Jammu and Kashmir | (Photo Credits: PTI)

New Delhi, febuary 26: ఉగ్రవాదులు ఏ క్షణమైనా ఇండియాలోకి చొరబడే అవకాశం ఉందనే నిఘా వర్గాల హెచ్చరికలతో అధికారులు అలర్ట్ అయ్యారు. జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో ఉగ్రవాదుల ఉంటున్న ఇళ్లపై జమ్మూకాశ్మీర్ పోలీసులు(Jammu and Kashmir Police) దాడులను ముమ్మరం చేశారు. జమ్మూకశ్మీర్ ప్రాంతంలోని జైషే మహ్మద్ ఉగ్రవాదులు, వారితో సంబంధాలున్న వారి ఇళ్లపై నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అధికారులు (National Investigation Agency), జమ్మూకశ్మీర్ పోలీసులు బుధవారం మూకుమ్మడి దాడులు చేశారు.

అర్థరాత్రి రంగంలోకి దిగిన అజిత్ డోవల్

పుల్వామా జిల్లాలో బుధవారం ఉదయం జైషే మహ్మద్ టాప్ కమాండర్ జాహిద్ షేక్ ఇంటిపై (Jaish terrorist Zahid Sheikh's house) ఎన్ఐఏ అధికారులు దాడులు చేశారు. కాకపోరా, క్వాస్ బయర్, పుల్వామా ప్రాంతాల్లో జైషే ఉగ్రవాదులతో సంబంధాలున్న వారి ఇళ్లపై దాడులు చేసి తనిఖీలు చేశారు. దక్షిణ కశ్మీర్‌లో దాడులు కొనసాగుతున్నాయి. ఈ విషయాన్ని ఎఎన్ఐ ట్వీట్ చేసింది. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

ఇదిలా ఉంటే జమ్మూ కాశ్మీర్‌లో ఇంటర్నెట్‌ పై (Internet) ఆంక్షలు మరికొంత కాలం కొనసాగనున్నాయి. వచ్చే నెల నాలుగో తేదీ వరకు ఇంటర్నెట్‌ వినియోగంపై ఆంక్షలు ఉంటాయని ఆ రాష్ట్ర అధికారులు చెబుతున్నారు. ఇంటర్నెట్‌ను దేశ సరిహద్దుల్లోని విద్రోహ శక్తులు దుర్వినియోగం చేస్తూ జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రదాడులకు ప్రణాళికలు రచిస్తున్నట్టు గుర్తించామని తెలిపారు.

Here's ANI Tweet

గత వారం రోజులుగా జరుగుతున్న ఉగ్ర కార్యకలాపాలతో పాటు రాష్ట్రంలో అశాంతిని నెలకొల్పేందుకు జరుగుతున్న ఆందోళనల దృష్ట్యా కాశ్మీర్‌ లోయలోని కొన్ని ప్రాంతాల్లో మొబైల్‌ ఇంటర్నెట్‌ను కూడా నిలిపివేసినట్టు రాష్ట్ర ప్రిన్సిపల్‌ సెక్రటరీ షాలీన్‌ కబ్రా పేర్కొన్నారు. దేశ, రాష్ట్ర ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు