Kanpur Encounter: వికాస్ దూబేను పట్టిస్తే 2.5 లక్షల రివార్డు, ఆచూకి తెలిపిన వారి వివరాలు గోప్యం, వెల్లడించిన ఉత్తరప్రదేశ్‌ డీజీపీ హెచ్‌సీ అవస్థీ
Vikas Dubey, Main Accused in Kanpur Encounter (Photo Credits: ANI)

Lucknow, July 6: ఉత్తరప్రదేశ్‌లో ఎనిమిది మంది పోలీసులను పొట్టనబెట్టుకున్న (Kanpur Encounter) గ్యాంగ్‌స్టర్‌ వికాస్ దూబే‌ (Vikas Dubey) తలపై పెట్టిన నగదు బహుమతిని మరోసారి పెంచారు. గ్యాంగ్‌స్ట‌ర్ వికాశ్ దూబేను ప‌ట్టిస్తే రూ.2.5 ల‌క్ష‌లు రివార్డు ఇస్తామ‌ని ఉత్త‌ర‌ప్ర‌దేశ్ పోలీసులు ప్ర‌క‌టించారు. వికాశ్ దూబేపై ఉన్న రివార్డును పెంచిన‌ట్లు యూపీ డీజీపీ (UP DGP) కార్యాల‌యంలో ఓ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్న‌ది.

కాన్పూర్‌లో జ‌రిగిన ఎన్‌కౌంట‌ర్‌లో వికాశ్ దూబేనే ప్ర‌ధాన నిందితుడు. ఆ కాల్పుల్లో 8 మంది పోలీసులు మృతి చెందిన విష‌యం తెలిసిందే. ఈ ఘ‌ట‌న త‌ర్వాత‌ గ్యాంగ‌స్ట‌ర్ వికాశ్ దూబే ఇంటిని అధికారులు కూల్చివేశారు. డీఎస్పీతో సహా 8 మంది పోలీసులను కాల్చి చంపిన రౌడీషీటర్లు, యూపీలోని కాన్పూర్‌లో కిరాతక ఘటన, తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన సీఎం యోగి ఆదిత్యనాథ్‌, రౌడీ మూకల కోసం కొనసాగుతున్న వేట

60 కేసుల్లో నిందితుడిగా ఉన్న వికాశ్‌ను ప‌ట్టుకునేందుకు వెళ్లిన పోలీసుల‌పై ఫైరింగ్ జ‌రిగింది. డీఎస్పీ దేవేంద్ర మిశ్రా సహా 16 మంది పోలీసుల బృందం గురువారం అర్ధరాత్రి అత‌ని ఇంటికి వెళ్లింది. విషయం తెలుసుకున్న రౌడీలు ముందే మాటువేసి దాడి చేశారు. ఈ ఘటనలో దేవేంద్ర మిశ్రా సహా 8మంది పోలీసులు చనిపోయారు. వీరిలో ముగ్గురు ఎస్‌ఐలు, నలుగురు కానిస్టేబుళ్లు ఉన్నారు. ఒక సాధారణ పౌరుడు సహా ఏడుగురికి గాయాలయ్యాయి.

Here's ANI Tweet

వికాస్ దూబేను అతని అనుచరులను పట్టిస్తే 50వేల నగదు బహుమతి ఇస్తామని ఇంతకు ముందు యూపీ పోలీసులు ప్రకటించారు. కానీ వికాస్ దూబే జాడ దోరక్కపోవడంతో నగదు బహుమతిని రూ. లక్షకు పెంచారు. అయినప్పటికీ ఫలితం లేకపోవడంతో ఆ నగదు బహుమతి ఏకంగా 2.5లక్షలు పెంచినట్లు సోమవారం ఉత్తరప్రదేశ్‌ డీజీపీ హెచ్‌సీ అవస్థీ వెల్లడించారు. భారత్-నేపాల్ సరిహద్దుకు సమీపంలో ఉన్న చెక్ పోస్ట్ వద్ద దూబే ఫోటోను ఉంచామన్నారు.

అతని ఆచూకి తెలియజేసినవారి వివరాలను రహస్యం ఉంచడంతో పాటు నగదు బహుమతి అందిస్తామని డీజేపీ పేర్కొన్నారు. దూబే చివరిసారిగా యూపీలోని ఆరయ్య ప్రాంతంలో గుర్తించినట్లు సమాచారం. అతను మధ్యప్రదేశ్‌ లేదా రాజస్తాన్‌ పారిపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్పటికే వికాస్ దూబే ప్రధాన అనుచరుడు దయా శంకర్ అగ్ని హోత్రిని యూపీ పోలీసులు కల్యాణ్‌ పూర్‌ లో అరెస్టు చేశారు. వికాస​ దూబేను పట్టుకోవడం కోసం దాదాపు 25 బృందాలు రంగంలోకి దిగాయి.