India-China Tensions: చైనా బలగాలు వెంటనే వెనక్కి వెళ్లాలి, శాంతి స్థాప‌న కోసం రెండు దేశాల మధ్య నిరంతరం చ‌ర్చ‌లు జరగాలి, మాస్కోలో ఎస్‌ఓసీ సమావేశంలో సరిహద్దు అంశాన్ని లేవనెత్తిన రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌

New Delhi/Beijing, September 5: భారత్‌-చైనా మధ్య మరోసారి సరిహద్దులో ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో (India-China Tension) ఇరు దేశాల రక్షణ మంత్రులు రష్యా రాజధాని మాస్కోలో సమావేశమయ్యారు. షాంఘై సహకార సంస్థ( ఎస్‌ఓసీ) (Shanghai Cooperation Organisation (SCO) మంత్రుల స్థాయి సమావేశంలో సరిహద్దు అంశాన్ని (India-China Border Stand-Off) రాజ్‌నాథ్‌సింగ్‌ లేవనెత్తారు.

అనంతరం చైనా రక్షణ మంత్రి వీ ఫెంఘే, భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ మధ్య దాదాపు రెండు గంటల పాటు ఈ భేటీ జరిగింది. ఈ సమావేశంలో రక్షణ శాఖ కార్యదర్శి అజయ్‌ కుమార్‌ కూడా పాల్గొన్నారు. లద్దాఖ్‌లో ఇరుదేశాల మధ్య ఘర్షణలు మొదలయ్యాక ఇప్పటి వరకు సైనిక ఉన్నతాధికారుల మధ్య మాత్రమే ఇప్పటి వరకు చర్చలు జరిగాయి.

చైనా ర‌క్ష‌ణ మంత్రి ఫెంగితో చ‌ర్చించిన త‌ర్వాత‌.. ర‌క్ష‌ణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ( Rajnath Singh) ట్విట్ట‌ర్ ద్వారా పలు విష‌యాల‌ను వెల్ల‌డించారు. ఈస్ట్ర‌న్ ల‌డఖ్‌లో శాంతి స్థాప‌న కోసం రెండు దేశాలు నిరంతరం చ‌ర్చ‌లు నిర్వ‌హిస్తూ ఉండాల‌ని, ఇందుకోసం దౌత్య‌ప‌ర‌మైన‌, సైనిక‌ప‌ర‌మైన చ‌ర్చ‌లు జ‌ర‌గాల‌న్నారు. ఎల్ఏసీ వ‌ద్ద శాంతి, సామ‌ర్యం ప‌రిఢ‌విల్లాలంటే చైనా త‌మ ద‌ళాల‌ను ఉప‌సంహ‌రించాల‌ని, అప్పుడు ఉద్రిక్త‌తలు త‌గ్గుతాయ‌ని రాజ్‌నాథ్ తెలిపారు.

Defence Minister Rajnath Singh Tweets

ప్ర‌స్తుతం ఎల్ఏసీ (Line of Actual Control (LAC) వ‌ద్ద ఉన్న ప‌రిస్థితిన బాధ్య‌తాయుతంగా హ్యాండిల్ చేయాల‌న్నారు. రెండు వైపుల వారు ఎటువంటి చ‌ర్య‌లు తీసుకోరాద‌న్నారు. ఒక‌వేళ ఎవ‌రు దూకుడుగా వ్య‌వ‌హ‌రించినా.. అప్పుడు ప‌రిస్థితి మ‌రింత క్లిష్టంగా మారుతుంద‌ని, దాంతో బోర్డ‌ర్ స‌మ‌స్య మ‌రింత జ‌ఠిలంగా మారుతుంద‌ని రాజ్‌నాథ్ పేర్కొన్నారు. సరిహద్దు వద్ద దూకుడు పెంచిన భారత్

కొద్ది వారాల కిందట భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్‌ జయశంకర్‌ చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌ యీ తో ఫోన్లో మాట్లాడారు. ఈ సమావేశంలో మే నెలకు ముందున్న స్థితిని యథాతథంగా కొనసాగించాలని రాజ్‌నాథ్ సింగ్‌ కోరారు. అయితే చైనా మాత్రం భారత్‌ కవ్వింపు చర్యలకు పాల్పడుతుందని ఆరోపించింది. చిన్న భూభాగాన్ని కూడా వదలుకోవడానికి చైనా సిద్ధంగా లేదని ఫెంఘే తెలిపారు. ఇరుదేశాల మధ్య శాంతి నెలకోవడానికి భారత్‌ ముందడుగు వేయాలని అన్నారు.

ఈ నేపథ్యంలో భార‌త్‌తో క‌లిసి చైనా దళాలు ఎల్ఏసీ వ‌ద్ద నుంచి ఉప‌సంహ‌రించాల‌ని రాజనాథ్ సింగ్ స‌ల‌హా ఇచ్చారు. దీని గురించి చైనా చ‌ర్చించాల‌న్నారు. కీల‌కంగా మారిన పాన్‌గాంగ్ స‌ర‌స్సు వ‌ద్ద నుంచి ద‌ళాలు వెన‌క్కి వెళ్లాల‌ని, ద్వైపాక్షిక ఒప్పందాలు, ప్రోటోకాల్స్ ప్ర‌కారం ఈ చ‌ర్య చేప‌ట్టాల‌ని రాజ్‌నాథ్ సూచించారు. నాయ‌కుల మ‌ధ్య కుదిరిన ఏకాభిప్రాయాన్ని రెండు దేశాలు గుర్తించాల‌ని, దాని ద్వారానే రెండు దేశాల స‌రిహ‌ద్దుల్లో శాంతి విక‌సిస్తుంద‌ని, ఇది ద్వైపాక్షిక సంబంధాల అభివృద్ధికి దోహ‌ద‌ప‌డుతుంద‌న్నారు. ఇద్ద‌రి మ‌ధ్య ఉన్న విబేధాలు.. గొడ‌వ‌ల‌కు దారి తీయ‌వ‌ద్దు అని రాజ్‌నాథ్ అభిప్రాయ‌ప‌డ్డారు.

సరిహద్దు స‌మ‌స్య‌ను చాలా బాధ్య‌తాయుతంగా భార‌తీయ సైనిక ద‌ళాలు ఎదుర్కొన్నాయ‌ని, భార‌తీయ సార్వ‌భౌమ‌త్వాన్ని, భూభాగాన్ని ప‌రిర‌క్షించుకునేందుకు క‌ట్టుబ‌డి ఉన్నామ‌న్నారు. స‌రిహ‌ద్దు వ‌ద్ద చైనా ద‌ళాల చ‌ర్య‌లు స‌రిగా లేవ‌ని, భారీ స్థాయిలో ద‌ళాల‌ను మోహ‌రిస్తున్నాయ‌ని, చాలా దూకుడుగా ఆ ద‌ళాలు ప్ర‌వ‌ర్తిస్తున్నాయ‌ని, స‌రిహ‌ద్దుల్ని మార్చేందుకు ఆ ద‌ళాలు ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు రాజ్‌నాథ్ ఆరోపించారు. ఇది ద్వైపాక్షిక ఒప్పందాల‌ను ఉల్లంఘించ‌డ‌మే అవుతుంద‌న్నారు. ఇద్ద‌రి మ‌ధ్య 2 గంట‌ల 20 నిమిషాల పాటు చ‌ర్చ జ‌రిగింద‌న్నారు.