Jharkhand: కంగనా రనౌత్ చెంపల కంటే సున్నితమైన రోడ్లు నిర్మిస్తాం, కాంగ్రెస్ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు, గతంలోనూ ఇలాగే కరోనాపై నోరుపారేసుకున్న ఇర్ఫాన్ అన్సారీ

తాజాగా మ‌రో నేత అదేరీతి వ్యాఖ్య‌లు చేశారు. జార్ఖండ్ (Jharkhand) రాష్ట్రంలోని జ‌మ్తారా నియోజ‌క‌వ‌ర్గ ఎమ్మెల్యే ఇర్ఫాన్ అన్సారీ (Irfan Ansari ) త‌న నియోజ‌క‌వ‌ర్గంలోని రోడ్ల‌న్నీ ఇక ముందు బాలీవుడ్ హీరోయిన్ కంగ‌నా ర‌నౌత్ బుగ్గ‌ల్లా నున్న‌ (actor Kangana Ranaut’s cheeks)గా ఉంటాయ‌ని వ్యాఖ్యానించారు.

Ranchi January 15: రోడ్ల‌ను హీరోయిన్‌ల బుగ్గ‌ల‌తో పోల్చ‌డం రాజ‌కీయ నాయ‌కుల‌కు అల‌వాటుగా మారింది. తాజాగా మ‌రో నేత అదేరీతి వ్యాఖ్య‌లు చేశారు. జార్ఖండ్ (Jharkhand) రాష్ట్రంలోని జ‌మ్తారా నియోజ‌క‌వ‌ర్గ ఎమ్మెల్యే ఇర్ఫాన్ అన్సారీ (Irfan Ansari ) త‌న నియోజ‌క‌వ‌ర్గంలోని రోడ్ల‌న్నీ ఇక ముందు బాలీవుడ్ హీరోయిన్ కంగ‌నా ర‌నౌత్ బుగ్గ‌ల్లా నున్న‌ (actor Kangana Ranaut’s cheeks)గా ఉంటాయ‌ని వ్యాఖ్యానించారు. ఈ మేర‌కు 14 వ‌ర‌ల్డ్ క్లాస్ ర‌హ‌దారుల నిర్మాణం త్వ‌ర‌లో ప్రారంభం కానుంద‌ని చెప్పారు.

ఈ వ్యాఖ్య‌లను ఆయ‌న ఏ స‌మావేశంలోనో, బ‌హిరంగ స‌భ‌లోనో, ప్రెసెమీట్‌లోనో చేయ‌లేదు. త‌న ఇంట్లో కూర్చుని సెల్ఫీ వీడియో(Selfie video) తీసుకుంటూ చెప్పారు. అనంత‌రం ఈ వీడియోను ట్విట్ట‌ర్‌లో పోస్టు చేశారు. ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఈ వారం ప్రారంభంలోనే కరోనా ఉధృతి సమయంలో మాస్క్‌లు ఎక్కువ సేపు ధరించకూడదని, హానికరం అంటూ చేసిన వ్యాఖ్యలు పెద్ద వివాదానికి తెరలేపాయి.

ఆ వివాదం సద్దుమణిగిపోక మునుపే తాజాగా మళ్లీ ఇలాంటి వివాదస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచాడు. అయితే రాజకీయనాయకులు తమకు ఇష్టమైన నటీమణులతో రహదారులను పోల్చడం కొత్తేమి కాదు. 2005లో, ఆర్‌జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, నటి హేమమాలిని చెంపలలాగా బీహార్ రోడ్లను సున్నితంగా చేస్తానని వాగ్దానం చేసినప్పుడు పెద్ద దుమారం రేగింది. అంతేకాదు గత నెల మహారాష్ట్ర మంత్రి సీనియర్ శివసేన నాయకుడు గులాబ్రావ్ పాటిల్ తన నియోజకవర్గంలోని రోడ్లను హేమా మాలిని చెంపలతో పోలుస్తూ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర మహిళా కమిషన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో క్షమాపణలు చెప్పవలసి వచ్చిన సంగతి తెలిసిందే.



సంబంధిత వార్తలు

Congress MLA Aadi Srinivas: ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు, కేటీఆర్ అరెస్ట్ తర్వాత విధ్వంసానికి బీఆర్ఎస్ కుట్ర...రూ.100 కోట్లు ఖర్చు చేసేందుకు ప్లాన్ చేశారని కామెంట్

Telangana Assembly Sessions: అసెంబ్లీని కుదిపేసిన ఫార్ములా ఈ కార్ రేసు అంశం, కేటీఆర్‌కు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని బీఆర్ఎస్ డిమాండ్, కేసు విచారణలో ఉన్న నేపథ్యంలో కుదరదన్న ప్రభుత్వం

Vijay on Amit Shah Comments: డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై మండిపడిన హీరో విజయ్, కొంతమందికి అంబేద్కర్ పేరు అంటే ఎలర్జీ అని వెల్లడి

CM Siddaramaiah: అమిత్ షా వ్యాఖ్యలు రాజ్యాంగ నిర్మాతను అవమానించడమే, వీడియోని షేర్ చేస్తూ మండిపడిన కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య

00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif