Hyderabad Shocker: పక్కింటి ఆంటీతో అక్రమ సంబంధం, పెళ్లి కాగానే ఆమెను వదిలేశాడు, తట్టకోలేక భర్తతో కలిసి యువకుడి భార్యను చంపేసిన ఆంటీ, పోలీసుల విచారణలో వాస్తవాలు వెలుగులోకి..
Representational Image | Couple (Photo Credits: Pixabay)

Hyderabad, August 14: భాగ్యనగరంలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తి భార్యను ఆ దంపతులిద్దరూ (Uttar Pradesh Couple) చంపేశారు. అంతే కాకుండా అమెను ప్రియుడు వచ్చి చంపాడని ఓ కట్టు కథ అల్లారు. అనుమానం వచ్చిన జీడిమెట్ల పోలీసులు రంగంలోకి దిగి కూపీ లాగితే కొత్త కథ బయటపడింది.

జీడిమెట్ల పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం అజాంగర్‌ జిల్లా లోనాపార్క్‌కు చెందిన సుజీత్‌యాదవ్‌ (35), రింకూ యాదవ్‌ (24) భార్యాభర్తలు. వీరు జీడిమెట్ల వినాయనగర్‌లో ఉంటున్నారు. ఇక జార్ఖండ్‌కుచెందిన రాజేశ్‌ వర్మ జీడిమెట్ల పరిధిలోని వినాయక్‌ నగర్‌లో ఐదేళ్లుగా నివాసముంటున్నాడు. ఇద్దరివి పక్క పక్క ఇళ్ళు కావండతో రింకుకు రాజేష్ దగ్గరయ్యాడు. వివాహేతర సంబంధం (extra marital Affair) కొనసాగిస్తూ ఆ ఇంటికి కావాల్సిన అన్ని ఖర్చులు భరిస్తూ వచ్చాడు.

సుజీత్‌ యాదవ్‌ ఆటో డ్రైవర్‌. జులాయిగా తిరిగి అప్పులపాలయ్యాడు. కూకట్‌పల్లిలో ప్రైవేట్‌ ఉద్యోగం చేసే రాజేష్‌ అనే వ్యక్తి దీన్ని అలుసుగా తీసుకుని అతని భార్యతో అక్రమ సంబంధం కొనసాగిస్తూ వచ్చాడు. అయితే ఏప్రిల్‌లో రాజేష్‌కు ధన్‌బాద్‌కు చెందిన పూజాతో వివాహమైంది. వివాహానంతరం రాజేష్‌, పూజలు అదే ఇంట్లో ఉంటున్నారు. పెళ్లి కావడంతో రాజేష్‌.. రింకూ యాదవ్‌ను పట్టించుకోవడం మానేశాడు.

తండ్రి రూపంలో కీచక కామాంధుడు..కూతురును కిడ్నాప్ చేసి ఆపై దారుణంగా అత్యాచారం, నిందితుడికి యావ‌జ్జీవ శిక్ష విధించిన మ‌ధుర కోర్టు, శిక్ష‌తగ్గించాలన్న నిందితుడి అభ్య‌ర్ధ‌న‌ను తిరస్కరించిన ప్ర‌త్యేక పోక్సో కోర్టు

ఇంకో ఇంటికి మారేందుకు సిద్ధమవుతున్నాడు. దీంతో రాజేష్‌ను తన వైపునకు తిప్పుకోవాలంటే పూజ అడ్డును తొలగించుకోవాలని రింకూ యాదవ్‌ దంపతులు భావించారు. ఈ నెల 10 తేదీన రాజేష్‌ పని మీద బయటకు వెళ్లగా పూజ ఒకటే ఉంది. ఇదే సరైన సమయంగా భావించిన రింకూయాదవ్, సుజీత్‌యాదవ్‌లు పూజముఖంపై దిండుతో ఊపిరాడకకుండా చేసి హత్య చేశారు. ఆపై నేరం తమపైకి రాకుండా పూజ వంటి మీద ఉన్న బంగారు ఆభరణాలను కాజేశారు.

నిందితుడు రేప్ చేసింది 11 నిమిషాలే.. బాధితురాలికి ఎక్కువ గాయాలు కూడా కాలేదు, అందువల్ల నిందితునికి శిక్ష తగ్గిస్తున్నామని తెలిపిన స్విట్జర్లాండ్‌ బాసెల్‌ కోర్టు, ఇదేం తీర్పు అంటూ బాసెల్‌ నగరవ్యాప్తంగా నిరసన గళం వినిపిస్తున్న ప్రజలు

కొద్దిసేపటి తరువాత వచ్చిన రాజేష్‌కు కట్టుకథ అల్లారు. పూజ మాజీ ప్రియుడు వచ్చి తనతో పాటు రమ్మని బలవంతం చేశాడని, రానని చెప్పడంతో హత్య చేసి వెళ్లిపోయాడని నమ్మించారు. ఈ విషయమై కేసు నమోదు చేసిన జీడిమెట్ల పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా రింకూయాదవ్, సుజీత్‌యాదవ్‌లను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా తామే పూజను హత్య చేసినట్లు అంగీకరించారు. వారి వద్ద నుంచి బంగారు లాకెట్‌ను స్వాదీనం చేసుకుని, ఇరువురిని శుక్రవారం రిమాండ్‌కు తరలించారు.