PM Modi addressing the FICCI Convention | (Photo Credits: ANI)

New Delhi, December 13: 2001లో ఇదే రోజు పార్లమెంటుపై ఉగ్రవాద దాడిలో ప్రాణాలు కోల్పోయినవారికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారం నివాళులర్పించారు. ప్రజాస్వామిక దేవాలయమైన పార్లమెంటుపై దాడి పిరికిపంద చర్య అని, దీనిని మన దేశం ఎన్నటికీ మర్చిపోదని (2001 Parliament Attack Anniversary) చెప్పారు.

2001లో ఇదే రోజున మన పార్లమెంటుపై పిరికిపంద దాడిని మనం ఎన్నటికీ మర్చిపోము (India Will Never Forget the Cowardly Attack). పార్లమెంటు పరిరక్షణలో ప్రాణాలు కోల్పోయినవారి ధైర్యసాహసాలు, త్యాగాలను మనం గుర్తు చేసుకుంటున్నాం. వారికి భారత దేశం ఎల్లప్పుడూ కృతజ్ఞతగా ఉంటుంది’’ అని మోదీ తన ట్వీట్ లో పేర్కొన్నారు.

పార్లమెంటుపై దాడి సమయంలో ప్రాణ త్యాగం చేసిన అమరులకు పుష్పాంజలి ఘటించే కార్యక్రమం పార్లమెంటులో ఆదివారం ఉదయం 10.30 గంటలకు జరుగుతుంది. 2001 డిసెంబరు 13న లష్కరే తొయిబా, జైషే మహమ్మద్ ఉగ్రవాదులు పార్లమెంటుపై దాడి చేశారు.

సీబీఐ వద్ద నుంచి 103 కిలోల బంగారం మాయం, మద్రాస్ హైకోర్టులో ఫిర్యాదు చేసిన బ్యాంకులు, విచార‌ణ చేప‌ట్టాల‌ని తమిళనాడు పోలీసులను ఆదేశించిన మద్రాస్ హైకోర్టు

పార్లమెంటు కాంప్లెక్స్‌లోకి ప్రవేశించి, విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఉగ్రదాడిలో ఆరుగురు దిల్లీ పోలీసులు, ఇద్దరు పార్లమెంట్ భద్రతా సిబ్బంది, ఒక తోటమాలి ప్రాణాలు కోల్పోయారు. మొత్తంగా 9 మంది ముష్కరుల దాడిలో అమరులయ్యారు. మరో 15 మంది గాయపడ్డారు. అనంతరం భద్రతా బలగాలు ఐదుగురు ముష్కరులను హతమార్చాయి.