COVID-19 in India: మహారాష్ట్రలో 33వేల మందికి పైగా పిల్లలకు కరోనా, దేశంలో తాజాగా 75,809 కొవిడ్ కేసులు, 42,80,423కు చేరుకున్న మొత్తం కేసుల సంఖ్య, యాక్టివ్‌గా 8,83,697 కేసులు
అలాగే వైరస్ ప్రభావంతో మరో 1,133 మంది మరణించారు. మొత్తం కేసుల సంఖ్య 42,80,423కు (Coronavirus Cases in India) చేరాయి. ప్రస్తుతం 8,83,697 యాక్టివ్ కేసులున్నాయని, 33,23,951 మంది బాధితులు కోలుకున్నారని, 72,775 మంది వైరస్ ప్రభావంతో మరణించారని హెల్త్ మినిస్ట్రీ తెలిపింది. సోమవారం ఒకే రోజు 10,98,621 టెస్టులు చేయగా.. 5,06,50,128 శాంపిల్స్ పరీక్షించినట్లు ఐసీఎంఆర్ వివరించింది.
New Delhi, September 8: దేశంలో తాజాగా దేశంలో 75,809 కొవిడ్ కేసులు (New COVID-19 in India) నిర్ధారణ అయినట్లు కేంద్ర కుటుంబ, ఆరోగ్య మంత్రిత్వశాఖ మంగళవారం తెలిపింది. అలాగే వైరస్ ప్రభావంతో మరో 1,133 మంది మరణించారు. మొత్తం కేసుల సంఖ్య 42,80,423కు (Coronavirus Cases in India) చేరాయి. ప్రస్తుతం 8,83,697 యాక్టివ్ కేసులున్నాయని, 33,23,951 మంది బాధితులు కోలుకున్నారని, 72,775 మంది వైరస్ ప్రభావంతో మరణించారని హెల్త్ మినిస్ట్రీ తెలిపింది. సోమవారం ఒకే రోజు 10,98,621 టెస్టులు చేయగా.. 5,06,50,128 శాంపిల్స్ పరీక్షించినట్లు ఐసీఎంఆర్ వివరించింది.
మహారాష్ట్ర ఆరోగ్యశాఖ లెక్కల ప్రకారం నవజాత శిశువుల నుంచి 10 ఏళ్లలోపు 33 వేల మందికిపైగా పిల్లలకు కరోనా సోకింది. ఈ సంఖ్య మొత్తం కరోనా బాధితుల సంఖ్యలో సుమారు నాలుగు శాతం. మరోవైపు 11 ఏళ్ల నుంచి 20 ఏళ్ల వయసున్న కరోనా బాధితుల సంఖ్య 60 వేలు దాటింది. ఈ సంఖ్య మొత్తం కరోనా బాధితుల సంఖ్యలో ఏడు శాతానికి పైగా ఉంది. కరోనా బాధితుల సంఖ్య ఓ వైపు పెరుగుతుండగా రికవరి రేటు కూడా గణనీయంగా ఉంది. రాష్ట్రంలో ప్రస్తుతం రికవరీ రేటు 72 శాతం దాటింది. ఇది కొంత ఊరటనిచ్చే అంశంగా చెప్పుకోవచ్చు.
రాష్ట్రంలో కరోనా కేసులు తొమ్మిది లక్షలు దాటగా వీటిలో ఒక్క ముంబైలోనే 1.55 లక్షల కేసులు నమోదయ్యాయి. దేశ ఆర్థిక రాజధాని ముంబై అత్యంత డేంజర్ జోన్‌గా ఉంది. అసియాలోనే అతిపెద్ద మురికివాడగా గుర్తింపు పొందిన ధారావిలో కరోనా నియంత్రణకి రావడం కొంత ఊరటనిచ్చే అంశం కాగా మరోవైపు ముంబైలో కూడా నిలకడగా కనబడింది. అయితే గత కొన్ని రోజులుగా ముంబైలో కరోనా కేసుల సంఖ్య 17 వేల నుంచి 19 వేలు దాటుతోంది. దీంతో మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రస్తుతం ముంబైలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య సెప్టెంబరు 6వతేదీ నాటికి 1,55,622 కాగా యాక్టీవ్ కేసుల సంఖ్య 23,939 ఉంది. మరోవైపు మరణాల సంఖ్య 7,869కి చేరింది.
థానే పోలీసు కమిషనర్ వివేక్ ఫన్సల్కర్‌కు కరోనా సోకింది. లాక్‌డౌన్ సమయంలో కోవిడ్ సోకిన థానే పోలీసులను ఎంతో జాగ్రత్తగా చూసుకున్న పోలీసు కమిషనర్‌కు స్వయంగా కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో ఆయన ప్రస్తుతం ముంబైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. ఆయన ఆరోగ్యం బాగానే ఉందని ఓ పోలీసు అధికారి మీడియాకు తెలిపారు. ఇప్పటి వరకు థానేలో 129 పోలీసు అధికారులు, 1,176 మంది పోలీసు సిబ్బంది ఇలా మొత్తం 1,305 మందికి కరోనా సోకింది. వీరిలో 1,664 మంది కరోనాను జయించి విముక్తి పొందారు. అయితే 18 మంది పోలీసులు మృతి చెందారు. ప్రస్తుతం ఇంకా 141 మంది వేర్వేరు ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు.