Delhi Riots: అంకిత్ శర్మ శరీరంపై 51 కత్తిపోట్లు, చార్జిషీట్ దాఖలు చేసిన ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు, ఈ అల్లర్ల వెనుక లోతైన కుట్ర దాగి ఉందని తెలిపిన పోలీస్ అధికారులు
కేంద్ర ప్రభుత్వం తీసుకురాదల్చిన సీఏఏకు వ్యతిరేకంగా ఢిల్లీలో ఫిబ్రవరి నెలలో జరిగిన అల్లర్లలో ఆందోళనాకారుల చేతికి పట్టుబడిన పోలీస్ అధికారి అంకిత్ శర్మ దారుణహత్యకు గురయ్యారు.
New Delhi, June 3: ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈశాన్య ఢిల్లీలో జరిగిన అల్లర్లలో (Delhi Riots) చనిపోయినట్లు గుర్తించిన ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారి (Intelligence Bureau staffer) అంకిత్ శర్మ 51 సార్లు కత్తిపోట్లకు గురైనట్లు ఢిల్లీ పోలీసుల క్రైమ్ బ్రాంచ్ బుధవారం దాఖలు చేసిన చార్జిషీట్‌లో పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం తీసుకురాదల్చిన సీఏఏకు వ్యతిరేకంగా ఢిల్లీలో ఫిబ్రవరి నెలలో జరిగిన ఢిల్లీ అల్లర్లలో ఆందోళనాకారుల చేతికి పట్టుబడిన పోలీస్ అధికారి అంకిత్ శర్మ దారుణహత్యకు గురయ్యారు. విగతజీవిగా కనిపించిన ఇంటిజెన్స్ బ్యూరో అధికారి అంకిత్ శర్మ
ఆయన మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించిన వైద్యులు.. పదునైన ఆయుధంతో 51 సార్లు పొడవడం వల్లనే ఆయన (Ankit Sharma) మృతిచెందారని వెల్లడించారు. ఈ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన కౌన్సిలర్ తాహిర్ హుస్సేన్‌తోపాటు మరో పది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ప్రాంతంలో సుపరిచితమైన ముఖంగా ఉన్న అంకిత్ శర్మ హత్య, అల్లర్లు వెనుక లోతైన కుట్ర ఉందని దర్యాప్తులో తేలింది. రణరంగంగా దేశ రాజధాని, రంగంలోకి ఆర్మీ బలగాలు
హుస్సేన్ నేతృత్వంలోని ఒక గుంపు అతన్ని ప్రత్యేకంగా లక్ష్యంగా చేసుకున్నట్లు ఈ రోజు దాఖలు చేసిన చార్జిషీట్‌లో పేర్కొంది.అల్లర్లు, నేరపూరిత కుట్ర, దురాక్రమణ, మత శత్రుత్వాన్ని ప్రోత్సహించడం మరియు ఆయుధ చట్టం కింద వ్యవహరించే విభాగాల కింద హుస్సేన్‌పై అభియోగాలు మోపారు. ఈశాన్య దిల్లీలో 'కనిపిస్తే కాల్చివేత' ఆదేశాలు
హత్య జరిగిన ప్రదేశం నుంచి రక్తం అంటుకున్న కత్తితోపాటు దుస్తులను పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. ఇదే సమయంలో తాహిర్ హుస్సేన్‌కు చెందిన లైసెన్స్ పొందిన తుపాకీని కూడా పోలీసులు సీజ్ చేశారు. ఈ నేపథ్యంలో అల్లర్లకు సంబంధించి పోలీసులు కోర్టులో మంగళవారం రెండు చార్జిషీట్లను దాఖలుపరిచారు. ఒక చార్జిషీట్‌లో అంకిత్ శర్మ హత్యలో తాహిర్ హుస్సేన్ ప్రధాన పాత్ర పోషించారని ఆరోపించారు. జేఎన్‌యూ పూర్వ విద్యార్థి అయిన ఉమర్ ఖాలిద్‌ను కలుసుకొన్న తాహిర్ హుస్సేన్ ఢిల్లీ అల్లర్లకు పథక రచన చేశారని చార్జిషీట్‌లో పేర్కొన్నారు. అనుకూల, వ్యతిరేక వర్గాల ఆందోళన
సీఏఏకు వ్యతిరేకంగా ఢిల్లీలో జరిగిన అల్లర్లలో దాదాపు 53 మంది మరణించగా, 400 మందికి పైగా గాయపడ్డారు. ఈ సమయంలో దారుణహత్యకు గురైన అంకిత్ శర్మ మృతదేహం ఈశాన్య ఢిల్లీలోని చాంద్ బాగ్ ప్రాంతంలోని ఫిబ్రవరి 26న మురికికాలువలో లభించింది. అంతకుముందు మూడు రోజులుగా ఆయన కనిపించకుండా పోయారు. ఇంటెలిజెన్స్ బ్యూరోలో సెక్యూరిటీ అసిస్టెంట్‌గా అంకిత్‌శర్మ 2017లో చేరారు.