Kanpur Encounter: వికాస్ దూబే ప్రధాన అనుచరుడిని ఎన్‌కౌంటర్‌ చేసిన పోలీసులు, మరోసారి పోలీసుల నుంచి తప్పించుకున్న వికాస్‌ దూబే, 200 మంది పోలీసులపై విచారణ చేపట్టిన ఉన్నతాధికారులు

హిమాచల్‌ప్రదేశ్‌లోని హమీర్‌పూర్‌లో ఈ రోజు ఉదయం అమర్‌ దూబేను ప్రత్యేక పోలీసులు కాల్చి చంపారు. కాన్పూర్‌ ఘటనలో (Kanpur Encounter Case) ప్రధాన నిందితుల్లో ఒకరైన అమర్‌ దూబే బుధవారం ఉదయం ఎన్‌కౌంటర్‌లో చనిపోయాడని ఉత్తరప్రదేశ్‌ అదనపు డీజీపీ ప్రశాంత్‌ కుమార్‌ వెల్లడించారు. అతనికోసం హిమాచల్‌ప్రదేశ్‌ పోలీసులతో కలిసి యూపీ ప్రత్యేక పోలీసులు గాలింపు చేపట్టాయని తెలిపారు. అమర్‌ దూబేపై రూ.50 వేల రివార్డు ఉన్నదని తెలిపారు.

8 policemen killed in Kanpur (Photo Credits: ANI)

Kanpur, July 8: మోస్ట్‌వాంటెడ్‌ క్రిమినల్‌, గ్యాంగ్‌ స్టర్‌ వికాస్‌ దూబే (Vikas Dubey) ప్రధాన సహాయకుడు అమర్‌ దూబేని యూపీ పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేశారు. హిమాచల్‌ప్రదేశ్‌లోని హమీర్‌పూర్‌లో ఈ రోజు ఉదయం అమర్‌ దూబేను ప్రత్యేక పోలీసులు కాల్చి చంపారు. కాన్పూర్‌ ఘటనలో (Kanpur Encounter Case) ప్రధాన నిందితుల్లో ఒకరైన అమర్‌ దూబే బుధవారం ఉదయం ఎన్‌కౌంటర్‌లో చనిపోయాడని ఉత్తరప్రదేశ్‌ అదనపు డీజీపీ ప్రశాంత్‌ కుమార్‌ వెల్లడించారు. అతనికోసం హిమాచల్‌ప్రదేశ్‌ పోలీసులతో కలిసి యూపీ ప్రత్యేక పోలీసులు గాలింపు చేపట్టాయని తెలిపారు. అమర్‌ దూబేపై రూ.50 వేల రివార్డు ఉన్నదని తెలిపారు.  కాన్పూర్ ఎన్‌కౌంటర్‌లో పోలీసులే పాత్రధారులా..? పది మంది పోలీసులు ట్రాన్స్‌ఫర్, గ్యాంగ్ స్టర్ వికాశ్ దూబేకు ముందే సమాచారం అందించినట్టు అనుమానాలు

కాన్పూర్‌లో (Kanpur Encounter) గత గురువారం ఎనిమిది మంది పోలీసులను చంపిన వికాస్‌ దూబే ముఠా సభ్యులు పరారీలో ఉన్నారు. విరికోసం మధ్యప్రదేశ్‌, హర్యానా, రాజస్థాన్‌లో ఉత్తరప్రదేశ్‌కు చెందిన 100కుపైగా స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ బృందాలు గాలిస్తున్నాయి. ఇదిలా ఉంటే కాన్పూర్‌ గ్యాంగ్‌స్టార్‌ వికాస్‌ దూబే మరోసారి పోలీసుల నుంచి తప్పించుకున్నాడు.

ఎనిమిది మంది పోలీసులను చంపి తప్పించుకు తిరుగుతున్న వికాస్‌ దూబే.. ఫరీదాబాద్‌లో ఉన్న బద్కాల్‌ చౌక్‌లోని శ్రీరామ్‌ హోటల్‌లో ఉన్నాడని పోలీసులకు సమాచారం అందింది. దీంతో హర్యానా క్రైమ్‌ బ్రాంచ్‌కు చెందిన పోలీసులు మంగళవారం రాత్రి ఆ హోటల్‌పై దాడి చేశారు. కానీ అతడు అప్పటికే అక్కడి నుంచి పరారయ్యాడు. సీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించగా అతడు హోటల్‌ పరిసరాల్లో తిరిగినట్లు రికార్డయ్యింది. దీంతో సీసీటీవీ హార్డ్‌డిస్క్‌ను పోలీసులు తమవెంట తీసుకుపోయారు. వికాస్ దూబేను పట్టిస్తే 2.5 లక్షల రివార్డు, ఆచూకి తెలిపిన వారి వివరాలు గోప్యం, వెల్లడించిన ఉత్తరప్రదేశ్‌ డీజీపీ హెచ్‌సీ అవస్థీ

ఈ నెల 3వ తేదీన కాన్పూర్‌లో వీకాస్‌ దూబేను పట్టుకోవడానికి వెళ్లిన ఎనిమిది మంది పోలీసులను అతని ముఠా సభ్యులు కాల్చి చంపిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో డీఎస్పీ సహా మొత్తం 8 మంది పోలీసులు నేలకొరిగారు. అప్పటి నుంచి అతడు తప్పించుకు తిరుగుతున్నాడు. దీంతో హర్యానా, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌లో ఉత్తరప్రదేశ్‌కు చెందిన స్పెషల్‌ టాస్క్‌ ఫోర్స్‌ (ఎస్టీఎఫ్‌) పోలీసులు గాంలింపు చేపట్టారు. వికాస్‌ దూబేను వెతకడానికి ఉత్తరప్రదేశ్‌ పోలీసులు సుమారు 100కు పైగా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. డీఎస్పీతో సహా 8 మంది పోలీసులను కాల్చి చంపిన రౌడీషీటర్లు, యూపీలోని కాన్పూర్‌లో కిరాతక ఘటన, తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన సీఎం యోగి ఆదిత్యనాథ్‌

ఈ కేసులో ప్రసుత్తం 200 వందల మంది పోలీసు సిబ్బందిపై ఉన్నతాధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వారందరిని ప్రత్యేకంగా విచారించనున్నారు. వీరిలో చౌబేపూర్‌ స్టేషన్‌కు చెందిన వారితో సహా ఇతర పోలీస్‌ స్టేషన్‌ సిబ్బంది కూడా ఉన్నారు. వీరందరికి వికాస్‌ దుబేతో మంచి సంబంధాలు ఉన్నట్లు ఉన్నతాధికారులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో చౌబేపూర్, బిల్హౌర్, కక్వాన్, శివరాజ్‌పూర్ పోలీస్ స్టేషన్ల నుంచి 200 మందికి పైగా పోలీసులపై విచారణ చేపట్టారు. వీరందరి మొబైల్‌ కాల్‌ రికార్డులను పరిశీలిస్తున్నారు. ఈ ఘటనలో ఇప్పటికే కాన్పూర్‌ పోలీస్‌ స్టేషన్‌కు చెందిన 10 మంది సిబ్బందిని సస్పెండ్‌ చేసిన సంగతి తెలిసిందే.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif