Encounter In Jammu: కాల్పులుకు తెగబడిన ఉగ్రవాదులు, ముగ్గురు ఉగ్రవాదులు హతం, ఆర్టికల్ 370 రద్దు తర్వాత మళ్లీ కాల్పుల కలకలం, ఉగ్రవాదుల కోసం గాలింపు ముమ్మరం

ఆర్టికల్ 370 రద్దు (Article 370) తర్వాత ప్రశాంతంగా మారిన జమ్మూలో (Jammu) మళ్లీ ఉగ్రవాదులు (terrorists) కాల్పులకు తెగబడ్డారు. ఈ నేపథ్యంలోనే జమ్మూకాశ్మీర్‌లోని (Jammu and Kashmir) శ్రీనగర్-జమ్మూ జాతీయ రహదారిపై ఉన్న బాన్ టోల్ ప్లాజా వద్ద భద్రతాదళాలకు ఉగ్రవాదులకు మధ్య హోరా హోరీ కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో భారత జవాన్లు ముగ్గురు ఉగ్రవాదుల్ని తుదముట్టించారు.

Three Terrorists Gunned Down by Security Forces in Encounter on Jammu-Srinagar National Highway (photo-PTI)

Jammu, January 31: ఆర్టికల్ 370 రద్దు (Article 370) తర్వాత ప్రశాంతంగా మారిన జమ్మూలో (Jammu) మళ్లీ ఉగ్రవాదులు (terrorists) కాల్పులకు తెగబడ్డారు. ఈ నేపథ్యంలోనే జమ్మూకాశ్మీర్‌లోని (Jammu and Kashmir) శ్రీనగర్-జమ్మూ జాతీయ రహదారిపై ఉన్న బాన్ టోల్ ప్లాజా వద్ద భద్రతాదళాలకు ఉగ్రవాదులకు మధ్య హోరా హోరీ కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో భారత జవాన్లు ముగ్గురు ఉగ్రవాదుల్ని తుదముట్టించారు.

జమ్మూ కాశ్మీర్ ను విభచించిన మోడీ సర్కార్

ఈ ఘటనలో ఓ జవాన్ కూడా గాయపడ్డాడు. నగ్రోట టోల్ ప్లాజా వదద్ భద్రతా బలగాలు శుక్రవారం (జనవరి 30) తెల్లవారుఝామున 5 గంటలకు ఓ ట్రక్కును తనిఖీలు చేస్తుండగా ఉగ్రవాదులు జవాన్లపై కాల్పులకు దిగారు. దీంతో వారు కూడా ఎదురు కాల్పులు జరిపారు. ఆగస్టు 5 తర్వాత జమ్మూ కశ్మీర్‌లోని జరిగిన తొలి ఉగ్రదాడి ఇదేనని చెప్పవచ్చు.

భారీ దాడులకు ప్లాన్ చేసిన ఉగ్రవాదులు

ప్రస్తుతం ఆ ప్రాంతంలో భద్రతా సిబ్బంది ఆపరేషన్ జరుగుతోంది.. జమ్మూను శ్రీనగర్‌తో కలిపే రహదారిపై (Jammu-Srinagar National Highway) భద్రతా దళాలు వాహనాల రాకపోకలను నిలిపివేశాయి. జమ్మూ-శ్రీనగర్ హైవేలోని బాన్ టోల్ ప్లాజా వద్ద అనుమానిత ట్రక్కును పోలీసులు అడ్డగించారని జమ్మూ ఇన్ స్పెక్టరు జనరల్ ముఖేష్ సింగ్ (Jammu IG Mukesh Singh) తెలిపారు.

Here's the tweet:

 

అయితే ఆ ట్రక్కులో ప్రయాణిస్తున్న ఉగ్రవాదులు పోలీసులపై కాల్పులు జరిపారని.. దాంతో ఎన్‌కౌంటర్‌ జరిపామని.. ఈ ఘటనలో ఒక ఉగ్రవాది మృతి చెందాడని.. అలాగే ఒక పోలీసు కూడా గాయపడ్డాడని ఆయన తెలిపారు. తీవ్రంగా గాయపడటంతో పోలీసును ఆసుపత్రికి తరలించినట్టు వెల్లడించారు.

శ్రీనగర్‌లో ఉగ్రవాదుల గ్రెనేడ్ దాడి

ఈ ట్రక్కు నుంచి ఏకే-47, కొన్ని రైఫిల్స్, మ్యాగజైన్స్, గ్రనేడ్లను స్వాధీనం చేసుకున్నామని ఆయన తెలిపారు. హతం అయిన ఉగ్రవాదుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని ఈ ఘటనలో గాయపడిన జవాన్ ను హాస్పిటల్ కు తరలించామని జమ్మూ జోన్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు ముఖేష్ సింగ్ తెలిపారు.తెలిపారు.

Here's the tweet:

ట్రక్కులో మరో నలుగురు ఉగ్రవాదులు ఉన్నారని అధికారులు అనుమానిస్తున్నారు. దీంతో భద్రతా దళాలు జాతీయ రహదారి గుండా ఉన్న అటవీ ప్రాంతాలలో గాలింపు చర్యల్ని ముమ్మరం చేశారు. దీంట్లో భాగంగా ఉగ్రవాదులు తప్పించుకోకుండా జమ్ము - కశ్మీర్ జాతీయ రహదారిని మూసివేశారు.

ఆర్టికల్‌ 370 రద్దుతో మూగబోయిన ఫోన్లు

ఉగ్రవాదుల కోసం గాలింపు కొనసాగిస్తున్నారు. వీరు కథువా జిల్లా హీరానగర్ సెక్టార్‌ గుండా దేశంలోకి చొరబడినట్టు అనుమానిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ట్రక్కు క్లీనర్‌ను అదుపులోకి పోలీసులు తీసుకున్నారు.

జమ్మూకాశ్మీర్ రాష్ట్రాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా మారుస్తూ నిర్ణయం తీసుకున్న మోడీ సర్కార్

భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన ఈ ఘటనతో ఉధంపూర్ మండలంలోని అన్ని స్కూల్స్, కాలేజీలను మూసివేయాలని అధికారులు ఆదేశించారు.కాగా..జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించిన ఆర్టికల్ 370 అనంతరం జమ్మూలో ఉగ్రవాదులు భద్రతాదళాలపై కాల్పులకు దిగటం ఇదే మొదటిసారి. ఈ క్రమంలో భారత భద్రతాదళాలు ఉగ్రదాడిని సమర్ధవంతంగా తిప్పికొట్టాయి. ముగ్గురు ఉగ్రవాదులకు హతమార్చాయి.

కేంద్ర పాలిత ప్రాంతాలుగా అవతరించిన జమ్మూ కాశ్మీర్ మరియు లద్దాఖ్

2016 నవంబరులో నగోర్తాలోని ఇండియన్ ఆర్మీ కంటోన్మెంట్‌పై ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఇద్దరు అధికారుల సహా ఏడుగురు సైనికులు ప్రాణాలు కోల్పోయారు. పోలీసు దుస్తుల్లో ఆర్మీ క్యాంప్‌లోకి చొరబడిన ముష్కురులు విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడ్డారు.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

Share Now