RP Patnaik on Uday Kiran: ఉదయ్ కిరణ్ శవాల గదిలో అలా పడి ఉన్న దృశ్యం చూసి తట్టుకోలేకపోయా, ఓ ఛానల్ ఇంటర్యూలో ఒక్కసారిగా ఎమోషన్ అయిన సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్
R.P. Patnayak (Photo-Facebook)

సంగీత దర్శకుడిగా ఒకానొక దశలో అనేక హిట్ సాంగ్స్ తో ప్రేక్షకుల్లో హుషారు పుట్టించిన ఆర్పీ పట్నాయక్ (RP Patnaik) అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆయన మ్యూజిక్ చేసిన ఎన్నో పాటలు సూపర్ హిట్ గా నిలిచాయి. ముఖ్యంగా దివంగత హీరో కిరణ్ హీరోగా (Late Hero Uday Kiran) చేసిన సినిమాలకు ఆయన అందించిన పాటలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. తాజాగా సుమన్ టీవీ వారు నిర్వహిస్తున్న 'మిస్టర్ ఇనిస్పిరేషన్' షోకి ఆర్పీ పట్నాయక్ గెస్ట్ గా హాజరయ్యారు.

తెలుగు సినీ పరిశ్రమలో మరో విషాదం, ప్రముఖ నటుడు వేణు తండ్రి ప్రొఫెసర్‌ వెంకట సుబ్బారావు మృతి

ఆ షోలో ఉదయ్ కిరణ్ టాపిక్ రావడంతో (RP Patnaik on Uday Kiran) ఆయన ఒక్కసారిగా ఎమోషన్ అయ్యారు. ఉదయ్ కిరణ్ గురించి మాట్లాడుతూ.. ఆ హీరో లో పట్టుదల ఎక్కువ. ఏదైనా అనుకుంటే దానిని పూర్తిచేయడానికి ఎలాంటి అడ్డంకులనైనా అధిగమించాలనే ఒక బలమైన సంకల్పం ఉదయ్ కిరణ్ లో నాకు కనిపించింది. అలాంటి వ్యక్తికి అలాంటి పరిస్థితి రావడం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది.

ఎంతో స్టార్ డమ్ చూసిన ఉదయ్ కిరణ్, శవాల గదిలో అలా పడున్నాడు .. అక్కడ ఎవరూ లేరు. ఆ దృశ్యం చూసి నేను తట్టుకోలేకపోయాను" అన్నారు. నాకు మ్యూజిక్ తెలియదు .. పాటలకి ట్యూన్స్ కడతాను .. కానీ అది ఏ రాగంలో ఉందంటే చెప్పలేను. మొదటి నుంచి కూడా బాలుగారు - ఇళయరాజాగారి పాటలను ఎక్కువగా వినేవాడిని. వాళ్లే నా ఇనిస్పిరేషన్ అని చెబుతానని అన్నారు.