Jharkhand Shocker: జార్ఖండ్ రాష్ట్రంలో దారుణం, నిన్ను రెండో పెళ్లి చేసుకుంటానన్న యువకుడు,యువతి ఒప్పుకోకపోవడంతో పెట్రోల్ పోసి తగలబెట్టేశాడు

జర్ముండి ప్రాంతంలోని భాల్కి గ్రామానికి చెందిన మహిళను కుటుంబ సభ్యులు స్థానిక ఆసుపత్రికి తరలించారని అధికారి తెలిపారు.

Representational image | Photo Credits: Flickr

Dumka, Oct 7: జార్ఖండ్‌లోని దుమ్కా జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున 22 ఏళ్ల మహిళ తన వివాహ ప్రతిపాదనను తిరస్కరించిందనే కోపంతో ఓ వ్యక్తి ఆమెకు నిప్పంటించారని (22-Year-Old Woman Set on Fire) పోలీసు అధికారి తెలిపారు. జర్ముండి ప్రాంతంలోని భాల్కి గ్రామానికి చెందిన మహిళను కుటుంబ సభ్యులు స్థానిక ఆసుపత్రికి తరలించారని అధికారి తెలిపారు.

కాగా నిందితుడు ఇప్పటికే వివాహితుడు. అతన్ని అరెస్టు చేసినట్లు జర్ముండి సబ్ డివిజనల్ పోలీసు అధికారి (ఎస్‌డిపిఓ) శివేందర్ ఠాకూర్ పిటిఐకి తెలిపారు. జిల్లాలో మరొక మైనర్ బాలిక తన అడ్వాన్స్‌లను తిరస్కరించినందుకు ఒక వ్యక్తి చేత నిప్పంటించబడిన వారాల తర్వాత ఇది జరిగింది.ఆ అమ్మాయి చికిత్స పొందతూ చనిపోయింది.

డాక్టర్‌తో పురుషుడి సెక్స్ ఛాటింగ్, అమ్మాయి ఛాట్ చేస్తుందనుకుని రూ. కోటి ముట్టచెప్పిన డాక్టర్, నిందితుడిని అరెస్ట్ చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు

ఎస్‌డిపిఓ ఠాకూర్ తెలిపిన వివరాల ప్రకారం.. బాధితురాలిని పెళ్లి చేసుకోవాలనుకున్న (Rejecting Marriage Proposal in Dumka) స్థానిక వ్యక్తి శుక్రవారం ఉదయం ఆమె ఇంట్లోకి ప్రవేశించి, ఆమె నిద్రిస్తున్న సమయంలో పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఆమెను కుటుంబ సభ్యులు ఫూలో జానో మెడికల్ కాలేజ్ మరియు ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఆమెను రాజేంద్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (RIMS)కి రిఫర్ చేశారు.

కాగా గత నెల, దుమ్కాలో 14 ఏళ్ల గిరిజన బాలిక చెట్టుకు ఉరి వేసుకుని కనిపించింది.దుమ్కాలో మైనర్ బాలికలకు సంబంధించిన రెండు సంఘటనలు ప్రస్తుతం నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ (NCPCR) మరియు నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ (NCW)తో సహా వివిధ సంస్థలచే విచారణలో ఉన్నాయి.