COVID-19 in India: దేశంలో తాజాగా 30,254 కోవిడ్ కేసులు, 1,43,019కు చేరుకున్న మరణాల సంఖ్య, తెలంగాణలో తాజాగా 573 మందికి కరోనా, ఢిల్లీలో తగ్గుముఖం పడుతున్న కేసులు

దీంతో మొత్తం కేసుల సంఖ్య 98,57,029కు (Coronavirus Pandemic) చేరుకుందని కేంద్ర వైద్యారోగ్యశాఖ తెలిపింది. కరోనావైరస్ కారణంగా కొత్తగా 391 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 1,43,019కు (Covid Deaths) చేరుకుందని తెలిపింది.

Coronavirus in AP (Photo Credits: PTI)

New Delhi, December 13: దేశంలో గత 24 గంటల్లో 30,254 కొత్త కరోనా కేసులు (COVID-19 in India) నమోదు అయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 98,57,029కు (Coronavirus Pandemic) చేరుకుందని కేంద్ర వైద్యారోగ్యశాఖ తెలిపింది. కరోనావైరస్ కారణంగా కొత్తగా 391 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 1,43,019కు (Covid Deaths) చేరుకుందని తెలిపింది. కరోనా నుంచి కొత్తగా 33,196 మంది కోలుకోగా.. మొత్తం డిశ్చార్జి అయిన వారి సంఖ్య 93,57,464కు చేరుకుంది. దీంతో మొత్తం రికవరీ రేటు 94.93శాతానికి చేరింది. దేశంలో ప్రస్తుతం 3,56,546 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశంలో మరణాల రేటు 1.45 శాతంగా ఉంది.

దేశరాజధాని ఢిల్లీలో తాజాగా 1935 కరోనా పాజిటివ్ కేసులు (Covid in Delhi) నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. అలాగే 47 మంది కరోనా కారణంగా మరణించినట్లు తెలిపారు. అయితే నవంబరు 2 నుంచి గణాంకాలను పరిశీలిస్తే.. ఒకరోజులో సంభవించిన కరోనా మరణాల్లో ఇప్పటి వరకూ ఇవే తక్కువని అధికారులు అంటున్నారు. అలాగే వైరస్ పాజిటివిటీ రేటు కూడా బాగా తగ్గిందని, ప్రస్తుతం ఈ రేటు 2.64శాతమే ఉందని వాళ్లు వెల్లడించారు.

పార్లమెంటుపై ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయినవారికి ప్రధాని నివాళి, పార్లమెంటుపై పిరికిపంద దాడిని మనం ఎన్నటికీ మర్చిపోమని ట్వీట్

డిసెంబరు 3న కూడా ఈ రేటు సుమారు 5 వరకూ ఉందని, కానీ ఇప్పుడు ఇది దాదాపు సగానికి తగ్గిపోయిందని తెలియజేశారు. కొత్తగా 73, 413మందికి కరోనా టెస్టులు చేయగా వారిలో కేవలం 1935మందికి మాత్రమే పాజిటివ్ ఫలితం వచ్చిందని వెల్లడించారు. అలాగే కొత్తగా 47 కరోనా మరణాలతో ఢిల్లీలో ఇప్పటి వరకూ సంభవించిన కరోనా మరణాల సంఖ్య 9,981కు చేరిందని పేర్కొన్నారు.

తెలంగాణలో గత 24 గంటల్లో 573 కరోనా కేసులు (Covid in Telangana) నమోదయ్యాయి. తెలంగాణ‌ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్ర‌కారం... గత 24 గంటల్లో నలుగురు కరోనాతో ప్రాణాలు కోల్పోగా, అదే సమయంలో 609 మంది కోలుకున్నారు.

ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,77,724కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,68,601 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య మొత్తం 1,493కి చేరింది. తెలంగాణలో ప్రస్తుతం 7,630 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 5,546 మంది హోం క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 127, రంగారెడ్డి జిల్లాలో 58 కరోనా కేసులు నమోదయ్యాయి.