S.Muralidhar: ఢిల్లీ అల్లర్లు..అర్థరాత్రి విచారణ చేసిన న్యాయమూర్తి బదిలీ, పంజాబ్-హరియాణా హైకోర్టుకు బదిలీ అయిన ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్ మురళీధర్, తక్షణమే అమల్లోకి ఉత్తర్వులు
ఆయనను పంజాబ్-హరియాణా హైకోర్టుకు (Punjab & Haryana High Court) బదిలీ చేస్తూ కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది. దీనికి సంబంధించిన గెజిట్‌పై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ (President Ram Nath Kovind) సంతకం చేశారు. తక్షణమే ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు.
New Delhi, February 27: రెండు రోజులుగా ఈశాన్య ఢిల్లీలో (North-East Delhi) జరుగుతున్న అల్లర్లకు సంబంధించిన పిటీషన్లపై అర్థరాత్రి విచారణ జరిపి, సత్వర ఆదేశాలు జారీ చేసిన ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్ మురళీధర్ (Justice S Murlidhar) బదిలీ అయ్యారు. ఆయనను పంజాబ్-హరియాణా హైకోర్టుకు (Punjab & Haryana High Court) బదిలీ చేస్తూ కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది. దీనికి సంబంధించిన గెజిట్‌పై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ (President Ram Nath Kovind) సంతకం చేశారు. తక్షణమే ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు.
సీఏఏ హింసపై మండిపడిన ఢిల్లీ హైకోర్టు
సుప్రీంకోర్టు కొలీజియం - భారత ప్రధాన న్యాయమూర్తి శరద్ ఎ బొబ్డే నేతృత్వంలోని సుప్రీంకోర్టులోని ముగ్గురు అత్యున్నత న్యాయమూర్తుల ప్యానెల్ - ఫిబ్రవరి 12 న జస్టిస్ మురళీధర్ బదిలీకి సిఫారసు చేసింది. అయితే ఢిల్లీ హైకోర్టు బార్ అసోసియేషన్ ఈ సిఫారసును ఖండించింది.
అంతేకాదు ఇందుకు నిరసనగా ఫిబ్రవరి 20 న హైకోర్టు న్యాయవాదులు ఒక రోజు పనికి దూరంగా ఉండి నిరసన తెలిపారు. వాస్తవానికి ఫిబ్రవరి 12 న జరిగిన సమావేశంలో కొలీజియం సిఫారసు చేయాలని నిర్ణయించినా, ఫిబ్రవరి 19 న దీనిని బహిరంగపరిచింది.
Government's Notification:
కాగా ఢిల్లీ దాడులకు సంబంధించి దాఖలైన పిటిషన్‌పై ఆయన బుధవారం అర్థరాత్రి తన నివాసంలో విచారణ జరిపారు. ఈ సందర్భంగా ఆయన పోలీసుల తీరును తప్పబట్టారు. ఒక వర్గానికి చెందిన క్షతగాత్రులను సురక్షితంగా ఆసుపత్రికి తరలించడాన్ని అడ్డుకోవద్దని ఢిల్లీ పోలీసులను ఆదేశించారు. అవసరమైతే క్షతగాత్రుల తరలింపులో సహకరించాలని కూడా సూచించారు. ఢిల్లీ పోలీసులకు కొన్ని కీలక సూచలను సూచిస్తూ మూడు పేజీల తీర్పు పాఠాన్ని వినిపించారు.
ఢిల్లీ అల్లర్లపై స్పందించిన ప్రధాని మోదీ
ఈ విచారణ చేపట్టి 24 గంటలు కూడా గడవక ముందే ఎస్ మురళీధర్ బదిలీ కావడం సంచలనంగా మారింది. ఇదిలావుంటే జస్టిస్ మురళీధర్ 1987 లో ఢిల్లీ కోర్టుకు రావడానికంటే ముందు 1984 లో చెన్నైలో తన న్యాయ ప్రాక్టీసును ప్రారంభించారు. మే 2006 లో ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఢిల్లీ హైకోర్టులో, జస్టిస్ మురళీధర్ సున్నితమైన విషయాలలో కీలకమైన తీర్పులు ఇచ్చారు.
కాగా, పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తున్న, సమర్ధిస్తున్న వర్గాల మధ్య రెండు రోజులుగా జరుగుతున్న అల్లర్లలో బుధవారం నాటికి మృతుల సంఖ్య 27కి చేరింది. రెండు వందల మందికి పైగా గాయాలపాలయ్యారు. బుల్లెట్ గాయాలు, కత్తులు, ఇతర ప్రాణాంతక ఆయుధాల కారణంగా అయిన గాయాల కన్నా.. తరుముకొస్తున్న దుండగుల బారి నుంచి తప్పించుకోవడం కోసం ఇళ్ల పై అంతస్తుల నుంచి దూకడం వల్ల చోటు చేసుకున్న గాయాలే ఎక్కువగా కనిపిస్తున్నాయని క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్న వైద్యులు వెల్లడించారు.