India's Coronavirus: దేశంలో తాజాగా 62,064 కేసులు నమోదు, 22 లక్షలు దాటిన కోవిడ్-19 పాజిటివ్ కేసులు, యాక్టివ్‌గా 6,34,945 కేసులు, మరణాల సంఖ్య 44,386
నిన్న ఉదయం నుంచి ఈరోజు ఉదయం వరకు 62,064 మంది కొత్తగా కరోనా (New Coronavirus Cases) బారినపడ్డారు. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 22,15,075కు పెరగగా, మరణాలు 44,386కు చేరాయి. ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసుల్లో 6,34,945 కేసులు యాక్టివ్‌గా (Coronavirus Active Cases) ఉండగా, 15,35,744 మంది బాధితులు కోలుకున్నారు. దీంతో దేశంలో కరోనా బారి నుంచి కోలుకున్నవారి సంఖ్య 15 లక్షలు దాటిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటించింది.
New Delhi, August 10: దేశంలో వరుసగా నాలుగో రోజు 62 వేలకు పైగా పాజిటివ్ కేసులతోపాటు (Coronavirus Cases), ఎనిమిది వందలకు పైగా మరణాలు (Coronavirus Deaths) నమోదయ్యాయి. నిన్న ఉదయం నుంచి ఈరోజు ఉదయం వరకు 62,064 మంది కొత్తగా కరోనా (New Coronavirus Cases) బారినపడ్డారు. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 22,15,075కు పెరగగా, మరణాలు 44,386కు చేరాయి. ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసుల్లో 6,34,945 కేసులు యాక్టివ్‌గా (Coronavirus Active Cases) ఉండగా, 15,35,744 మంది బాధితులు కోలుకున్నారు. దీంతో దేశంలో కరోనా బారి నుంచి కోలుకున్నవారి సంఖ్య 15 లక్షలు దాటిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటించింది.
దేశవ్యాప్తంగా కొత్తగా నమోదవుతున్న పాజిటివ్ కేసుల్లో 80 శాతం పది రాష్ట్రాల్లోనే ఉన్నాయని తెలిపింది. తాజాగా రికార్డు స్థాయిలో వెయ్యికి పైగా కరోనా మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం మరణాలు 44 వేలు దాటాయి. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 1,007 మంది కరోనా బాధితులు మరణించారు. ఇంతపెద్ద సంఖ్యలో కరోనా బాధితులు మరణించడం ఇదే మొదటి సారి. దేశవ్యాప్తంగా నిన్నటివరకు 2,45,83,558 కరోనా టెస్టులు చేశామని భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎమ్మార్) ప్రకటించింది. ఆగస్టు 9న 4,77,023 నమూనాలను పరీక్షించామని వెల్లడించింది. కరోనాకు చెక్ పెట్టినట్లే, కోవిడ్ వ్యాక్సిన్‌ను రూ.225కే విక్రయిస్తామని తెలిపిన సీరమ్ ఇన్‌స్టిట్యూట్, బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్‌తో డీల్ కుదుర్చుకున్న గవి
ప్రపంచంలో కరోనా బాధితుల సంఖ్య రెండు కోట్లను దాటిపోయింది. వరల్డ్‌మీటర్ వెల్లడించిన గణాంకాల ప్రకారం ప్రపంచంలో మొత్తం కరోనా ఇన్‌ఫెక్షన్ల సంఖ్య 2,00,23,016కు పెరిగింది. ఇప్పటివరకు మొత్తం మరణాల సంఖ్య 7,33,973గా నమోదయ్యింది. ప్రపంచవ్యాప్తంగా గడచిన 24 గంటల్లో మూడు లక్షల కొత్త కేసులు నమోదయ్యాయి. అయితే ఈ వ్యాధి నుంచి కోలుకుంటున్నవారి సంఖ్య కూడా వేగంగా పెరుగుతోంది. ఇప్పటివరకు 1,28,97,813 మంది కరోనా నుంచి కోలుకున్నారు. అంగస్తంభన ఔషధంతో కరోనాకు చెక్, ఆర్ఎల్‌ఎఫ్-100 కోవిడ్ కు విరుగుడుగా పనిచేస్తుందని తెలిపిన హ్యూస్టన్ మెథడిస్ట్ హాస్పిటల్, సెప్టెంబర్ 1 నుంచి ప్రయోగాలు
ప్రపంచంలో కరోనా కేసులలో అమెరికా ముందంజలో ఉంది. అమెరికాలో ఇప్పటివరకు 51,99,444 మంది కరోనా బారినపడ్డారు. వారిలో 26,64,701 మంది కోలుకున్నారు. 23,69,126 మంది చికిత్స పొందుతున్నారు. అమెరికాలో వైరస్ కారణంగా ఇప్పటివరకు 1,65,617 మంది ప్రాణాలు కోల్పోయారు. భారత్‌లో కరోనా కేసుల సంఖ్య 22,14,137గా ఉంది. ఇప్పటివరకు 44,466 మంది కరోనా కారణంగా మృతి చెందారు. భారత్‌లో కొత్తగా ఎన్ని కరోనా కేసులు నయమవుతున్నాయో, అదేవిధంగా రికవరీ రేటు కూడా పెరుగుతోంది. దేశంలో 15,34,278 మంది వ్యాధి నుంచి కోలుకున్నారు.