Indore Sex Racket Case: 75 మందితో పెళ్లి.. మోజు తీరిన తరువాత వారిని సెక్స్ వర్కర్లుగా మార్చిన ఘరానా నేరస్థుడు, ఎట్టకేలకు ఇండోర్ సెక్స్ రాకెట్ సూత్రధారి మునీర్ ను పట్టుకున్న పోలీసులు
బంగ్లాదేశ్ నుంచి మహిళలను భారత్‌లోకి అక్రమంగా రవాణా (Indore Sex Racket Case) చేయడంతోపాటు, ఏకంగా 75 మందిని వివాహం చేసుకున్న ఈ నేరస్థుడిని గుజరాత్ సూరత్ పోలీసులు అరెస్టు (Indore Police arrests Bangladeshi smuggler) చేశారు.
Bhopal, Oct 6: మహిళల అక్రమ రవాణాకు పాల్పడుతూ, ఒకరు ఇద్దరు కాదు ఏకంగా 75 మందిని పెళ్లిచేసుకున్న ఘరానా నేరస్థుడు పోలీసులకు పట్టుబడ్డాడు. బంగ్లాదేశ్ నుంచి మహిళలను భారత్‌లోకి అక్రమంగా రవాణా (Indore Sex Racket Case) చేయడంతోపాటు, ఏకంగా 75 మందిని వివాహం చేసుకున్న ఈ నేరస్థుడిని గుజరాత్ సూరత్ పోలీసులు అరెస్టు (Indore Police arrests Bangladeshi smuggler) చేశారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఇటీవల ఓ సెక్స్ రాకెట్ (Sex Racket Busted in Indore) గుట్టును పోలీసులు రట్టు చేసిన పోలీసులు వ్యభిచార కూపం నుంచి 21 మంది యువతులను రక్షించారు.
ఈ కేసులో ప్రధాన నిందితుడైన మునిర్ (Munir alias Munirule) గుజరాత్‌లోని సూరత్‌లో పోలీసులకు పట్టుబడ్డాడు. బంగ్లాదేశ్‌లోని జాసుర్‌కు చెందిన మునిర్ అలియాస్ మునిరుల్.. ఆ దేశానికి చెందిన యువతులను ఉపాధి నెపంతో భారత్‌లోకి అక్రమ రవాణా చేసేవాడు. పశ్చిమబెంగాల్‌లోని ముర్షిదాబాద్ మీదుగా ఈ అక్రమ రవాణా వ్యవహారం సాగేది. ఈ క్రమంలో సరిహద్దులోని అధికారులకు మునిర్ రూ.25వేల చొప్పున లంచం ఇచ్చేవాడు. అనంతరం బంగ్లాదేశ్ యువతులను ముంబయి, కోల్‌కతా ప్రధాన కేంద్రాలుగా మునిర్ వ్యభిచారంలోకి దింపేవాడని పోలీసులు తెలిపారు.
Indore East SP Ashutosh Bagri IPS Tweet
ఇలా 200 మంది యువతులను భారత్‌లోకి అక్రమ రవాణా చేసినట్లు చెప్పారు. మరోవైపు, తాను ఇప్పటివరకు గత 5 సంవత్సరాల నుంచి 75 మందిని వివాహం చేసుకున్నట్లు మునిర్ చెప్పడంతో పోలీసులు ఖంగుతిన్నారు.మొత్తం 75 మంది భార్యలతో పాటు ఇప్పటి వరకు 200 మంది యువతులు, మహిళలను విటుల దగ్గరకు పంపాడు. మరికొంత మందిని వేశ్యవాటిక కేంద్రాల నిర్వహకులకు అమ్మేశాడని పోలీసులు నిర్థారించారు.
11 నెలల క్రితం ఇండోర్ పోలీసులు విజయనగర్ ఏరియాలోని ఓ వేశ్యవాటిక కేంద్రం మీద దాడి చెయ్యడంతో అక్కడ ఏకంగా 21 మంది బంగ్లాదేశ్ మహిళలు పట్టుబడ్డారు. అందులో 12 మంది మనీర్ ను పెళ్లి చేసుకున్న వారే ఉండటంతో పోలీసులు షాక్ అయ్యారు. మునీర్ ను పట్టించిన వారికి నగదు బహుమానం ఇస్తామని అప్పట్లో పోలీసులు ప్రకటించారు. బంగ్లాదేశ్ మహిళను వివాహం చేసుకున్న మునీర్ ఆమెను విక్రయించడానికి ప్రయత్నిస్తున్న సమయంలో సూరత్ పోలీసులకు చిక్కిపోయాడు.
మునీర్ సెక్స్ రాకెట్ దందా విషయం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. కిరాతకుడు మునీర్ బంగ్లాదేశ్ కు చెందిన అనేక మంది అమ్మాయిలను ముంబాయిలో కూడా అమ్మేసి ఉంటాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బంగ్లాదేశ్ మహిళలను అక్రమంగా పశ్చిమ బెంగాల్ లోకి తరలించడానికి మునీర్ కు చాలా మంది సహకరించి ఉంటారని పోలీసు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మునీర్ ను విచారణ చేస్తే అసలు విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉందని పోలీసు అధికారులు అంటున్నారు.