Iran's Islamic Revolution Guards Corps Seized 'MSC Aries (Photo Credits: X/@That_Pune_Guy)

ఇజ్రాయెల్‌తో ఉద్రిక్తతల వేళ భారత్‌కు వచ్చే ఓ నౌకను ఇరాన్‌ స్వాధీనం చేసుకోవడం తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. ఆ షిప్‌లో ఉన్న 17 మంది భార‌తీయ సిబ్బంది(Indian crew)ని క‌లిసేందుకు భార‌త అధికారుల‌కు అనుమ‌తి ఇవ్వ‌నున్న‌ట్లు ఇరాన్ వెల్ల‌డించింది. కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంక‌ర్ .. ఇరాన్ మంత్రి అమిర్ అబ్దొల్లియాన్‌తో ఈ అంశంపై మాట్లాడిన త‌ర్వాత క్లారిటీ వచ్చింది. భార‌తీయ సిబ్బందిని క‌లిసేందుకు స‌హ‌క‌రించాల‌ని జైశంక‌ర్ కోరిన‌ట్లు ఇరాన్ విదేశాంగ శాఖ ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. మోగిన యుద్ధభేరి.. ఇజ్రాయెల్‌ పై డ్రోన్ల దాడిని ప్రారంభించిన ఇరాన్‌.. జనావాసాల మీదకు దూసుకొచ్చిన రాకెట్లు, క్షిపణులు.. వీడియోలు వైరల్

గత శనివారం హర్మూజ్‌ జలసంధి సమీపంలో ఇజ్రాయెలీ కుబేరుడికి చెందిన వాణిజ్య నౌక ఎంఎస్‌సీ ఏరిస్‌ను ఇరాన్‌కు చెందిన ఐఆర్‌జీసీ దళం హెలికాప్టర్లతో వెంబడించి అధీనంలోకి తీసుకొంది. నౌకలో మొత్తం 25 మంది సిబ్బంది ఉండగా.. వారిలో 17 మంది భారతీయులు ఉన్నారు. సీజ్ చేసిన షిప్ గురించి పూర్తిగా తెలుసుకుంటున్నామ‌ని, భార‌త ప్ర‌భుత్వ ప్ర‌తినిధుల‌తో దీనిపై మాట్లాడ‌నున్న‌ట్లు అమిర్ అబ్దొల్లియాన్ తెలిపారు. అయితే ఇజ్రాయిల్‌, ఇరాన్ మ‌ధ్య ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్న నేప‌థ్యంలో స‌మ‌స్య‌ను శాంతియుతంగా ప‌రిష్క‌రించాల‌ని జైశంక‌ర్ కోరారు.



సంబంధిత వార్తలు

SRK on Exit Polls: ఏపీ ఎగ్జిట్ పోల్స్ పై స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి తొలి స్పంద‌న ఇది! టీడీపీ గెలుస్తుంద‌న్న స‌ర్వేల‌పై స‌జ్జ‌ల ఏమ‌న్నారంటే?

Exit Polls 2024: క‌డ‌ప‌లో ష‌ర్మిల గెలుస్తారా? ఓడిపోతున్నారా? ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పాయో తెలుసా

AARAA Exit Poll: పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో గెలవబోతున్నారంటున్న ఆరా మస్తాన్ సర్వే, లోకేష్ తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారని వెల్లడి

Andhra Pradesh Assembly Exit Poll: ఏపీ అసెంబ్లీ ఎగ్జిట్ పోల్స్ పూర్తి వివరాలు ఇవిగో, అధికార వైసీపీకే మొగ్గు చూపిన మెజార్టీ సర్వేలు

Telangana Exit Poll: తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి భారీ షాకిచ్చిన ఎగ్జిట్ పోల్స్, కాంగ్రెస్, బీజేపీ మధ్యనే టఫ్ పైట్, బీజేపీ అత్యధిక లోక్ సభ స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందంటున్న సర్వేలు

Lok Sabha Exit Poll: అధికార బీజేపీ కూటమికే పట్టం కట్టిన మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ సర్వేలు, కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్ల మధ్య వస్తాయంటే..

Andhra Pradesh Lok Sabha Exit Poll: ఏపీలో లోక్ సభ స్థానాల ఎగ్జిట్ పోల్స్ పూర్తి వివరాలు ఇవిగో, ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయంటే..

Operation Chanakya Exit Poll: అధికార వైసీపీకే జైకొట్టిన ఆపరేషన్ చాణక్య సర్వే, 95 నుంచి 102 సీట్లతో జగన్ మళ్లీ అధికారంలోకి, 64 నుంచి 68 సీట్ల మధ్యలో టీడీపీ