Coronavirus in India: కరోనాపై మళ్లీ షాకింగ్ నిజాలు, మనుషుల చర్మంపై 9 గంటల దాకా బ్రతికే ఉంటుంది, శీతాకాలంలో ఈ వైరస్ తీవ్రత ఎక్కువయ్యే ప్రమాదం, దేశంలో తాజాగా 66,732 మందికి కోవిడ్-19

మహమ్మారి కారణంగా కొత్తగా 816 మంది మరణించారు. ప్రస్తుతం దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 71,20,539కి (COVID-19 Count in India) చేరింది. ఇందులో 8,61,853 క్రియాశీల కేసులున్నాయి. 61,49,536 మంది బాధితులు ఇప్పటి వరకు కోలుకున్నారు.

COVID-19 in India (Photo Credits: PTI)

New Delhi, October 12: దేశంలో గడిచిన 24 గంటల్లో 66,732 పాజిటివ్‌ కేసులు (Coronavirus in India) నిర్ధారణ అయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ సోమవారం పేర్కొంది. మహమ్మారి కారణంగా కొత్తగా 816 మంది మరణించారు. ప్రస్తుతం దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 71,20,539కి (COVID-19 Count in India) చేరింది. ఇందులో 8,61,853 క్రియాశీల కేసులున్నాయి. 61,49,536 మంది బాధితులు ఇప్పటి వరకు కోలుకున్నారు.

వైరస్‌ కారణంగా 1,09,150 ( Coivd Deaths)మరణించారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వివరించింది. ఇదిలా ఉండగా దేశవ్యాప్తంగా ఆదివారం ఒకే రోజు 9,94,851 కొవిడ్‌ శాంపిల్స్‌ పరీక్షించినట్లు ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) పేర్కొంది. ఇప్పటి వరకు 8,78,72,093 టెస్టులు చేసినట్లు వివరించింది.

నేడు సంభవించిన మరణాల్లో 84 శాతం పది రాష్ట్రాల నుంచి నమోదయ్యాయి. కోవిడ్‌ మరణాల్లో మహారాష్ట్ర (maharashtra) ప్రథమ స్థానంలో ఉంది. గడిచిన 24 గంటల్లో ఇక్కడ 308 మంది కరోనా బారిన పడి మృతి చెందారు. కరోనావైరస్ కేసులు 21 రోజుల్లో 10 లక్షల నుంచి 20 లక్షలకు పెరిగాయి. 30 లక్షలు దాటడానికి 16 రోజులు, 40 లక్షలను దాటడానికి 13 రోజులు, 50 లక్షలు దాటడానికి 11 రోజులు పట్టింది. ఇక ఈ కేసులు 12 రోజుల్లో 50 లక్షల నుంచి 60 లక్షలకు పెరిగాయి.

దేశంలో కోవిడ్ -19 కేసులు (Coronavirus Cases in India) లక్షకు చేరుకోవడానికి 110 రోజులు పట్టింది.. కానీ 10 లక్షల మార్కును దాటడానికి 59 రోజులు మాత్రమే పట్టడం గమనార్హం. ఇక దేశవ్యాప్తంగా కోవిడ్‌ మరణాల రేటు (సీఎఫ్ఆర్) 1.54 శాతంగా ఉందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) ప్రకారం, అక్టోబర్ 10 వరకు దేశ వ్యాప్తంగా మొత్తం 8,68,77,242 నమూనాలను పరీక్షించగా.., శనివారం 10,78,544 టెస్ట్‌లు పరీక్షించారు.

పెళ్లి కాని మగవారికి కరోనా మరణం రిస్క్ ఎక్కువట, సంచలన విషయాలు వెల్లడించిన స్వీడెన్‌లోని స్టాక్‌హోమ్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు, నేచర్ కమ్యూనికేషన్స్ పత్రికలో వ్యాసం ప్రచురణ

వేస‌విలోనే క‌రోనాను నియంత్రించ‌క‌పోతే ఇక శీతాకాలంలో ఇది మ‌రింత ముదిరే అవ‌కాశం ఉంద‌ని ఆస్ట్రేలియాకు చెందిన శాస్త్రవేత్త తెలిపారు. రానున్న రోజుల్లో మ‌రిన్ని గ‌డ్డు ప‌రిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుంద‌ని హెచ్చ‌రించారు. ఆస్ట్రేలియాకు చెందిన కాన్సాస్ స్టేట్ యూనివర్శిటీ పరిశోధకులు జ‌రిపిన అధ్య‌య‌నం ప్ర‌కారం..వేస‌వి స‌గ‌టు ఉష్ణోగ్ర‌త‌తో పోలిస్తే చ‌ల్ల‌టి వాతావ‌ర‌ణంలో వైర‌స్ ఎక్కువ‌కాలం జీవించి ఉంటుంద‌ని తెలిపారు. మృదువైన గాజు ప‌రిక‌రాలు, క‌రెన్సీ నోట్లు, మొబైల్ ట‌చ్ స్క్రీన్‌పై 28 రోజుల వ‌ర‌కు వైర‌స్ నిలిచే ఉంటుంద‌ని ఇది అత్యంత ప్ర‌మాద‌క‌ర‌మ‌ని ప‌రిశోధ‌న‌లో వెల్ల‌డైంది.

