Hyderabad, June 29: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ జవహర్ నగర్ కు చెందిన రవికుమార్ అనే యువకుడు కోవిడ్-19 (COVID-19 Patient) భారిన పడి ఎర్రగడ్డ చెస్ట్ ఆసుపత్రిలో (Chest Hospital) చేరగా, అత్యంత విషాదకర పరిస్థితుల్లో ప్రాణాలు కోల్పోయాడు. ఊపిరి అందడంలేదని వెంటిలేటర్ పెట్టాలని బతిమాలినా వైద్యులు వెంటిలేటర్ పెట్టలేదని ఆ యువకుడు మరణానికి ముందు తన సెల్ఫీ వీడియోలో (COVID-19 Patient Selfie Video) ఆరోపించాడు. గ్రేటర్ హైదరాబాద్‌పై కరోనా ఎఫెక్ట్, మరోసారి జీహెచ్ఎంసీ పరిధిలో లాక్డౌన్ విధించే దిశగా అడుగులేస్తున్న తెలంగాణ సర్కార్, త్వరలోనే నిర్ణయం ప్రకటిస్తామని వెల్లడించిన సీఎం కేసీఆర్
ఊపిరందక గుండె ఆగిపోయేలా ఉందని, చచ్చిపోతున్నానంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. చివరగా "బాయ్ డాడీ" అంటూ సెల్పీ వీడియోలో చెప్పడం అందర్నీ కలచివేస్తోంది. దాదాపు మూడు గంటల పాటు నరకయాతన అనుభవించిన రవికుమార్ మృత్యువుతో పోరాటంలో ఓడిపోయి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు.
ఈ మరణంపై ఆసుపత్రి వర్గాలు నిర్లక్ష్యం చేశాయంటూ తన పరిస్థితిని తండ్రికి సెల్ఫీ వీడియో ద్వారా రవికుమార్ తెలిపాడు. ఈ ఘటనపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. నాకు ఊపిరి ఆడడం లేదు డాడీ.. 3 గంటల నుండి బతిమాలుతున్నా నన్నెవరూ పట్టించుకోవడంలేదు. ఆక్సిజన్ కూడా తీసేశారు.. శ్వాస ఆడటం లేదని చెప్పిన పెట్టడం లేదు. నా గుండె ఆగిపోయింది.
Here's Sefie Video
https://t.co/z9oS33Zf3h @KTRTRS @Eatala_Rajender @narendramodi @IHSgov this guy is dead just because his ventilator was removed even after him saying he can’t breathe. I am not gonna say a single word, it’s a system failure around the country.
— Vikram (@Ajayreddy99599) June 29, 2020
ఇక నేను చచ్చిపోతున్న.. బై డాడీ’ అంటూ మరణానికి గంట ముందు, హాస్పిటల్ బెడ్‌పై ఉండి ఓ యువకుడు తన తండ్రికి పంపిన సెల్ఫీ వీడియో ఇప్పుడు కలకలం రేపుతోంది. హైదరాబాద్‌లోని చెస్ట్ హాస్పిటల్‌లో ఈ నెల 25న అర్ధరాత్రి ర్వాత జరిగిన ఘటన ఆస్పత్రి నిర్ణక్ష్యాని తెలుపుతోంది. అయితే.. అక్కడి అధికారులు మాత్రం సడెన్ హార్ట్స్ట్రోక్ వల్లే చనిపోయాడని, డాకర్ట నిర్లక్ష్యం లేదని అంటున్నారు.
తండ్రి మాటల్లో..
నా కొడుకుకు జ్వరం ఎక్కువ కావడంతో బుధవారం పొద్దున ఈసీఐఎల్‌లోని ప్రైవేటు హాస్పిటల్‌కు పోయాము. అక్కడ గేట్‌దగ్గరే ఆపి కరోనా లక్షణాలు ఉన్నాయని అడ్మిట్ చేసుకోలేదు. ఇంకో హాస్పిటల్‌కు పోతే కరోనా టెస్ట్ చేయించుకు రావాలన్నారు. విజయా డయాగ్నసిస్‌కు వెళ్లి టెస్ట్ శాంపిల్ ఇచ్చాం. రిజల్ట్ రావడానికి రెండ్రోజులు పడుతుందని తెలిపారు. అక్కడి నుండే సికింద్రాబాద్ సన్‌షైన్ హాస్పిటల్‌కు వెళ్లాం. వాళ్లు కూడా అడ్మిట్ చేసుకోలేదు. తర్వాత జూబ్లిహిల్స్ అపోలో హాస్పిటల్‌కు వెళ్లాం. ఐదు లక్షలైనా డిపాజిట్ చేస్తాం.. నా కొడుకుకు ట్రీట్‌మెంట్ ఇవ్వండి అని బతిమాలినా ఎవరూ కనికరించలేదు. అక్కడి నుంచి నిమ్స్‌కు వెళ్లాం. కరోనా టెస్ట్ చేయించుకోవాలన్నారు. శాంపిల్ ఇచ్చాం. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో సుమారు 20 వేల పాజిటివ్ కేసులు నమోదు, భారత్‌లో 5,28,859కు చేరిన మొత్తం కోవిడ్ బాధితుల సంఖ్య, ప్రపంచవ్యాప్తంగా కోటి మందికి పైగా సోకిన వైరస్
