COVID-19 in India: 24 గంటల్లో 19 వేల కేసులు నమోదు, దేశంలో 5.5 లక్షలకు చేరువలో కరోనా కేసులు, ఒకే రోజు 380 మంది కరోనాతో మరణం

ఆదివారం ఒక్కరోజే కరోనా కేసుల సంఖ్య (coronavirus cases) 5.48 లక్షల మార్కును చేరుకుంది. గడచిన ఇరవై నాలుగు గంటల్లో 1,70,560 టెస్టులు చేయగా 19,459 కొత్త కేసులు బయటపడ్డాయి. ఒక్క రోజులోనే 380 మంది వైరస్​ వల్ల ప్రాణాలు కోల్పోయారు. మొత్తం మీద 16,475 మంది చనిపోయారు. ఇప్పటిదాకా 83,98,362 మందికి కరోనా టెస్టులు చేశారు.దేశంలో ఇప్పటివరకు నమోదయిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 5,48,318గా నమోదైంది. వీటిలో 3,21,722 మంది జబ్బు నుంచి కోలుకోగా, 2,10,120 యాక్టివ్ కేసులున్నాయి.

Coronavirus Outbreak (Photo Credits: IANS)

New Delhi, June 29: దేశంలో కరోనా పాజిటివ్‌ కేసులు (coronavirus cases) రోజు రోజుకు అతి వేగంగా పెరుగుతున్నాయి. ఆదివారం ఒక్కరోజే కరోనా కేసుల సంఖ్య (coronavirus cases) 5.48 లక్షల మార్కును చేరుకుంది. గడచిన ఇరవై నాలుగు గంటల్లో 1,70,560 టెస్టులు చేయగా 19,459 కొత్త కేసులు బయటపడ్డాయి. ఒక్క రోజులోనే 380 మంది వైరస్​ వల్ల ప్రాణాలు కోల్పోయారు. మొత్తం మీద 16,475 మంది చనిపోయారు. ఇప్పటిదాకా 83,98,362 మందికి కరోనా టెస్టులు చేశారు.దేశంలో ఇప్పటివరకు నమోదయిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 5,48,318గా నమోదైంది. వీటిలో 3,21,722 మంది జబ్బు నుంచి కోలుకోగా, 2,10,120 యాక్టివ్ కేసులున్నాయి. నేను చచ్చిపోతున్నా, తండ్రికి సెల్ఫీ వీడియో పంపిన కొడుకు, ఎర్రగడ్డ చెస్ట్ ఆసుపత్రిలో విషాద ఘటన

నిన్న ఉదయం వరకు 19,906 కేసులు నమోదవగా, గత 24 గంటల్లో కొత్తగా 19,459 కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ కావడంతో దేశంలో కరోనా ఎంత వేగంగా విస్తరిస్తోందో తెలుస్తుంది. దేశంలో అత్యధిక కేసులు నమోదైన రాష్ట్రాల్లో మహారాష్ట్ర మొదటి స్థానంలో కొనసాగుతున్నది. రాష్ట్రంలో ఇప్పటివరకు 1,64,626 మంది కరోనా బారినపడ్డారు. ఇందులో 7,429 మంది బాధితులు మృతిచెందగా, 86,575 మంది కోలుకున్నారు. మరో 70,622 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీ రెండో స్థానంలో కొనసాగుతున్నది. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 83,077కి చేరగా, 2623 మంది మరణించారు.

తమిళనాడులో ఇప్పటివరకు 82,275 పాజిటివ్‌ కేసులు నమోదవగా, 1079 మంది మృతిచెందారు. నాలుగో స్థానంలో ఉన్న గుజరాత్‌లో 31,320 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు 1808 మంది మరణించారు. 31,320 పాజిటివ్‌ కేసులతో ఉత్తరప్రదేశ్‌ ఐదో స్థానంలో కొనసాగుతున్నది. రాష్ట్రంలో ఈ వైరస్‌ వల్ల ఇప్పటివరకు 660 మంది చనిపోయారు. జూన్‌ 28 వరకు దేశవ్యాప్తంగా 83,98,362 నమూనాలను పరీక్షించామని ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రిసెర్చ్‌ (ఐసీఎమ్మార్‌) ప్రకటించింది. నిన్న ఒక్కరోజే దేశంలో 1,70,560 పరీక్షలు చేశామని తెలిపింది.