Gasoline Tanker Blast in Nigeria, 70 dead(ANI)

ఉత్తర జకార్తాలోని కెలాపా గాడింగ్ ప్రాంతంలోని ఆ పాఠశాల మసీదులో జరిగిన పేలుడు కారణంగా 54 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది. పేలుడు అనంతరం కొంతమంది విద్యార్థులు భయాందోళనకు గురై పాఠశాల ప్రాంగణంలోనే ఉండిపోయారు.

పేలుడు కారణాన్ని తెలుసుకునేందుకు జకార్తా పోలీసులు బాంబు నిర్వీర్య విభాగం (Bomb Disposal Squad)ను మోహరించారు. జకార్తా పోలీసు ప్రతినిధి సీనియర్ కమిషనర్ బుడి హెర్మాంటో మాట్లాడుతూ, “పేలుడుకు గల ఖచ్చితమైన కారణాన్ని దర్యాప్తు అధికారులు ఇంకా నిర్ధారించలేదు” అని తెలిపారు.

అదనంగా మొబైల్ బ్రిగేడ్ కార్ప్స్ (Brimob) బాంబు నిర్వీర్య బృందం ఆ ప్రాంతంలో తనిఖీలు ప్రారంభించింది. రెండు మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడి ఆసుపత్రికి తరలించబడ్డారని కూడా అధికారులు వెల్లడించారు. జకార్తా అగ్నిమాపక మరియు రక్షణ శాఖ తెలిపిన ప్రకారం, మధ్యాహ్నం 12:09 గంటలకు (స్థానిక సమయం) పాఠశాల మసీదులోని లౌడ్‌స్పీకర్ నుంచి పేలుడు సంభవించిందని ప్రత్యక్ష సాక్షుల ద్వారా సమాచారం అందిందట. స్థానిక టీవీ ఛానెల్స్ KompasTV, MetroTV ప్రసారాల ప్రకారం, ఘటన స్థలంలో పోలీసు లైన్‌లు ఏర్పాటు చేయబడగా, అంబులెన్స్‌లు కూడా మోహరించబడ్డాయి. అయితే, మసీదు నిర్మాణానికి పెద్దగా నష్టం జరగలేదని రాయిటర్స్ నివేదిక పేర్కొంది.