రిజల్ట్ రాలేదని వారికి చెప్పాం. రిజల్ట్ నెగెటివ్ వస్తేనే అడ్మిట్ చేసుకుంటాం.. లేదంటే గాంధీ దావాఖానకు వెళ్లండి అని వాళ్లు చెప్పారు. గాంధీ దవాఖానకు వెళ్తే, గేట్ దగ్గరే పోలీసులు ఆపారు. పాజిటివ్ రిపోర్ట్ లేదని చెబితే, చెస్ట్ హాస్పిటల్‌కు వెళ్లండన్నారు. అప్పటికే సాయంత్రం ఏడు అయింది. చివరకు చెస్ట్ హాస్పిటల్‌లో అడ్మిట్ చేసుకున్నారు. నేను హాస్పిటల్ బయట చెట్లకిందే ఉన్నా. ట్రీట్‌మెంట్ సరిగ్గా చేయడం లేదని, సరిగా పట్టించుకోలేదని నాకొడుకు నాకు ఫోన్‌లో చెప్తూనే ఉన్నాడు. నాకు ఏంచేయాల్నో తోచలేదు. గురువారం రాత్రి 12.30 గంటలకు .. నన్నెవరూ పట్టించుకోవడం లేదు.. చనిపోతున్నానంటూ వాట్సప్‌లో వీడియో పెట్టాడు. అది నేను రెండు గంటలకు చూసుకున్న. చూసిన వెంటనే హాస్పిటల్‌లోకి వెళ్లేసరికి.. నీ కొడుకు చనిపోయాడు శవాన్ని తీసుకెళ్లండి అక్కడి సిబ్బంది చెప్పారు అని రవికుమార్ తండ్రి వెంకటేశ్ కన్నీరు పెట్టుకున్నారు.
నిర్లక్ష్యమే ప్రాణాలు తీసింది
డాక్టర్ల నిర్లక్యం వల్లే తన కొడుకు రవికుమార్ చనిపోయాడని వెంకటేశ్ ఆరోపించారు. బుధవారం రాత్రి 7 గంటలకు అడ్మిటైన పేషెంట్‌కు కనీసం సీటీ స్కాన్ కూడా తీయించలేదని ఆయన అన్నారు. గుండె పోటు వచ్చి చనిపోయిండని ఎలా నిర్ధారించారో చెప్పాలని డాకర్ట్లను ప్రశ్నించారు.తన కొడుక్కు ఇదివరకు అనారోగ్య సమస్యలేవీ లేవన్నారు. చనిపోయాడని రాత్రి 2 గంటలకు చెప్పారని, అప్పుడే శవాన్ని తీసుకెళ్లాలని ఒత్తిడి చేశారని పేర్కొన్నారు. తెల్లారే వరకూ ఆగాలని అడిగితే, మార్చురీలో శవాలను ఎలుకలు, పంది కొక్కులు పీక్కుతింటున్నాయని అక్కడి సిబ్బంది హెచ్చరించారని అన్నారు.
ఈ నెల 26న ఉదయం శవాన్ని తీసుకెళ్లి దహన సంస్కారాలు చేశామని, 27న ఉదయం వైరస్ పాజిటివ్ ఉన్నట్టు విజయా డయాగ్నసిస్ నుంచి రిపోర్ట్ వచ్చిందని పేర్కొన్నారు. అయితే, ఇప్పటికీ తమకు టెస్టులు చేయలేదని, తమ కొడుకు లాగే తమకు అయితే పట్టించుకునేవారు ఎవరని వెంకటేశ్ ఆవేదన వ్యక్తంచేశారు.
డాక్టర్ల స్పందన
బాధితుడికి అవసరమైన ట్రీట్‌మెంట్ అందించాం. ఆక్సిజన్ సాచురేషన్ కరెక్ట్‌గానే మెయింటెయిన్ అయింది. అతడికి ఆక్సిజన్ తీసేయలేదు. కొన్నిసార్లు ఆక్సిజన్ పెట్టినప్పటికీ శ్వాస అందదు. రవికుమార్ కు కూడా అలాగే జరిగింది. అతడికి సడెన్‌గా రాత్రి హార్ట్ స్ర్టోక్ రావడం వల్లే చనిపో యాడు. ఈ మధ్య కరోనా పేషెంట్లకు సడెన్‌గా హార్ట్ స్ర్టోక్ వస్తోంది. ఇతనికి కూడా వస్తుందేమోనని ముందే ఊహించి, మెడిసిన్ కూడా ఇచ్చాము. ఇందులో డాక్టర్ల నిర్లక్ష్యమేమీ లేదు.
వైద్యుల నిర్లక్ష్యంతో రవికుమార్ చనిపోయాడనడం సరికాదని, కరోనా వైరస్ కారణంగా గుండెపై ప్రభావం పడుతుందని చెస్ట్ ఆసుపత్రి సూపరింటిండెంట్ తెలిపారు. కరోనా వైరస్ యువకుల్లో ఎక్కువగా గుండెపై ప్రభావం చూపిస్తుందని, హార్ట్ దెబ్బతిన్న తర్వాత ఆక్సిజన్ పెట్టినా ప్రయోజనం ఉండదని వివరించారు. రవికుమార్ విషయంలోనూ అదే జరిగిందని స్పష్టం చేశారు.