Beijing, September 8: చైనా ఆగడాలు రోజురోజుకు మితిమీరిపోతున్నాయి. సరిహద్దు వద్ద పదే పదే నియమాలను ఉల్లంఘిస్తూ కయ్యానికి కాలు దువ్వుతోంది. శాంతి స్థాపన చర్చలు చేయాలని ఢిఫెన్స్ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాస్కో సమావేశంలో పిలుపునిచ్చినప్పటికీ దాని బుద్ధి మారడం లేదు. భారత్-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తత (India-China Tensions) కొనసాగుతుంది. తూర్పు లద్ధాఖ్ సెక్టార్‌లోని ఎల్‌ఏసీలో (Line of Actual Control (LAC) భారత్, చైనా బలగాల మధ్య సోమవారం అర్ధరాత్రి కాల్పులు జరిగినట్లు వార్తలు వస్తున్నాయి.
భారత్ సైన్యమే కాల్పులు జరిపిందంటూ (Fired Warning Shots) చైనా ఆరోపణలు చేస్తోంది. అయితే ఈ కాల్పులపై భారత్ ఇంకా స్పందించలేదు. గత మూడు నెలలుగా రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఇటీవల గల్వాన్ వ్యాలీలో ఇరుదేశాల బలగాల మధ్య ఘర్షణ జరగడంతో భారీ ప్రాణ నష్టం జరిగిన విషయం తెలిసిందే.
ఇక అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన ఐదుగురు వ్యక్తుల అపహరణకు తాము పాల్పడలేదని చైనా పరోక్షంగా స్పష్టం చేసింది. అరుణాచల్ సరిహద్దుల్లో వేటకు వెళ్లిన ఐదుగురు వ్యక్తులను చైనా సైన్యం కిడ్నాప్ చేసినట్లు వార్తలు వచ్చాయి. దీనిపై చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (PLA)కు హాట్‌లైన్ మెసేజ్ పంపినట్లు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు చెప్పారు. భారతసైన్యం కూడా దీన్ని ధ్రువీకరించి- ఓ వాట్సాప్ సందేశాన్ని కూడా పంపినట్లు వెల్లడించింది. అయితే చైనా విదేశాంగ శాఖ దీనిపై తమకేమీ తెలీదని దాటవేసింది. అసలు అరుణాచల్ ప్రదేశ్‌ను తామెప్పుడూ గుర్తించలేదన్న చైనా.. అది తమ దేశంలోని దక్షిణ టిబెట్ ప్రాంతమని సంచలన వ్యాఖ్యలు చేసింది.
See Global Times' Tweet
Chinese border defense troops were forced to take countermeasures to stabilize the situation after the #Indian troops outrageously fired warning shots to PLA border patrol soldiers who were about to negotiate, said the spokesperson. https://t.co/wwZPA6BMDA
— Global Times (@globaltimesnews) September 7, 2020
Statement Issued by Chinese Defence Ministry
#BREAKING: Fresh statement from China’s Ministry of National Defence accusing Indian Army of illegally crossing LAC in Eastern Ladakh and firing warning shots at Border Guards. China says it took ‘counter measures’. Goes on to threaten India. No response yet from Indian Govt. pic.twitter.com/vGC8t50gpB
— Aditya Raj Kaul (@AdityaRajKaul) September 7, 2020
వేటకు వెళ్లిన సమయంలో టగిన్ తెగకు చెందిన టోచ్ సింగ్‌కమ్, ప్రసత్, రింగ్లింగ్, డోంగ్టు ఎబియా, తను బకెర్, ఎంగ్రూ దిరి అనే ఐదుగుర్ని చైనా సైన్యం అపహరించింది. మరో ఇద్దరు అక్కడి నుంచి తప్పించుకొని రావడంతో...ఈ విషయం వెలుగు చూసినట్లు స్థానిక మీడియాలో కథనాలు వెలువడ్డాయి. 37-పసిఘాట్ పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే నినాంగ్ ఎరింగ్ ట్విటర్‌లో ‘కొన్ని నెలల ముందు, ఇలాంటి సంఘటన జరిగింది. మరోమారు పునరావృతం అయ్యింది. చైనాకు తగిన సమాధానం ఇవ్వాలి’ అని ట్వీట్ చేయడంతో అని ఈ విషయం మొదట వెలుగులోకి వచ్చింది. ఐదుగురిని అపహరించారని.. జిల్లాలోని నాచో గ్రామం నుంచి పీఎల్‌ఏ వారిని కిడ్నాప్ చేసిందని ఎరింగ్ తెలిపారు.
