Brucellosis disease /Representational Image (Photo Credits: Pixabay)

Beijing, Sep 19: చైనాలో కొత్త బ్యాక్టీరియా వ్యాధి వెలుగు చూసింది. జంతువుల ద్వారా బ్రూసిల్లోసిస్‌ బ్యాక్టీరియా (Brucellosis outbreak in China) లాంజౌ నగరంలో తాజాగా బయటకు వచ్చింది. గత సంవత్సరం జంతువుల వ్యాక్సిన్లను తయారుచేసే ప్రభుత్వ యాజమాన్యంలోని బయోఫార్మాస్యూటికల్ ప్లాంట్ (Lanzhou Veterinary Research Institute) నుండి ఈ వైరస్ లీక్ అయింది. దీని ప్రభావంతో వాయువ్య చైనాలో వేలాది మంది బ్రూసిల్లోసిస్‌ బ్యాక్టీరియా వ్యాధిన (Brucellosis Disease) పడ్డారు. 3,245 మందికి బ్రూసెలోసిస్ బారిన పడ్డారని, ఇది తరచుగా సోకిన జంతువులతో లేదా జ్వరాలు, కీళ్ల నొప్పులు మరియు తలనొప్పిని కలిగించే జంతు ఉత్పత్తులతో సన్నిహితంగా ఉండటం వల్ల వస్తుందని లాన్జౌ నగరంలోని ఆరోగ్య అధికారులు తెలిపారు.

మరో 1,401 మంది ఈ వ్యాధికి సోకిందేమోననే అనుమానంతో ముందస్తు పాజిటివ్‌గా పరీక్షించారని, అయితే ఇప్పటివరకు వ్యక్తి నుంచి వ్యక్తికి సంక్రమించినట్లు ఆధారాలు లేవని ఆరోగ్య అధికారులు తెలిపారు. గత ఏడాది జూలై మరియు ఆగస్టు మధ్య జంతువులకు బ్రూసెల్లా వ్యాక్సిన్ల ఉత్పత్తిలో బయోఫార్మాస్యూటికల్ ప్లాంట్ గడువు ముగిసిన క్రిమిసంహారక మందులను ఉపయోగించినట్లు చైనా అధికారులు కనుగొన్నారు

ఓవైపు కరోనా..మరోవైపు ఎబోలా, కాంగోలో ఎబోలా వైరస్ దెబ్బకు నలుగురు మృతి, 11సార్లు కాంగోలో వ్యాధి విజృంభణ, ఆందోళన వ్యక్తం చేసిన డబ్ల్యూహెచ్‌ఓ

లాన్జౌలోని (Lanzhou city) చైనా యానిమల్ హస్బెండరీ లాన్జౌ బయోఫార్మాస్యూటికల్ ఫ్యాక్టరీ నుండి కలుషితమైన వాయువు బ్యాక్టీరియాను కలిగి ఉన్న ఏరోసోల్‌లను ఏర్పాటు చేసింది, తరువాత దీనిని లాన్‌జౌ వెటర్నరీ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌కు గాలి ద్వారా తీసుకువెళ్ళారు, గత ఏడాది డిసెంబర్ నాటికి అక్కడ ఇది 200 మందికి సోకింది. లాన్జౌ విశ్వవిద్యాలయానికి చెందిన 20 మందికి పైగా విద్యార్థులు మరియు అధ్యాపక సభ్యులు, ఈ వైరస్ భారీన పడ్డారు. వీరిలో కొందరు ఆ ఇన్స్టిట్యూట్‌లో ఉన్నారు. తరువాత పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని అక్కడి Xinhua news agency తెలిపింది.

ఈ బ్యాక్టీరియా వ్యాప్తి గొర్రెలు, పశువులు, పందులు ద్వారా ఎక్కువగా వస్తుందని లాన్‌జౌ ఆరోగ్య కమిషన్ శుక్రవారం తెలిపింది. యుఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం, బ్రూసెల్లోసిస్ యొక్క వ్యక్తి నుండి వ్యక్తికి సోకడం "చాలా అరుదు" కాని కొన్ని లక్షణాలు తిరిగి రావచ్చు లేదా అవి ఎప్పటికీ పోవని తెలిపింది. వీటిలో పునరావృత జ్వరాలు, దీర్ఘకాలిక అలసట, గుండె వాపు లేదా ఆర్థరైటిస్ లాంటి లక్షణాలు ఉన్నాయి.

ఈ సంవత్సరం ప్రారంభంలో ఈ బ్యాక్టీరియా బయటకు రావడంపై కర్మాగారం క్షమాపణలు చెప్పింది. కాగా బ్రూసెలోసిస్ వ్యాక్సిన్ ఉత్పత్తి లైసెన్స్ రద్దు చేయబడిందని లాన్జౌ అధికారులు తెలిపారు. రోగులకు పరిహారం అక్టోబర్ నుండి బ్యాచ్ ల వారీగా ప్రారంభమవుతుందని స్థానిక అధికారులు తెలిపారు. ఈ వ్యాధి కారణంగా జ్వరం, కీళ్ల నొప్పులు, తలనొప్పి, అవయవాల వాపు, సంతాన సాఫల్యత కోల్పోయే ప్రమాదం కూడా ఉంటుందని పేర్కొంది. ప్లాంట్‌లో నిర్వహణ సరిగా లేకనే బ్యాక్టీరియా వ్యాప్తి చెందినట్లు భావిస్తున్నారు.