌ది.