Coronavirus in India: తాజాగా 85,362 కొత్త కేసులు, దేశంలో 59 లక్షలు దాటిన కోవిడ్ కేసులు, 93,379 మంది కరోనాతో మృతి, ప్రపంచవ్యాప్తంగా 3.24 కోట్లను దాటిన కరోనా కేసులు

ఇక మహమ్మారి నుంచి కోలుకుని 93,420 మంది డిశ్ఛార్జ్ అయ్యారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 59,03,933 (Coronavirus in India) చేరుకున్నాయి. అలాగే యాక్టివ్‌ కేసులు 9,60,969 ఉండగా, కరోనాకు చికిత్స పొంది డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 48,49,584కు చేరింది.

Coronavirus Cases in India (Photo Credits: PTI)

New Delhi, September 26: భారత్‌లో గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 85,362 కొత్త కేసులు నమోదు కాగా, 1,089 మరణాలు సంభవించాయి. ఇక మహమ్మారి నుంచి కోలుకుని 93,420 మంది డిశ్ఛార్జ్ అయ్యారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 59,03,933 (Coronavirus in India) చేరుకున్నాయి. అలాగే యాక్టివ్‌ కేసులు 9,60,969 ఉండగా, కరోనాకు చికిత్స పొంది డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 48,49,584కు చేరింది.

కరోనా వైరస్‌తో దేశంలో మొత్తం 93,379 మంది ప్రాణాలు విడిచారు. ఇప్పటి వరకు 7,02,69,975 కరోనా వైరస్ (Coronavirus Outbreak in India) నిర్దారణ పరీక్షలు జరిగాయి. ఇక దేశంలో 10 రాష్ట్రాల నుంచే 74 శాతం రికవరీలు నమోదు అవుతున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. అంతేకాకుండా కొత్త కేసుల్లో 75 శాతం కూడా పది రాష్ట్రాల నుంచే వస్తున్నాయని పేర్కొంది.

దేశ రాజధానిలో గడిచిన 24 గంటల్లో 3,827 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2 లక్షల 64 వేలు దాటింది. ఈ మేరకు శుక్రవారం ఢిల్లీ వైద్య ఆరోగ్య శాఖ కరోనాపై హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. నిన్న ఒక్కరోజే 24మంది మృత్యువాత పడగా ఇప్పటివరకు 5,147మంది కరోనాతో మరణించారు. గడిచిన 24 గంటల్లో 4,061మంది కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ అవ్వగా.. మొత్తం 2,28,436 మంది కోలుకున్నారు. ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 30,867గా ఉంది.

చైనాలో మళ్లీ వేల మందికి కొత్త వైరస్, జ్వరం, కీళ్ల నొప్పులు, తలనొప్పి, అవయవాల వాపు, సంతాన సాఫల్యతలకు కారణమవుతున్న బ్రూసిల్లోసిస్‌ బ్యాక్టీరియా, జంతువుల ద్వారా వ్యాప్తి

ప్రపంచంలో మొత్తం కరోనా బాధితులు సంఖ్య 3.24 కోట్లను దాటింది. మృతుల సంఖ్య 9.88 లక్షలు దాటింది. కరోనా మహమ్మారి బారినపడిన 2.39 కోట్ల మంది వ్యాధి నుంచి కోలుకున్నారు. ఇదే సమయంలో కెనడా, బ్రిటన్‌లలో కరోనా సెకెండ్ వేవ్ ప్రారంభమయ్యింది. కాగా కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడో తమ దేశంలో కరోనా సెకెంట్ వేవ్ వార్తలను ఖండించారు. దేశంలో తాజాగా 1300 కేసులు నమోదుకాగా, మొత్తం కేసుల సంఖ్య 1.50 లక్షలకు చేరింది. మృతుల సంఖ్య 10 వేలకు చేరువలో ఉంది.

అదేవిధంగా బ్రిటన్‌లో కొత్తగా 6,634 కరోనా కేసులు నమోదయ్యాయి. దేశంలో ఒక్క రోజులో ఇన్ని కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. కరోనా కారణంగా మొత్తం 41,902 మంది మృతి చెందారు. కాగా బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కూడా తమ దేశంలో కరోనా సెకెంట్ వేవ్ లేదని పేర్కొన్నారు.

మెక్సికో విషయానికొస్తే కరోనా కారణంగా గడచిన 24 గంటల్లో 490 మంది మృతి చెందారు. దీంతో మెక్సికోలో మొత్తం మృతుల సంఖ్య 75 వేలు దాటింది. ఇదే సమయంలో దేశంలో కొత్తగా 5500 కేసులు నమోదయ్యాయి. పాకిస్తాన్‌లో గడచిన 24 గంటల్లో 798 కరోనా కేసులు నమోదుకాగా, మొత్తం కరోనా బాధితుల సంఖ్య 3,09,015కు చేరింది. కరోనాతో కొత్తగా ఏడుగురు మృతి చెందారు. దీంతో పాక్‌లో మొత్తం కరోనా మృతుల సంఖ్య 6,444కు చేరింది.