Jharkhand: బాలికను పొదల్లోకి లాక్కెళ్లి అత్యాచారం, కోపంతో కామాంధులను పెట్రోల్ పోసి తగలబెట్టిన గ్రామస్థులు, ఒకరు మృతి, మరొకరి పరిస్థితి విషమం, జార్ఖండ్ రాష్ట్రంలో ఘటన

ఈ ఘటనలో ఒక యువకుడు మృతి చెందాడు. మరో యువకుడు కాలిన గాయాలతో ఆస్పత్రి పాలయ్యాడు. ఈ ఘటన జార్ఖండ్‌లోని (Jharkhand) గుమ్లా జిల్లాలో చోటు చేసుకుంది.

Representational Image | (Photo Credits: IANS)

Basua, June 9: బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఇద్దరు యువకులపై గ్రామస్తులు పెట్రోల్ పోసి (set afire in Basua village) నిప్పంటించారు. ఈ ఘటనలో ఒక యువకుడు మృతి చెందాడు. మరో యువకుడు కాలిన గాయాలతో ఆస్పత్రి పాలయ్యాడు. ఈ ఘటన జార్ఖండ్‌లోని (Jharkhand) గుమ్లా జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..బుధవారం బంధువుల ఇంటికి వెళ్లిన ఓ కుటుంబం.. సాయంత్రం స్వగ్రామానికి వెళ్లేందుకు బస్టాప్‌లో ఎదురు చూస్తోంది.

ఆ సమయంలో ఆ కుటుంబం పక్క ఊరిలో ఉండే సునీల్‌ ఉన్‌రావ్‌ అనే వ్యక్తి వాళ్ల దగ్గరకు వచ్చాడు. అతని కూడా బైక్‌ మీద స్నేహితుడు కూడా ఉన్నాడు. బాగా ఆలస్యం అయ్యేట్లు ఉందని, కనీసం అమ్మాయినైనా తమతో పంపించమని అడిగాడు. బాగా దగ్గరి వాడే కదా నమ్మి కూతురిని అని బైక్‌ మీద పంపించారు ఆ తల్లిదండ్రులు.

వీరు అమ్మాయిని ఇంటికి తీసుకువెళ్లకుండా పొదల్లోకి తీసుకువెళ్లి అత్యాచారం చేశారు.పక్క ఊరి శివారులో ఒక అమ్మాయి స్పృహ లేకుండా పడి ఉందన్న సమాచారం వీళ్లకు అందింది. తనపై జరిగిన లైంగికదాడిని బాధిత బాలిక తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో బాలిక తల్లిదండ్రులు, స్థానికులు కలిసి పక్క గ్రామానికి వెళ్లి ఆ ఇద్దరు యువకులను పట్టుకున్నారు. అనంతరం బాధితురాలి గ్రామానికి తీసుకొచ్చి వారిపై దాడి ( Two rape accused thrashed) చేశారు. ఆగ్రహించిన గ్రామస్తులు సదరు యువకులపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. వారి బైక్‌ను కూడా తగులబెట్టారు.

మరో పరువు హత్య, దళిత యువకుడిని ప్రేమించిందనే కోపంతో కూతురిని చంపేసిన తల్లిదండ్రులు, కర్ణాటకలో దారుణ ఘటన

ఒక యువకుడు మృతి చెందగా, మరో యువకుడు రాంచీలోని రిమ్స్‌లో చికిత్స పొందుతున్నాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. బాధిత బాలికను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. దాడి జరిగిన గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీగా మోహరించారు.ఈ ఘటనలో కేసు బుక్‌ చేసుకున్న పోలీసులు.. ఆరుగురిపై హత్య కేసు నమోదు చేశారు.