Karnataka: వీడియో ఇదిగో, రోడ్డు ప్రమాదంలో ఆటో కింద పడిపోయిన తల్లి, దృశ్యాన్ని చూసిన కూతురు షాక్ నుంచి తేరుకుని వెంటనే చేసిన సాహసం చూస్తే ఫిదా అవ్వాల్సిందే..

కిన్నిగోళి రామనగర్ లో రోడ్డుకు అవతలివైపు నుంచి ఇటువైపు ఉన్న కూతురు దగ్గరికి రావడానికి ప్రయత్నించింది ఓ తల్లి..

Daughter saves mother trapped under auto-rickshaw in serious accident in Mangaluru (Photo-Video Grab)

రోడ్డు ప్రమాదంలో ఆటో కింద చిక్కుకున్న తల్లిని కాపాడుకునేందుకు బాలిక ఆటోను పైకి లేపేందుకు ప్రయత్నించింది.కర్ణాటకలోని మంగళూరులో జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కిన్నిగోళి రామనగర్ లో రోడ్డుకు అవతలివైపు నుంచి ఇటువైపు ఉన్న కూతురు దగ్గరికి రావడానికి ప్రయత్నించింది ఓ తల్లి..

నడిరోడ్డు మీద దారుణ హత్య, మోటర్‌సైకిల్‌పై నుండి ఈడ్చుకెళ్లి యువకుడిని హత్య చేసిన శత్రువులు, వీడియో ఇదిగో..

రోడ్డు మధ్యలోకి వచ్చాక దూసుకొస్తున్న ఆటోను గమనించింది. దీంతో రోడ్డు దాటేందుకు పరుగులు పెట్టింది. చివరి క్షణంలో మహిళను గమనించిన ఆటో డ్రైవర్ ఆమెను తప్పించేందుకు ప్రయత్నించాడు. అయితే, ఆటో వేగంగా వెళుతుండడంతో బ్రేక్ వేసినా ఆగే పరిస్థితి లేదు. దీంతో హ్యాండిల్ ను పక్కకు తిప్పి మహిళను తప్పించాలని డ్రైవర్ ప్రయత్నించాడు.

Here's Video

అతి వేగం కారణంగా ఆటో సదరు మహిళను ఢీ కొట్టి బోల్తా పడింది. ఆటో మీద పడడంతో మహిళ కేకలు పెట్టింది. ఇదంతా చూసిన బాలిక షాక్ నుంచి వెంటనే తేరుకుని అమ్మను కాపాడుకోవడానికి పరుగెత్తుకెళ్లి ఆటోను పైకి లేపేందుకు ప్రయత్నించింది. ఇంతలో ఆటోలో ఉన్న ప్రయాణికులు బయటపడి బాలికకు సాయం చేశారు. ఆటోను పైకి లేపి మహిళను కూర్చోబెట్టారు. గాయాలపాలైన మహిళను దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు.



సంబంధిత వార్తలు

Sukhbir Singh Badal Attacked: వీడియో ఇదిగో, స్వర్ణ దేవాలయంలో పంజాబ్ మాజీ డిప్యూటీ సీఎంపై కాల్పులు, అనుచరులు అలర్ట్ కావడంతో తృటిలో ప్రాణాలతో బయటపడ్డ సుఖ్ బీర్ సింగ్ బాదల్

Earthquake In Hyderabad: వీడియోలు ఇవిగో..హైదరాబాద్‌,ఖమ్మం, వరంగల్‌లో భూకంపం, భూ ప్రకంపనల ధాటికి కూలిన ఇల్లు గోడ, రిక్టార్ స్కేల్‌పై భూకంప తీవ్రత 5.3గా నమోదు

AP Cabinet Meeting Highlights: ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు ఇవిగో, జల్ జీవన్ మిషన్ పథకం ఆలస్యంపై అసంతృప్తి వ్యక్తం చేసిన చంద్రబాబు

Cyclone Fengal Update: తమిళనాడులో ఫెంగల్ తుఫాను విధ్వంసం, రూ. 2వేల కోట్లు మధ్యంతర సాయం ప్రకటించాలని ప్రధాని మోదీకి సీఎం స్టాలిన్ లేఖ, వచ్చే మూడు రోజుల పాటు కేరళ, కర్ణాటక, తమిళనాడుకు భారీ వర్ష సూచన

00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif