Jammu And Kashmir: ఎన్నాళ్లో వేచిన నిమిషం, 5 నెలల తర్వాత జమ్మూకశ్మీర్‌లో ప్రారంభమైన ఇంటర్నెట్ సేవలు, ఆర్టికల్‌ 370 రద్దుతో మూగబోయిన ఫోన్లు, సుప్రీంకోర్టు అభ్యంతరాలతో అక్కడ తొలగిపోతున్న ఆంక్షలు

ఆర్టికల్‌ 370 రద్దు(Article 370) తర్వాత మూగబోయిన ఇంటర్నటె్ సేవలు ఇప్పుడు మళ్లీ అందుబాటులోకి వచ్చాయి.ల్యాండ్‌లైన్‌ ఫోన్లు, ఇంటర్నెట్‌ వినియోగానికి ఇప్పటికే కేంద్రం అనుమతులివ్వగా.. 5 నెలల తర్వాత శనివారం కశ్మీర్‌లో ప్రీపెయిడ్‌ మొబైల్‌ ఫోన్‌ సర్వీసులను పునరుద్ధరించారు.

Pedestrians in Kashmir | (Photo Credits: IANS)

Srinagar, January 19: జమ్మూకాశ్మీర్ ( Jammu and Kashmir)ప్రజలు ఇప్పుడు ఎన్నాళ్లో వేచిన ఉదయానికి బదులుగా ఎన్నాళ్లో వేచిన నిమిషం అంటూ మొబైల్ ఫోన్లతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆర్టికల్‌ 370 రద్దు(Article 370) తర్వాత మూగబోయిన ఇంటర్నటె్ సేవలు ఇప్పుడు మళ్లీ అందుబాటులోకి వచ్చాయి.ల్యాండ్‌లైన్‌ ఫోన్లు, ఇంటర్నెట్‌ వినియోగానికి ఇప్పటికే కేంద్రం అనుమతులివ్వగా.. 5 నెలల తర్వాత శనివారం కశ్మీర్‌లో ప్రీపెయిడ్‌ మొబైల్‌ ఫోన్‌ సర్వీసులను పునరుద్ధరించారు.

ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత జమ్మూకశ్మీర్‌లో విధించిన ఆంక్షలు సుప్రీం (Supreme Court)ఆదేశాలతో ఒక్కొక్కటిగా తొలగిపోతున్నాయి. ఇందులో భాగంగా 2జీ మొబైల్‌ ఇంటర్నెట్‌ (2G Mobile Internet)సేవలనూ పునరుద్ధరిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.

జమ్మూకాశ్మీర్ రాష్ట్రాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా మారుస్తూ నిర్ణయం తీసుకున్న మోడీ సర్కార్

పోస్ట్‌పెయిడ్‌ మొబైల్‌ కనెక్షన్లపై 2జీ ఇంటర్నెట్‌ సేవలను కశ్మీర్‌లోని బండిపోరా, కుప్వారా జిల్లాలకు మాత్రమే పరిమితం చేశారు. దీంతోపాటు కొన్ని పరిమితులతో సాఫ్ట్‌వేర్‌ సర్వీసులు అందించే కంపెనీలకు ల్యాండ్‌ లైన్‌ ద్వారా ఇంటర్నెట్‌ పొందే అవకాశాన్ని కల్పించినట్లు జమ్మూకశ్మీర్‌ ప్రధాన కార్యదర్శి రోహిత్‌ కన్సల్‌ తెలిపారు.

భారీ ఉగ్ర కుట్రను భగ్నం చేసిన శ్రీనగర్ పోలీసులు

ఆంక్షల పాక్షిక సడలింపు ఆదేశాలను వెంటనే అమలు చేయాలని టెలికం సంస్థలకు సూచించాం. అన్ని భద్రత, ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని చెప్పాం’ అని ఆయన అన్నారు. ఈ ప్రీపెయిడ్‌ మొబైల్‌ ఫోన్లకు ఇంటర్నెట్‌ సౌకర్యం ఇచ్చే విషయాన్ని పరిశీలించేందుకు టెలికం సంస్థలు వినియోగదారుల వివరాలను తెలుసుకోవాల్సి ఉంటుందని రోహిత్‌ చెప్పారు.

కేంద్ర పాలిత ప్రాంతాలుగా అవతరించిన జమ్మూ కాశ్మీర్ మరియు లద్దాఖ్

కాగా గత ఏడాది ఆగస్టు నుంచి జమ్మూ కశ్మీర్‌లో టెలికామ్‌ సేవలను ఆపేయగా.. సుప్రీంకోర్టు వారం క్రితం వ్యక్తం చేసిన అభ్యంతరాలతో తాజాగా ఆంక్షల తగ్గింపు మొదలైంది. ‘శనివారం నుంచి వాయిస్, ఎస్‌ఎంఎస్‌ సర్వీసులను పునరుద్ధరిస్తూ సంబంధిత అధికారి ఆదేశాలు జారీ చేశారు. జమ్మూ కశ్మీర్‌ మొత్తమ్మీద ప్రీపెయిడ్‌ సిమ్‌కార్డుల్లో ఇకపై ఈ సేవలు అందుబాటులోకొస్తాయి’ అని రోహిత్‌ వివరించారు.