Karnataka: హోటల్ గదిలో స్నేహితురాలితో ఏకాంతంగా.., తర్వాత ఆ సీన్ పోర్న్ వెబ్‌సైట్లో చూసి షాక్, వెంటనే వీడియోని తొలగించాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన యువకుడు

బెంగుళూరులోని హోటల్‌లో తన స్నేహితురాలితో ఏకాంతంగా గడిపిన వీడియో (finding his private video) ఇంటర్నెట్లో ప్రత్యక్షమవడంతో ఓ యువకుడు ఖంగుతున్నాడు.

Representational Image (Photo Credits: Pixabay)

Bengaluru, Feb 2: కర్ణాటకలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. బెంగుళూరులోని హోటల్‌లో తన స్నేహితురాలితో ఏకాంతంగా గడిపిన వీడియో (finding his private video) ఇంటర్నెట్లో ప్రత్యక్షమవడంతో ఓ యువకుడు ఖంగుతున్నాడు. వెంటనే ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు (Bengaluru youth files complaint) చేశాడు. బెంగళూరు ఆస్టిన్‌టౌన్‌కు చెందిన యువకుడు కొన్నిరోజుల క్రితం హోటల్‌లో స్నేహితురాలితో ఏకాంతంగా గడిపాడు. అయితే వారు ఏకాంతంగా గడిపిన క్షణాలను హోటల్‌లో కొంతమంది దుండగులు రికార్డ్‌ చేశారు.వాటిని అతనికి తెలియకుండా వివిధ ఆశ్లీల వెబ్‌సైట్‌లో (porn sites) అప్‌లోడ్‌ చేశారు.

ఇటీవల ఇంటర్నెట్‌ చూస్తుండగా స్నేహితురాలితో గడిపిన వీడియో పోర్న్ వెబ్‌సైట్‌లో కనిపించింది. గత నెల 21 తేదీన ఇంటర్నెట్‌లో ఈ వీడియో కనిపించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో సైబర్‌ క్రైం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసి ఆ వీడియోలను తొలగించాలని కోరాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముందుగా హోటల్‌ సిబ్బందిని ప్రశ్నించారు. దీనిపై తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది.

యూపీలో మరో హత్రాస్ ఘటన, యువతిపై సామూహిక అత్యాచారం, ఆపై దారుణంగా హత్య చేసిన కామాంధులు, అర్థరాత్రి అంత్యక్రియలు చేయాలని పోలీసులు బెదిరింపులు, బాధితురాలి కుటుంబ సభ్యుల ఆరోపణలను ఖండించిన పోలీసులు

మరో ఘటనలో హుబ్లీ తాలూకా బ్యాహట్టి గ్రామంలో అత్త వేధింపులకు అల్లుడు బలయ్యాడు. మహమ్మద్‌రఫిక్‌ నదాఫ్‌ అనే వ్యక్తి భార్య అసామతో కలిసి గ్రామంలోనే తన అత్త సాహెబీ ఇంటి ఎదుటనే నివాసం ఉంటున్నాడు. అత్తతోపాటు పొరుగింటిలో ఉంటున్న ముదుకప్ప, మాంత్యలు సూటిపోటి మాటలతో వేధిస్తుండటంతో మహమ్మద్‌రఫిక్‌ నదాఫ్‌ మనో వేదనకు గురై సోమవారం రాత్రి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. హుబ్లీ రూరల్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.