COVID-19 in India: వ్యాక్సిన్ వచ్చే దాకా పోరాడాల్సిందే, దేశంలో 16 లక్షలు దాటిన కరోనా వైరస్ కేసుల సంఖ్య, ఒక్కరోజు 6,42,588 కరోనా పరీక్షలు నిర్వహణ
గడిచిన 24 గంటల్లో కొత్తగా అత్యధికంగా 55,079 కేసులు వెలుగు చూశాయి. గురువారం 779 మరణాలు సంభవించాయి. దీంతో ఇప్పటి వరకు కరోనా బారిన పడిన వారి సంఖ్య 16,38,871కు చేరింది. మొత్తం 35,747 మంది కరోనాతో (India’s COVID-19) పోరాడి ప్రాణాలు విడిచారు. ప్రస్తుతం వివిధ ఆస్పత్రుల్లో 5,45,318 మంది చికిత్స పొందుతుండగా, 10,57,806 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. నిన్న ఒక్కరోజు 6,42,588 కరోనా పరీక్షలు నిర్వహించగా మొత్తం గురువారం నాటికి 1,88,32,970 కరోనా టెస్టులు పూర్తి చేసినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) ప్రకటించింది.
New Delhi, July 31: భారత్‌లో కరోనా వైరస్ బారిన పడిన వారి సంఖ్య 16 లక్షలు (Coronavirus Cases in India) దాటింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా అత్యధికంగా 55,079 కేసులు వెలుగు చూశాయి. గురువారం 779 మరణాలు సంభవించాయి. దీంతో ఇప్పటి వరకు కరోనా బారిన పడిన వారి సంఖ్య 16,38,871కు చేరింది. మొత్తం 35,747 మంది కరోనాతో (India’s COVID-19) పోరాడి ప్రాణాలు విడిచారు. కరోనా కేసుల్లో భారీ ఊరట, దేశంలో 10 లక్షల మంది డిశ్చార్జ్, భారీ స్థాయిలో పెరిగిన రికవరీ రేటు, వెల్లడించిన కేంద్ర ఆరోగ్య శాఖ
ప్రస్తుతం వివిధ ఆస్పత్రుల్లో 5,45,318 మంది చికిత్స పొందుతుండగా, 10,57,806 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. నిన్న ఒక్కరోజు 6,42,588 కరోనా పరీక్షలు నిర్వహించగా మొత్తం గురువారం నాటికి 1,88,32,970 కరోనా టెస్టులు పూర్తి చేసినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) ప్రకటించింది.
దేశంలో హెర్డ్ ఇమ్యూనిటీ ద్వారా కరోనా వైర్‌సకు కళ్లెం వేయడం సాధ్యం కాదని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇమ్యూనైజేషన్ ద్వారా మాత్రమే హెర్డ్ ఇమ్యూనిటీ వస్తుందని తెలిపింది. అంటే.. వ్యాక్సిన్ వచ్చాకే అది సాధ్యమని వివరించింది. గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేంద్ర ఆరోగ్య శాఖ ఓఎస్డీ రాజేశ్ భూషణ్ ఈ వివరాలను వెల్లడించారు. అయోధ్యలో కరోనా పంజా, పూజారితో సహా 16 మంది పోలీసులకు కోవిడ్-19 పాజిటివ్, అయోధ్య ప్రాంతంలో కఠిన నిబంధనలు అమలు
‘‘మనదేశంలో హెర్డ్ ఇమ్యూనిటీకి అవకాశాలు తక్కువ. గతంలో వచ్చిన ఇన్ఫెక్షన్లు, తీసుకున్న టీకాల వల్ల పెరిగిన వ్యాధినిరోధక శక్తి వల్ల హెర్డ్ ఇమ్యూనిటీ రావొచ్చు. కానీ, అది విజయవంతం కాకుంటే మరణాలు పెరిగే ప్రమాదముంది’’ అని వివరించారు. భారత్‌లో రెండు వ్యాక్సిన్లు ఫేజ్-1, ఫేజ్-2ల్లో ఉన్నాయని, మొదటి వ్యాక్సిన్‌ను 8 ప్రాంతాల్లో దాదాపు 1,150 మందిపైన, రెండోది ఐదు చోట్ల వెయ్యి మందిపై ప్రయోగించినట్లు పేర్కొన్నారు.