ఈ పరిస్థితులు ఇలా ఉంటే.. పాకిస్థాన్ భూభాగంలో ఓ సైనిక స్థావరం ఏర్పాటు చేయాలని చైనా తలపోస్తోందని అమెరికా వెల్లడించింది. ‘ప్రపంచంలో సుదూర ప్రాంతాల్లో సైతం సైనిక, వ్యూహరచనా స్థావరాలను ఏర్పాటు చేసి పీపు ల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్‌ఏ) ఏ ఇబ్బందీ లేకుండా ప్రాజెక్టులు చేపట్టడానికి, ఓ అనితర సైనిక శక్తిగా రూపొందడానికి చైనా ప్రణాళికలు సిద్ధం చేసింది’’ అని అమెరికా రక్షణ శాఖ వార్షిక నివేదిక పేర్కొంది. సరిహద్దు వద్ద దూకుడు పెంచిన భారత్
చైనా మీడియా కూడా కయ్యానికి కాలు దువ్వేలా వార్తలు రాస్తోంది. సరిహద్దుల వద్ద యుద్ధం గనుక వస్తే భారత్ గెలిచే అవకాశమే లేదని తన అధికార పత్రిక గ్లోబల్ టైమ్స్‌లో శనివారం ప్రగల్భాలు పలికింది. చైనా మిలటరీ సామర్థ్యం భారత్ కన్నా చాలా ఎక్కువని ఎడిటోరియల్‌లో పేర్కొన్నది. ‘ఇండియా, చైనా రెండూ గొప్ప శక్తులే. కానీ ఈ రెండు దేశాల మధ్య యుద్ధం వస్తే ఇండియా గెలిచే అవకాశమే లేదు. ఓడిపోతుంది’ అని రాసుకొచ్చింది. అయితే రక్షణ మంత్రుల మధ్య సమావేశం సరిహద్దుల్లో ఉద్రిక్తతలను తగ్గించడానికి సహాయపడుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది.
19 మంది భారతీయులను అరెస్టు చేసిన పాకిస్థాన్ అధికారులు
అయిదుగురి చైనా ఆర్మీ అపహరించిన ఘటన మరచిపోకముందే చట్టవిరుద్ధంగా సరిహద్దులను దాటి తమ దేశంలోకి చొరబడ్డారని ఆరోపిస్తూ 19 మంది భారతీయులను పాకిస్థాన్ అధికారులు అరెస్టు చేశారు. రెండు నెలల క్రితం వాళ్లు దేశంలోకి ప్రవేశించారని, ప్రస్తుతం వివిధ జైళ్లలో ఉన్నారని అధికారి ఒకరు తెలిపారు. ఇదే కేసులో మరో ముగ్గురు బంగ్లాదేశ్ పౌరులను కూడా అదుపులోకి తీసుకున్నట్టు చెప్పారు. దీనికి సంబంధించి వచ్చే నవంబర్ 9న పాక్ సుప్రీంకోర్టులో విచారణ జరుగబోతున్నదని వెల్లడించారు. గూఢచర్యం ఆరోపణలపై సదరు నిందితులను భద్రతా పరిరక్షణ చట్టం కింద అరెస్టు చేసినట్టు వివరించారు.