Prashant Bhushan Tweets Row: క్షమాపణ చెప్పేది లేదన్న ప్రశాంత్ భూషణ్, చెబితే తప్పేంటి అన్న సుప్రీంకోర్టు, ప్రశాంత్‌ భూషణ్‌ కోర్టు ధిక్కరణ కేసు విచారణ తీర్పు వాయిదా

అత్యున్నత న్యాయస్థానానికి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ఏ బాబ్డేకు వ్యతిరేకంగా ట్వీట్లు (Prashant Bhushan Tweets) చేసిన ప్రశాంత్‌ భూషణ్‌ ని క్షమాపణ చెప్పాలని అత్యున్నత న్యాయస్థానం (Supreme Court) కోరింది. అయితే దీనికి ఆయన ససేమిరా అనడంతో పాటుగా తనని దోషిగా ఇచ్చిన తీర్పుని రీకాల్‌ చేయాలని మంగళవారం కోర్టుని అభ్యర్థించారు.

File image of advocate Prashant Bhushan | (Photo Credits: PTI)

New Delhi, August 26: కోర్టు ధిక్కార కేసులో లాయర్‌ ప్రశాంత్‌ భూషణ్‌కు (civil right lawyer Prashant Bhushan) శిక్ష ఖరారు తీర్పుని సుప్రీంకోర్టు వాయిదా వేసింది. అత్యున్నత న్యాయస్థానానికి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ఏ బాబ్డేకు వ్యతిరేకంగా ట్వీట్లు (Prashant Bhushan Tweets) చేసిన ప్రశాంత్‌ భూషణ్‌ ని క్షమాపణ చెప్పాలని అత్యున్నత న్యాయస్థానం (Supreme Court) కోరింది.

అయితే దీనికి ఆయన ససేమిరా అనడంతో పాటుగా తనని దోషిగా ఇచ్చిన తీర్పుని రీకాల్‌ చేయాలని మంగళవారం కోర్టుని అభ్యర్థించారు. ప్రశాంత్ భూషణ్‌ను ఇంతటితో వదిలేయాలని ఆయన తరఫున న్యాయవాది రాజీవ్‌ ధావన్‌ (Rajeev Dhavan) కోరారు. మరోవైపు అటార్నీ జనరల్‌ కె.కె. వేణుగోపాల్‌ (Attorney General K.K. Venugopal) కూడా భూషణ్‌ని క్షమించి వదిలేయాలని, అయితే ప్రశాంత్‌ భూషణ్‌ తన ట్వీట్లన్నీ వెనక్కి తీసుకోవాలని వాదించారు.

దీనిపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తప్పు చేసినప్పుడు నిజాయితీగా క్షమాపణలు కోరటంవల్ల అనేక సమస్యలు పరిష్కారమవుతాయని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఒక వ్యక్తి తన మాటలతో ఎవరినైనా బాధపెడితే వారికి క్షమాపణ చెప్పటంలో తప్పేమిటని ప్రశ్నించింది. జాతిపిత మహాత్మాగాంధీ కూడా తనవల్ల తప్పు జరిగినప్పుడు క్షమాపణ చెప్పిన సందర్భాలు ఉన్నాయని గుర్తుచేసింది. క్షమాపణ కోరితే న్యాయ‌వ్య‌వ‌స్థ ఉల్లంఘ‌నే అవుతుంది, కోర్టు ధిక్క‌ర‌ణ కేసులో క్ష‌మాప‌ణ‌లు చెప్పేందుకు నిరాకరించిన ప్ర‌శాంత్ భూష‌ణ్

క్షమించు అనే మాట వాడటంలో తప్పేముందో చెప్పండి? మేము ఈ మాట కేవలం ప్రశాంత్‌భూషణ్‌ గురించి మాత్రమే అడుగటం లేదు. సాధారణంగా అడుగుతున్నాం. తప్పులు అందరూ చేస్తారు. చేసిన తప్పులను అందరూ తప్పక అంగీకరించాలి. కానీ ఇక్కడ భూషణ్‌ అలా అంగీకరించటంలేదు. మనమంతా పరస్పరం గౌరవం ఇచ్చిపుచ్చుకోవాలి. గాయానికి కారణమైనవారే దానికి లేపనం రాయాలి’ అని జస్టిస్‌ అరుణ్‌మిశ్రా అన్నారు.

Supreme Court gave 30-minutes time to Prashant Bhushan to 'think over' his stand:  

కాగా ప్రశాంత్‌ భూషణ్‌ తరఫున హాజరైన సీనియర్‌ అడ్వకేట్‌ రాజీవ్‌ ధావన్‌ సుప్రీం కోర్టు ప్రశాంత్‌ భూషణ్‌ని ఎలాంటి హెచ్చరికలు, మందలిం పులు లేకుండా వదిలేయాలన్నారు. భూషణ్‌ ఎలాంటి దోపిడీలు, హత్యలు చేయలేదని అన్నారు. న్యాయస్థానం తన రాజనీతిజ్ఞతను ప్రదర్శిస్తేనే ఈ వివాదం ముగుస్తుందని చెప్పారు. అయితే ధర్మాసనం మాత్రం ఎందుకు తీసుకోవద్దని ప్రశ్నించింది. సుప్రీంకోర్టుతో పాటు జడ్జిపై అనుచిత ట్వీట్లు, ప్రశాంత్ భూషణ్‌ను దోషిగా తేల్చిన అత్యున్నత న్యాయస్థానం

ఇప్పుడు ఆయన మాటలను పట్టించుకోకుంటే ఎవరైనా ముందుముందు ఇంతకంటే తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తారు’ అని అరుణ్‌ మిశ్రా వ్యాఖ్యానించారు. విమర్శలనేవి నిజాయితీగా చేస్తే ఇబ్బందేమీ ఉండదు. వ్యవస్థకీ మంచి జరుగుతుంది. కానీ ఒక న్యాయవాదే తోటివారిపై నిందలు వేస్తూ ఉంటే, ఈ వ్యవస్థపై ప్రజలకి నమ్మకం ఎందుకు ఉంటుంది’’అని మిశ్రా వ్యాఖ్యానించారు.

మంగళవారం ఉదయం కోర్టు కార్యకలాపాలు మొదలయ్యాక కూడా సుప్రీం బెంచ్‌ క్షమాపణ చెప్పడానికి ప్రశాంత్‌ భూషణ్‌కి అరగంట గడువు ఇచ్చింది. అయినా ఆయన తాను చేసిన ట్వీట్లలో తప్పేం లేదనే వాదించారు. సుప్రీంకోర్టు కుప్పకూలిపోయిందని భూషణ్‌ చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరం కాదా అని ప్రశ్నించిన జస్టిస్‌ మిశ్రా శిక్ష ఖరారుని వాయిదా వేశారు.



సంబంధిత వార్తలు