Prashant Bhushan: సుప్రీంకోర్టుతో పాటు జడ్జిపై అనుచిత ట్వీట్లు, ప్రశాంత్ భూషణ్‌ను దోషిగా తేల్చిన అత్యున్నత న్యాయస్థానం, భూషణ్‌కు శిక్షపై విచారణ ఈ నెల 20వ తేదీకి వాయిదా
Supreme Court of India | Photo-IANS)

New Delhi, August 14: ప్రముఖ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌కు (Prashant Bhushan:) సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తప్పలేదు. కోర్టు ధిక్క‌ర‌ణ కేసులో లాయ‌ర్ ప్ర‌శాంత్ భూష‌న్ దోషిగా తేలారు. ట్విటర్‌ వేదికగా ఉన్నత న్యాయస్థానం, న్యాయమూర్తులపై ( CJI) అనుచిత వ్యాఖ్యలతో కోర్టు ధిక్కరణకు పాల్పడినట్టుగా నిర్ధారించిన కోర్టు (Supreme Court) ప్రశాంత్ భూషణ్‌ను దోషిగా తేల్చింది. తీవ్రమైన ధిక్కారానికి పాల్పడినట్లుగా తేలిందంటూ సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం శుక్రవారం తీర్పునిచ్చింది. అనంతరం భూషణ్‌కు శిక్షపై విచారణను ఈ నెల 20 తేదీకి వాయిదా వేసింది.

అరుణ్ మిశ్రా, బీఆర్ గ‌వాయి, కృష్ణ‌మురారీల‌తో కూడిన త్రిస‌భ్య ధ‌ర్మానం ఈ తీర్పును ఇచ్చింది. ఆగ‌స్టు 3వ తేదీన జారీ చేసిన అఫిడ‌విట్‌లో లాయ‌ర్ ప్ర‌శాంత్ భూష‌ణ్ త‌న వివాదాస్పద ట్వీట్ల ప‌ట్ల క్ష‌మాప‌ణ‌లు చెప్పారు. కానీ సుప్రీంకోర్టు ఆ క్ష‌మాప‌ణ‌ల‌ను తిర‌స్క‌రించింది. సుప్రీం న్యాయ‌మూర్తుల‌ను విమ‌ర్శించినంత మాత్రాన .. యావ‌త్ కోర్టును త‌ప్పుప‌ట్టిన‌ట్లు కాద‌ని భూష‌ణ్ వాదించారు. చీఫ్ జ‌స్టిస్ ఎస్ఏ బోన్డేతో పాటు సుప్రీంకోర్టుపై ఇటీవ‌ల అనుచిత ట్వీట్లు చేశారు. షెడ్యూల్డ్ ప్రాంతాల్లో రిజర్వేషన్లు 50 శాతం మించరాదు, తెలుగు రాష్ట్రాలను హెచ్చరించిన సుప్రీంకోర్టు, అప్పటి నియామకాల్లో జోక్యం చేసుకోబోమంటూ వెల్లడి

లాక్‌డౌన్ వేళ సీజే బోబ్డే ఓ సూప‌ర్‌బైక్‌తో ఉన్న ఫోటోను రిలీజ్ చేశారు. అప్పుడు దానిపై భూష‌ణ్ అనుచిత కామెంట్స్ చేశారు. చీఫ్ జ‌స్టిస్ ఎందుకు హెల్మెట్ పెట్టుకోలేద‌ని భూష‌ణ్ త‌న ట్వీట్లో ప్ర‌శ్నించారు. అయితే బైక్ స్టాండ్‌పై ఉన్న‌ద‌ని, ఆ స‌మ‌యంలో హెల్మెట్ అవ‌స‌రం లేద‌ని, కానీ స్టాండ్‌పై ఉన్న బైక్‌పై సీజే ఉన్న‌ట్లు తాను గుర్తించ‌లేద‌ని, అందుకే క్ష‌మాప‌ణ‌లు చెప్పిన‌ట్లు ప్ర‌శాంత్ గ‌త అఫిడ‌విట్‌లో తెలిపారు.

దీంతో పాటు సుప్రీం కోర్టు తీరు ప‌ట్ల కూడా ప్ర‌శాంత్ భూషణ్ వివాదాస్ప‌ద ట్వీట్ ఛేశారు. న్యాయ‌మూర్తుల‌ను ఆయ‌న త‌ప్పుప‌డుతూ ఓ ట్వీట్ చేశారు. ప్ర‌శాంత్ భూష‌ణ్ త‌ర‌పున న్యాయ‌వాది దుశ్యంత్ దావే వాదించారు. ప్ర‌శాంత చేసిన రెండు ట్వీట్లు సుప్రీం వ్య‌వ‌స్థ‌కు వ్య‌తిరేకంగా లేవ‌న్నారు. కొంద‌రు జ‌డ్జిల వ్య‌క్తిగ‌త ప్ర‌వ‌ర్త‌న‌ను ఉద్దేశిస్తూ ప్ర‌శాంత్ కామెంట్ చేశార‌న్నారు. న్యాయ‌వ్య‌వ‌స్థ‌ను విమ‌ర్శించిన ప్ర‌శాంత్ భూష‌ణ్‌పై సుప్రీం సుమోటో కేసును స్వీక‌రించింది. కరోనా భయం, సుప్రీంకోర్టు పాక్షిక మూసివేత, కేసులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ, లాయర్లు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేసుకు హాజరుకావాలి, ఆదేశాలు జారీ చేసిన సీజే

దీనిపై ప్రశాంత్‌ భూషణ్‌కు ఆరు నెలల సాధారణ జైలు శిక్ష లేదా 2000 రూపాయల వరకు జరిమానాతో లేదా రెండింటితో సాధారణ జైలు శిక్ష విధించవచ్చని భావిస్తున్నారు. కాగా కోర్టు ధిక్కరణ ఆరోపణలతో ప్రశాంత్‌ భూషణ్‌కు జూలై 22న షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసుకు సమాధానమిస్తూ, వివరణాత్మక అఫిడవిట్‌ను ప్రశాంత్‌ దాఖలు చేశారు. దీన్ని ఆగస్టు 5 న విచారించిన కోర్టు తీర్పును రిజర్వు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా దోషిగా ప్రకటిస్తూ..విచారణను ఈ నెల 20 తేదీకి వాయిదా వేసింది.