International Flights: జూలై 17 నుండి అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభం, వెల్లడించిన పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి
కోవిడ్ -19 మహమ్మారి మధ్య అంతర్జాతీయ విమాన ప్రయాణాన్ని తిరిగి ప్రారంభించడానికి సిద్ధం అవుతున్నట్లు ఆయన ట్విట్టర్ ద్వారా తెలిపారు. ముందుగా జూలై 18 నుంచి ఆగస్టు 1 వరకు ఫ్రాన్స్ నుండి ఢిల్లీ, ముంబై, బెంగళూరు, పారిస్ మధ్య 28 విమానాలను నడుపుతామని తెలిపారు.
New Delhi, July 16: అంతర్జాతీయ విమాన సర్వీసులను తిరిగి ప్రారంభించినున్నట్లు (International Flights to Begin in India) పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి (Hardeep Singh Puri) చెప్పారు. కోవిడ్ -19 మహమ్మారి మధ్య అంతర్జాతీయ విమాన ప్రయాణాన్ని తిరిగి ప్రారంభించడానికి సిద్ధం అవుతున్నట్లు ఆయన ట్విట్టర్ ద్వారా తెలిపారు. ముందుగా జూలై 18 నుంచి ఆగస్టు 1 వరకు ఫ్రాన్స్ నుండి ఢిల్లీ, ముంబై, బెంగళూరు, పారిస్ మధ్య 28 విమానాలను నడుపుతామని తెలిపారు. సుశాంత్ మరణంపై సీబీఐ విచారణ, బీహార్ ఎంపి పప్పు యాదవ్ లేఖపై స్పందించిన హోంమంత్రి, సుశాంత్ సింగ్ గర్ల్‌ఫ్రెండ్‌కి తప్పని వేధింపులు
అమెరికన్ క్యారియర్ యునైటెడ్ ఎయిర్‌లైన్స్ జూలై 17 నుంచి జూలై 31 వరకు భారత్, అమెరికా మధ్య 18 విమాన సర్వీసులు నడుపుతుందని ఆయన విలేకరుల సమావేశంలో పూరి అన్నారు. యుఎస్ నుండి డిల్లీ.. న్యూయార్క్ మధ్య రోజువారీ విమాన సర్వీసును అలాగే ఢిల్లీ.. శాన్ఫ్రాన్సిస్కో మధ్య వారానికి మూడుసార్లు విమాన సర్వీసులను నడపనున్నట్లు తెలిపారు.
Here's what HS Puri said:
త్వరలో యుకెతో బబుల్ ఏర్పాటు చేయాలని భారత్ యోచిస్తోందని, దీని కింద ఢిల్లీ, లండన్ మధ్య రోజుకు రెండు విమాన సర్వీసులు నడవనున్నట్లు మంత్రి తెలిపారు. "భారతదేశానికి విమానాలను అనుమతించమని జర్మన్ క్యారియర్‌ల నుండి మాకు అభ్యర్థన ఉందని దాన్ని మేము ప్రాసెస్ చేస్తున్నాము" అని ఆయన చెప్పారు. కాగా భారతదేశం నుండి, ఎయిర్ ఇండియా ఫ్రాన్స్ మరియు యుఎస్‌లకు విమానాలను నడుపుతుంది. కరోనావైరస్ మహమ్మారి కారణంగా మార్చి 23 నుండి భారతదేశంలో షెడ్యూల్డ్ అంతర్జాతీయ ప్రయాణీకుల విమానాలు నిలిపివేయబడ్డాయి. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఎ) జూలై 15 వరకు అంతర్జాతీయ విమానాల నిషేధాన్ని నిలిపివేసిన తరువాత దాన్ని జూలై 31 వరకు పొడిగించింది.
ప్రభుత్వ సీనియర్ అధికారుల ప్రకారం, నిషేధం పొడిగించబడింది ఎందుకంటే దీనికి మరికొంత సమయం పడుతుందని భావించారు, అయితే ఏవియేషన్ మంత్రి దీనిపై ట్విట్టర్ ద్వారా క్లారిటీ ఇచ్చారు. జూలై 13 నాటికి, ఎయిర్ ఇండియా మరియు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ 1103 విమానాలను నడిపించాయి, వందే భారత్ మిషన్ కింద 2,08,000 మంది భారతీయులను అవి తిరిగి ఇండియాకు తీసుకువచ్చాయి. అలాగే "ఈ విమానాలలో, మేము 85289 మంది ప్రయాణికులను ప్రపంచంలోని వివిధ దేశాలకు తిరిగి తీసుకువెళ్ళాము" అని ఎయిర్ ఇండియా సిఎండి రాజీవ్ బన్సాల్ చెప్పారు.
ఈ ఏడాది దీపావళి నాటికి కనీసం 55-60 శాతం ప్రీ-కోవిడ్ దేశీయ విమానాలు భారతదేశంలో నడుస్తాయని పూరి చెప్పారు. భారతదేశంలో షెడ్యూల్ చేయబడిన అన్ని వాణిజ్య ప్రయాణీకుల విమానాలను లాక్డౌన్ చేసి, నిలిపివేసినట్లు ప్రకటించిన రెండు నెలల తరువాత, మే 25 నుండి దేశీయ ప్రయాణీకుల విమాన సేవలు తిరిగి ప్రారంభమయ్యాయి.