Kirak RP: నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు హోటల్ మూసేసిన కిరాక్ ఆర్పీ, మళ్లీ త్వరలో ఓపెన్ చేస్తానని వెల్లడి, మాస్టర్ల కోసం నెల్లూరు వెళ్లిన జబర్దస్ట్ నటుడు

తన షాప్ కి వచ్చే వాళ్లందరికీ తగిన ఐటమ్స్ అందించలేక చాలా ఇబ్బంది పడుతున్నారని ఆర్పి కొన్ని వీడియోలలో తెలియజేశారు. ఈ క్రమంలోనే కస్టమర్ల తాకిడి తట్టుకోలేక ఏకంగా వారం రోజులపాటు షాపును మూసీ వేసి పని వాళ్ల కోసం నెల్లూరుకి వచ్చానని తెలియజేశారు.

Kiraak RP (Photo-Video Grab)

జబర్దస్త్ షో ద్వారా మంచి కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్న కిరాక్ ఆర్పి (Jabardasth kirak RP) షో మానేసి సొంతంగా హోటల్ పెట్టిన సంగతి విదితమే. నాన్ వెజ్ ప్రియుల కోసం హైదరాబాదులో నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు (Nellore peddareddy chapala pulusu) అనే పేరుట ఒక షాప్ ని ఓపెన్ చేశారు. ఈ వ్యాపారం బాగా సాగుతుందని కిరాక్ ఆర్పి తెలియజేశారు. అంతేకాకుండా ప్రతిరోజు రూ.2 లక్షల రూపాయలు వస్తున్నట్లు తెలియజేశారు.

అయితే ఈ షాపు నెల రోజుల పాటు మూసివేస్తున్నట్లుగా తెలిపారు. తన షాప్ కి వచ్చే వాళ్లందరికీ తగిన ఐటమ్స్ అందించలేక చాలా ఇబ్బంది పడుతున్నారని ఆర్పి కొన్ని వీడియోలలో తెలియజేశారు. ఈ క్రమంలోనే కస్టమర్ల తాకిడి తట్టుకోలేక ఏకంగా వారం రోజులపాటు షాపును మూసీ వేసి పని వాళ్ల కోసం నెల్లూరుకి వచ్చానని తెలియజేశారు. నెల్లూరులో చేపల పులుసు వండే వారితోపాటు హోటల్లో పనిచేసే వారి కోసం వెతుకుతున్నట్లుగా సమాచారం.

నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు కర్రీ పాయింట్, కూకట్ పల్లిలో కిరాక్‌ ఆర్పీ కర్రీ పాయింట్‌ ఇదే, అన్నీ కట్టెలపొయ్యి మీదనే వండుతామని తెలిపిన కమెడియన్

చేపల పులుసు అద్భుతంగా చేసే వారికి తన దగ్గర ఉపాధి కల్పించడమే కాకుండా వారిని సొంత కుటుంబ సభ్యులుగా చూసుకుంటానని భరోసా కల్పిస్తానని తెలిపారు కిరాక్ ఆర్పి. నెల్లూరు మహిళలు చేపలు కడిగే పద్ధతి మిగతా వారి కంటే చాలా భిన్నంగా ఉంటుందని తెలియజేశారు. అలాగే కట్టెల పొయ్యి మీద చేసేటువంటి చేపల పులుసు కూడా రుచికి తగ్గట్టుగానే ఉంటుందని తెలిపారు.

జబర్దస్త్ కిర్రాక్ ఆర్పీ, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు కర్రీ పాయింట్ ఓపెన్ చేసి, ఒక్క నెలలో ఎంత సంపాదించాడో తెలిస్తే, షాక్ తింటారు..

ఇక తన వ్యాపారానికి మంచి ఆదరణ లభిస్తూ ఉండడంతో మ్యాన్ పవర్ కొరత కారణంగా.. డిమాండ్ సరిపడా కస్టమర్లకు ఐటమ్స్ అందించలేకపోతున్నామని దీంతో నిరాశగా వెళుతుంటే తనకు బాధ ఉందని త్వరలోనే నెల్లూరు నుంచి మంచి మాస్టర్ల తీసుకువచ్చి కర్రీ పాయింట్ తిరిగి ఓపెన్ చేస్తున్నానని తెలిపారు.



సంబంధిత వార్తలు

RP Patnaik on Uday Kiran: ఉదయ్ కిరణ్ శవాల గదిలో అలా పడి ఉన్న దృశ్యం చూసి తట్టుకోలేకపోయా, ఓ ఛానల్ ఇంటర్యూలో ఒక్కసారిగా ఎమోషన్ అయిన సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్

Kiraak RP: నెల్లూరు పెద్దా రెడ్డి చేపల పులుసు కర్రీ పాయింట్ ద్వారా కిర్రాక్ ఆర్పీ నెలకు రూ. 50 లక్షలు సంపాదిస్తున్నాడా, ఆ డబ్బుతో త్వరలో ఏం చేస్తున్నాంటే..?

Kirak RP: నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు హోటల్ మూసేసిన కిరాక్ ఆర్పీ, మళ్లీ త్వరలో ఓపెన్ చేస్తానని వెల్లడి, మాస్టర్ల కోసం నెల్లూరు వెళ్లిన జబర్దస్ట్ నటుడు

Jabardasth Kirak RP: జబర్దస్త్ కిర్రాక్ ఆర్పీ, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు కర్రీ పాయింట్ ఓపెన్ చేసి, ఒక్క నెలలో ఎంత సంపాదించాడో తెలిస్తే, షాక్ తింటారు..