కరోనా సెకండ్ వేవ్‌తో భయమేమి లేదు

మనుషుల చర్మంపై కరోనా వైరస్‌ 9 గంటల దాకా బ్రతికే ఉంటుందని తాజాగా వెల్లడైంది. ఇన్‌ ఫ్లూయెంజా ‘ఏ’వైరస్‌ (ఐఏవీ)తో సహా ఇతర వైరస్‌లు 2 గంటల్లోపే నాశనమవుతుండగా, కోవిడ్‌ కారక సార్స్‌–సీవోవీ–2 మాత్రం 9 గంటల పాటు జీవించి ఉంటుందని జపాన్‌ కు చెందిన పరిశోధన సంస్థ తాజాగా స్పష్టం చేసింది.

జపాన్‌ క్యోటో పర్‌ఫెక్చురల్‌ వర్సిటీ ఆఫ్‌ మెడిసిన్‌ నిర్వహించిన తాజా పరిశోధన అంశాలు ఆక్స్‌ఫర్డ్‌ అకడమిక్, ద జర్నల్‌ క్లినికల్‌ ఇనెఫెక్షియస్‌ డిసీజెస్‌ల్లో ప్రచురితం అయ్యాయి. పోస్ట్‌మార్టం చేసిన శవాల నుంచి సేకరించిన చర్మంపై ఈ అధ్యయనం నిర్వహించారు. ఇతరులకు కరోనా వైరస్‌ వ్యాప్తి చెందే ప్రమాదం కూడా ఎక్కువేనని హెచ్చరించింది. సార్స్‌–సీవోవీ–2 వైరస్‌ వ్యాప్తి నిరోధానికి చేతులను పరిశుభ్రంగా ఉంచుకోవడం అత్యంత అవసరమని పేర్కొంది.

కరోనాపై మరో షాకింగ్ న్యూస్, ప్రతి పదిమందిలో ఒకరు కోవిడ్ బారిన పడ్డారు, సంచలన విషయాలను వెల్లడించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ, మెజార్టీ జనాభాకు కరోనా ముప్పు ఉందని హెచ్చరిక

చేతులు శుభ్రంగా ఉంచుకోవడం, ఎప్పటికప్పుడు కడుక్కోవడం, శానిటైజ్‌ చేసుకోవడం ద్వారా ఈ వైరస్‌ వ్యాప్తిని తగ్గించే అవకాశం ఉందని సూచించింది. సాధారణ ఫ్లూ వైరస్‌తో పోలి్చతే కరోనా వైరస్‌ మనుషుల చర్మంతో సహా వివిధ ఉపరితలాలపై దీర్ఘకాలం చురుకుగా ఉంటున్నట్లు తేల్చారు. అయితే చర్మంతో పోలిస్తే స్టీలు, గాజు, ప్లాస్టిక్‌ వంటి వాటిపై త్వరగా నశిస్తోందన్నారు. అంతేకాదు చర్మంపైన ఉండే వైరస్‌కు లాలాజలం, చీమిడి, చీము.. లాంటివి తోడైతే కరోనా వైరస్‌ 11 గంటల పాటు సజీవంగా ఉంటుందని తేల్చారు.

చైనాలో మళ్లీ కరోనావైరస్, తాజాగా మెయిన్‌లాండ్‌లో 10 మందికి కోవిడ్ పాజిటివ్, విదేశాల నుంచి వస్తున్న వారితో కరోనా వస్తుందని తెలిపిన చైనా జాతీయ ఆరోగ్య కమిషన్

80 శాతం ఇథెనాల్‌ ఉన్న హ్యాండ్‌ శానిటైజర్లు వాడితే కరోనా వైరస్‌తో సహా ఇన్‌ ఫ్లుయెంజా సెల్స్‌ కూడా 15 సెకన్లలోనే నాశనమైపోతాయని వారు తెలిపారు. అంతేకాదు.. సబ్బుతో 20 సెకన్ల పాటు చేతులను కడుక్కుంటే ఈ వ్యాధి వ్యాప్తిని ఆపవచ్చని, 60 శాతం ఆల్కాహాల్‌ ఉన్న శానిటైజర్‌ వాడినా ఉపయోగం ఉంటుందని సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ ఇదివరకే సూచించింది.

అధిక శాతం మందిపై కరోనా వైరస్‌ కొద్ది మేరకే ప్రభావం చూపుతోందని.. దీంతో దగ్గు, జలుబు, జ్వరం వంటివి వచ్చి కొద్ది రోజులకు తగ్గిపోతున్నాయని పేర్కొంది. అయితే వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వృద్ధులపై తీవ్ర ప్రభావం చూపుతుండటంతో వారి పరిస్థితి విషమించడం, చివరకు మరణించడం జరుగుతోందని ఈ పరిశోధకులు పునరుద్ఘాటించారు



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif