Prime Minister Narendra Modi (Photo Credits: IANS)

New Delhi, February 26: దేశ రాజధాని ఢిల్లీ వేదికగా జరుగుతున్న సీఏఏ (CAA) అల్లర్లపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ( PM Narendra Modi) మొదటిసారిగా స్పందించారు. ఢిల్లీ ప్రజలు శాంతి, సోదరభావాన్ని పాటించాలని ట్విట్టర్ (Twitter) వేదికగా విజ్ఞప్తి చేశారు.

‘‘ఢిల్లీ ప్రజలు శాంతి, సోదరభావాన్ని పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నా. అల్లర్లపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించాను. శాంతియుతంగా మెలగండి. శాంతియుత వాతావరణం కోసం పోలీసులు, భద్రతాబలగాలు నిరంతరం శ్రమిస్తూనే ఉన్నాయి’’ అని ప్రధాని ట్వీట్ చేశారు.

రణరంగంగా దేశ రాజధాని, రంగంలోకి ఆర్మీ బలగాలు

మరోవైపు ఢిల్లీ అల్లర్ల (Delhi Violence) నేపథ్యంలో ప్రధాని మోదీ కేబినెట్ సబ్ కమిటీతో విస్తృత స్థాయి సమీక్షా సమావేశాన్ని మోదీ నిర్వహించారు. కాగా సీఏఏను వ్యతిరేకిస్తూ రెండు రోజులుగా ఈశాన్య ఢిల్లీలో అల్లర్లు చెలరేగిన విషయం తెలిసిందే. ఆ అల్లర్లో 20 మంది చనిపోగా, 180 మంది గాయపడిన విషయం తెలిసిందే.

Check Narendra Modi's tweet:

ఇదిలా ఉంటే దేశ రాజధాని ఢిల్లీలో (Delhi) చెలరేగిన హింసాకాండలో విషాద సంఘటన వెలుగుచూసింది. 26 ఏళ్ల ఇంటిజెన్స్ బ్యూరో అధికారి అంకిత్ శర్మ ( Intelligence Bureau officer Ankit Sharma) ఢిల్లీలోని చాంద్‌బాగ్‌లో దగ్గర ఓ మురికి కాలవలో విగతజీవిగా కనిపించారు. మంగళవారం సాయంత్రం నుంచి కనిపించకుండా పోయిన అంకిత్ శర్మ... ఓ మురుగు కాలువలో విగతజీవిగా కనిపించినట్టు ఆయన బాబాయి వెల్లడించారు.

Here's the tweet:

అర్థరాత్రి రంగంలోకి దిగిన అజిత్ డోవల్

బీజేపీ నేత కపిల్ మిశ్రా

ఇదిలా ఉంటే ఈశాన్య ఢిల్లీలో హింస చెలరేగడానికి తన వ్యాఖ్యలే కారణమంటూ వస్తున్న ఆరోపణలపై బీజేపీ నేత కపిల్ మిశ్రా (kapil mishra) స్పందించారు. బుర్హాన్ వనీ, అఫ్జల్ గురు లాంటి వాళ్లను ఉగ్రవాదులుగా భావించని వారికే తాను ఉగ్రవాదిలా కనిపిస్తున్నానంటూ విరుచుకుపడ్డారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన కపిల్ మిశ్రాను అరెస్టు చేయాలంటూ ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఇవాళ ఆయన ట్విటర్లో స్పందించారు.

సీఏఏ వ్యతిరేక ఆందోళనలు, అలీఘడ్‌లో ఇంటర్నెట్ సర్వీసులు నిలిపివేత

‘‘బుర్హాన్ వనీ, అఫ్జల్ గురు లాంటి వాళ్లను ఉగ్రవాదులుగా భావించని వాళ్లే.. కపిల్ మిశ్రాని ఉగ్రవాది అని పిలుస్తున్నారు. యాకుబ్ మీనన్, ఉమర్ ఖలీద్, షర్జీల్ ఇమామ్ లాంటి వాళ్ల కోసం కోర్టుకెళ్లి విడుదల చేయించుకున్న వాళ్లు కపిల్ మిశ్రాను అరెస్టు చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. జైశ్రీరాం..’’ అని వ్యాఖ్యానించారు.

అనుకూల, వ్యతిరేక వర్గాల ఆందోళలన

కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ

ఢిల్లీలో అల్లర్లు జరగడం చాలా బాధాకరమని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ (Sonia Gandhi) అన్నారు. బుధవారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఢిల్లీలో అల్లర్లకు బీజేపీనే కారణమని విమర్శించారు. ఈ అల్లర్లకు హోంమంత్రి అమిత్ షా నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ముందస్తు ప్రణాళికతోనే అల్లర్లు సృష్టించారన్నారు. అల్లర్లు జరుగుతుంటే ఢిల్లీ సీఎం ఏం చేస్తున్నారని సోనియా ప్రశ్నించారు.

ఉగ్రవాదుల ఇళ్లపై మూకుమ్మడి దాడులు

కాగా కపిల్‌ మిశ్రా ప్రసంగం రెచ్చగొట్టేలా ఉందని సోనియా గాంధీ మండిపడ్డారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు బలగాలను మోహరించాలని, సమస్యాత్మక ప్రాంతాలపై సీఎం కేజ్రీవాల్ దృష్టి పెట్టాలన్నారు. బాధితులకు కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలు సాయం చేయాలని సోనియా గాంధీ పిలుపు ఇచ్చారు.

ఈశాన్య దిల్లీలో 'కనిపిస్తే కాల్చివేత' ఆదేశాలు

ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌

ఢిల్లీలో (Delhi) ఆందోళనకర పరిస్థితులు నెలకొని ఉన్నాయని సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal) స్పష్టం చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఏఏ వ్యతిరేక, అనుకూల వర్గాల ఆందోళనలు, ఘర్షణలను నియంత్రించేందుకు పోలీసులు అన్ని రకాల చర్యలు చేపట్టారన్నారు.

ఢిల్లీ పరిస్థితులపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఢిల్లీ పోలీసు అధికారులతో ఇప్పటికే మూడుసార్లు సమావేశం

అదనపు బలగాలు మోహరించినా కొన్ని చోట్ల పరిస్థితి ఉద్రిక్తంగానే ఉందన్నారు. ఉద్రిక్త పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు సైన్యాన్ని రంగంలోకి దించాలన్న కేజ్రీవాల్‌.. ప్రభావిత ప్రాంతాల్లో వెంటనే కర్ఫ్యూ విధించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాకు లేఖ రాస్తున్నానని సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ తెలిపారు.