ఇటీవలే తాను ప్రేమించిన అమ్మాయిని నిశ్చితార్థం చేసుకుని పెళ్లికి రెడీ అయిన జబర్దస్త్ కమెడియన్ కిరాక్ ఆర్పీ కర్రీ పాయింట్ బిజినెస్ మొదలుపెట్టాడు.కూకట్‌పల్లిలో నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు పేరిట కర్రీ పాయింట్‌ను ప్రారంభించాడు. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే.. చేపల పులుసు, బొమ్మిడాయిల పులుసు, కొరమీను పులుసు, సన్నచేపల పులుసు, రవ్వ చేపల పులుసు, చేప తలకాయ పులుసు.. ఇలా అన్నీ కట్టెలపొయ్యి మీదనే వండుతారట. అన్నీ కలిసొస్తే నెల్లూరు చేపల పులుసు కర్రీ పాయింట్స్ 15 బ్రాంచులు ఓపెన్ చేస్తానంటున్నాడు ఆర్పీ.పదేళ్ల కిందటే దీన్ని ప్రారంభించాలనుకున్న అతడు ఎట్టకేలకు అనుకున్నది సాధించాడు.కిరాక్ ఆర్పీ స్వస్థలం నెల్లూరు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)