Ayodhya: అయోధ్యలో బాంబు దాడులకు స్కెచ్, నిఘా వర్గాలు సమాచారంతో అలర్టయిన ఉత్తర ప్రదేశ్ పోలీసులు, హిందూ-ముస్లింల మధ్య అల్లర్లను రేపేందుకు జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ కొత్త స్కెచ్
ఇప్పటికే హోం మంత్రి అమిత్ షా అయోధ్యలో ఆకాశమంత రామాలయాన్ని నిర్మిస్తామని తెలిపారు. అయితే ఇప్పుడు అయోధ్యలో రామాలయ నిర్మాణం కోసం పనులు ప్రారంభమవుతున్న ఈ సమయంలో ఓ వార్త ఇప్పుడు అయోధ్య ప్రజలనే కాకుండా దేశ ప్రజలను కూడా కలవరపెడుతోంది.
Ayodhya, December 25: అయోధ్య తీర్పు తర్వాత రామాలయ నిర్మాణం పనులు అక్కడ త్వరలో ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే హోం మంత్రి అమిత్ షా అయోధ్యలో ఆకాశాన్ని తాకేలా రామాలయాన్ని నిర్మిస్తామని తెలిపారు. అయితే ఇప్పుడు అయోధ్యలో రామాలయ నిర్మాణం కోసం పనులు ప్రారంభమవుతున్న ఈ సమయంలో ఓ వార్త ఇప్పుడు అయోధ్య ప్రజలనే కాకుండా దేశ ప్రజలను కూడా కలవరపెడుతోంది. నిఘా వర్గాలు అందించిన ఓ సమాచారంతో ఇప్పుడు యూపీ పోలీసులు(Uttar Pradesh Police) అలర్ట్ అయ్యారు. దేశంలో ఐక్యంగా ఉన్న హిందూ-ముస్లింల మధ్య అల్లర్లను రేపేందుకు (possible terror strikes) ఉగ్రవాదాలు స్కెచ్ రెడీ చేసిననట్లుగా నిఘా వర్గాలు గుర్తించాయి.
అయోధ్య నగరమంతా (Ayodhya city) బాంబు పేలుళ్తో దద్దరిల్లిపోవాలని పాకిస్తాన్ కు చెందిన ఉగ్రసంస్థ జైషేమహమ్మద్ (Jaish-e-Mohammed terrorists)నిర్ణయించిందని, ఈ మేరకు జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ (Pakistan-based JeM chief Masood Azhar)తమ ముఠా సభ్యులకు ఫోన్ కాల్ చేసినట్లు నిఘా వర్గాలు కనిపెట్టి యూపీ పోలీసులకు సమాచారమందించారు. గత వారం నేపాల్ సరిహద్దు గుండా ఏడుగురు పాకిస్తాన్ కి చెందిన ఉగ్రవాదులు భారత్ లోకి ప్రవేశించారు.
ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్ పూర్,అయోధ్య నగరాల్లో దాక్కొని ఉండాలని వారికి జైషే మహమ్మద్ నుంచి ఆదేశాలు ఉన్నాయని తెలిపారు. అయితే ఆ ఏడుగురు ఇప్పటికీ దొరకుండా తిరుగుతున్నట్లు నిఘా వర్గాలు తెలిపాయి. నిఘా వర్గాల సమాచారంతో యూపీ పోలీసులు అలర్ట్ అయ్యారు.
అయోధ్యలో భద్రతను మరింత టైట్ చేశారు. వారిని యూపీ పోలీసులు జల్లెడ పడుతున్నారు. ఏడుగురిలో ఐదుగురు ఉగ్రవాదులను అబూ హమ్జా, మహ్మద్ యాకుబ్, నిసార్ అహ్మద్, మహ్మద్ షాబాజ్, మరియు మహ్మద్ కౌమి చౌదరిగా పోలీసులు గుర్తించారు. దశాబ్దాల నాటి అయోధ్య భూవివాదం కేసులో గత నెలలో సుప్రీంకోర్టు చారిత్రాత్మకమైన తీర్పు వెల్లడించిన విషయం తెలిసిందే.
టెలిగ్రామ్ ( Telegram)అనే సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ద్వారా, భారత గడ్డపై "నక్షత్ర మరియు అద్భుతమైన" దాడులను ("stellar and spectacular" ) నిర్వహించాలని ఉగ్రవాదులకు జైషే మహమ్మద్ చీఫ్ అజార్ విజ్ఞప్తి చేసినట్లుగా ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఇయాన్స్ కథనం వెలువరించింది.